అనంతపురం జిల్లా డి.హిరేహాల్ మండలం మల్లికేతి సమీపంలో హెచ్ఎల్సీ కాలువపై ఉన్న వంతెన కూలిపోయింది. సోమవారం తెల్లవారుజామున బొమ్మనహల్ మండలం ఉద్దేహళ్ కు చెందిన 30 మంది కూలీలు డీ హీరేహాల్ మండలం మల్లికేతి గ్రామ సమీపంలోని పొలాల్లో పనిచేసేందుకు వచ్చారు. సాయంత్రం పొలాల్లో పనులు ముగించుకొని మల్లికేతి గ్రామం నుంచి ఉద్దేహాళ్ కు బొలెరో వాహనంలో 30 మంది కూలీలు వెళ్తుండగా మల్లికేతి గ్రామ సమీపంలోని హెచ్ఎల్సీ కాలువపై ఉన్న వంతెన ఉన్నట్టుండి కూలిపోయింది. వంతెన కూలిపోవడంతో బొలెరో వాహనం హెచ్ఎల్సీ కాలవలో పడిపోయింది. సావిత్రమ్మ(35) అనే మహిళ హెచ్ఎల్సీ కాలంలో గల్లంతయింది. చుట్టుప్రక్కల గ్రామస్తులు, రైతులు కలిసి 29 మంది కూలీలను సురక్షితంగా కాపాడి హెచ్ఎల్సీ కాలువ ఒడ్డుకు చేర్చారు. కాలువలో పడిన బొలెరో వాహనాన్ని ట్రాక్టర్లతో లాగి బయటకు తీశారు.


Also Read: Sperm Theft : స్పెర్మ్ దొంగతనం చేసి కవల పిల్లల్ని కన్నదట .. గగ్గోలు పెడుతున్న బిజినెస్ మ్యాన్ ! నమ్ముదామా ?


ఇటీవలె కారు ప్రమాదం 


అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్‌ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. గుంతకల్లు-బళ్లారి 67వ జాతీయ రహదారి మీద ఈ ఘటన చోటుచేసుకుంది. విడపనకల్లు మండలం దొనేకల్లు  గ్రామ శివార్లలోని నిర్మాణం లో ఉన్న  బ్రిడ్జిపై నుంచి ఓ కారు చిన్నపాటి చెరువులోకి దూసుకెళ్లింది.  సుమారు 40 నుంచి 50 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఆ బ్రిడ్జి నిర్మాణంలో ఉంది.. దాని మీద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేవు. అయితే ఈ ప్రమాద సమయంలో కారులో ఐదుగురు ఉన్నట్టు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే.. గుంతకల్‌ డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చీకటి పడటంతో కాస్త ఇబ్బందిగా మారింది. చుట్టుపక్కల గ్రామాస్థులు కూడా.. ఘటన స్థలానికి చేరుకుని.. సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. 


Also Read: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు


Also Read: సోషల్ మీడియాలో భార్య ఫోటోలు.. పిల్లలకు ఎలుకల మందు పెట్టి తానూ తిన్న భర్త


Also Read: తల్లిదండ్రులారా ఊపిరి పీల్చుకోండి.. స్కూల్ ఫీజుల నియంత్రణకు తెలంగాణ సర్కార్ కొత్త చట్టం .. త్వరలోనే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి