Crime News : మనిషి బయటకు మంచోడే. కానీ తలుపులు మూసేస్తేనే అసలు రూపం బయటకు వస్తుంది. ఇలాంటి వాళ్లను ట్రాప్ చేయడానికి కూడా చాలా మంది ఉంటారు. టెక్నాలజీ పెరిగిపోయిన ఈ సమయంలో ఎవరికీ తెలియదనుకుని చెత్త పనులు చేసేవాళ్లు డబ్బుకు డబ్బు..పరువుకు పరువు పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి ఓ వ్యక్తే హైదరాబాద్ గచ్చబౌలిలో నివాసం ఉండే సాయికుమార్. అతనేం చేస్తాడు..ఎక్కడ ఉంటాడు అన్న విషయాలను పక్కన పెడితే.. నాలుగు గోడల మధ్య ఏం చేయబోయాడు.. ఎలా ఇరుక్కుపోయాడో తెలిస్తే.. అలాంటి ట్రాప్‌లలో పడకుండా చాలా మంది బయటపడతారు.
ఇన్‌స్టాగ్రాంలో పరిచయమైన అమ్మాయి న్యూడ్ కాల్‌కు రమ్మంటే ..!
సాయికుమార్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు ఇన్‌స్టా గ్రామ్‌లోనూ ఉంటాడు. చాటింగ్ కూడా చేస్తాడు. ఇలా ఇన్ స్టాలో అందమైన అమ్మాయిల ఫోటోలకు లైకులు కొడుతున్న సమయంలో ఓ యువతి పరిచయం అయింది. చాటింగ్ చేసుకున్నారు. కొంత నమ్మకం కుదిరాక కాల్స్ చేయడం ప్రారంభించారు. అవతల మాట్లాడుతోంది అమ్మాయి కాబట్టి సాయి కుమార్‌కు కన్నుమిన్నూ కనిపించలేదు. ఆ అమ్మాయి గోముగా న్యూడ్ కాల్స్ మాట్లాడుకుందాం అంటే.. మనోడికి ఎక్కడో మత్తుగా అనిపించింది. వెంటనే రూమ్‌లోకి వెళ్లి తలుపులేసుకుని న్యూడ్ కాల్స్ మాట్లాడేశాడు.
వీడియో చూపించి పదే పదే బ్లాక్ మెయిల్ చేసిన యువతి
కానీ తన న్యూడ్ కాల్ వీడయో రికార్డు చేసి తనకే పంపించిన తర్వాతే అసలేం జరిగిందో అర్థం అయింది. మొదట ఆ యువతి కొంత మొత్తం అడిగింది. ఇచ్చాడు. మళ్లీ అడిగింది ఇచ్చాడు. మళ్లీ అడిగింది.. కానీ ఇలా ఎంత కాలం ఇచ్చుకుంటూ పోవాలి అనే డౌట్ వచ్చింది. ఈ సారి డబ్బులిస్తా.. వీడియో డిలీట్ చేస్తావా అని బతిమిలాడాడు. అయితే ఏటీఎం లాంటి వీడియోను ఎలా డిలీట్ చేస్తామని ఆమె అనుకుందేమో కానీ నమ్మకం కలిగించ లేదు. దీంతో ఒక్క సారి వీడియో కాల్ చేసి మాట్లాడినందుకు పదే పదే డబ్బులివ్వాల్సి వస్తుందని.. ఎలాగైనా బయటపడాలని.. నిర్ణయించుకున్నాడు. పరువు పోతే పోయిందని బయటపడ్డాడు.
చివరికి పోలీసుల్ని ఆశ్రయించిన యువకుడు
తనను ఓ యువతి వీడియో కాల్‌లో మోసం చేసిందంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆ యువతి ఫోటోలను .. వాట్సాప్ చాట్‌లను కూడా పోలీసులకు ఇచ్చారు. తనలాగే చాలా మందిని బెదిరించిదని.. సాయికుమార్ చెబుతున్నారు. ఇతర బాధితులు ఎవరైనా వస్తే వారి కేసులను కలిపి విచారణ చేసే అవకాశం ఉంది. అయితే ఇలాంటి బాధితులు ఒక్క సాయి కుమారే కాదని చాలా మంది ఉన్నారని కొంత కాలంగా మన చుట్టూ వెలుగు చూస్తున్న ఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. అయితే బలహీన మైన మనస్థత్వం.. అమ్మాయితో న్యూడ్ కాల్ అంటే ఆశపడిపోతున్న వారు మాత్రం ట్రాప్‌లో ఇరుక్కుంటున్నారు.
రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ల హల్ చల్, రాత్రుళ్లు ఒంటరిగా బయటకు వెళ్తే అంతే!