East Godavari News : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, ధవళేశ్వరం, బొమ్మూరు ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచుల ఆగడాలకు అడ్డాగా మారాయి. ఈ బ్లేడ్ బ్యాచ్ లకు స్థానిక నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయని, అందుకే ఇలా చెలరేగిపోతూ వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.  కాలినడకన వెళ్లే ప్రజలను ఆపి దాడి చేసి మరి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ఘటనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి.  ధవళేశ్వరం పారిశ్రామిక వాడలో బ్లేడ్ బ్యాచుల వీరంగం నడుస్తోంది. రాత్రి అయితే చాలు ఈ బ్యాచ్ల ఆగడాలు పెచ్చు మీరుతున్నాయి. 


బ్లేచ్ బ్యాచ్ వీరంగం 


ఇండస్ట్రీయల్ ఎస్టేట్లోని ఓ సంస్థలో పనిచేసే ఇద్దరు యువకులు పని ముగించుకుని రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు హైవే సెంటర్లో ఉన్న పెట్రోల్ బంకు వద్దకు వెళ్లి పెట్రోల్ నింపుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరు బ్లేడ్ బ్యాచ్ కు చెందిన యువకులు బైక్ పై వెళ్తూ వారిని చూశారు. పెట్రోలు నింపుకుంటున్న ఆ ఇద్దరు యువకులని గమనించి వారి వద్దకు వెళ్లి ఫోన్  ఒకసారి ఇమ్మని అడిగారు. దీనికి పెట్రోల్ నింపుకుంటున్న యువకులు అంగీకరించలేదు.  దీంతో బ్లేడ్ బ్యాచ్ యువకులు ఒకసారిగా రెచ్చిపోయి ఆ యువకుల చెంపలు చెల్లుమనిపించి వారి వద్ద నుంచి రెండు ఫోన్ లు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఫోన్ల ఖరీదు రూ.32 వేల వరకు ఉంటుందని బాధితులు చెబుతున్నారు. దీనిపై మంగళవారం రాత్రి బాధిత యువకులు బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధవలేశ్వరం ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పోలీసులు పెట్రోలింగ్ తో  నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.


గత కొన్నేళ్లుగా రాజమండ్రి రూరల్ లో ఇదే పరిస్థితి 


నిజానికి బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు రాజమండ్రికి కొత్తేమీ కాదు. గత 15 ఏళ్లుగా రాజమండ్రి, రాజమండ్రి రూరల్ పరిసర ప్రాంతాలలో కొందరు బ్యాచులుగా ఏర్పడి వీరంగం సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒంటరిగా వెళ్తున్న వారే వీరి టార్గెట్ కాగా వారి వద్ద విలువైన వస్తువులు, బంగారు వస్తువులు, డబ్బు లాక్కుని పరారవుతుంటారు. ప్రతిఘటిస్తే బ్లేడ్లతో బెదిరిస్తారు. లేదంటే బ్లేడ్లతో దాడికి పాల్పడతారు.  గతంలో షేవింగ్ బ్లేడ్లతో దానికి పాల్పడిన ఈ బ్యాచులు తమ పంథా మార్చుకున్నారు. ఇప్పుడు సర్జికల్ బ్లేడ్లతో తెగబడుతున్నారు. రాజమండ్రి రూరల్ పరిధిలో ఇటీవల సర్జికల్ బ్లెడ్లతో ఇద్దరిపై దాడికి తెగబడి వారి వద్ద విలువైన వస్తువులను అపహరించారు ఈ బ్యాచ్. పోలీసులు రాత్రుళ్లు నిఘా పెంచాలని కోరుతున్నారు. 


Also Read: Viral News: నడిరోడ్డుపై నగ్నంగా నడుచుకుంటూ వెళ్లిన అత్యాచార బాధితురాలి వీడియో వైరల్, కేసు నమోదు


Also Read : Khammam News : ఖమ్మం జిల్లాలో మరో సూది మందు హత్య, పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి భార్యను మర్డర్ చేసిన భర్త!