Viral News: 15 ఏళ్ల అమ్మాయి. నగ్నంగా రెండు కిలో మీటర్లు నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. ఇది చూసిన ఓ మహిళ వీడియో తీసి నెట్టింట పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ మోరాదాబాద్ లో జరిగిన ఈ అమానుష ఘటన.. చాలా రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది.  


అసలేం జరిగిందంటే..?


స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... బాధితురాలి వయసు 15 ఏళ్లు. సెప్టెంబర్ 1వ తేదీన బాలిక పక్క గ్రామంలో జరుగుతున్న సంతకు వెళ్లింది. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా.. నితిన్, కపిల్, అజయ్, నాజియా అలీ, ఇమ్రాన్ కలిసి బాలికను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం బాలిక బట్టలు అన్నీ విప్పేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాధితురాలు గట్టిగా అరవడంతో సమీప పొలాల్లో పని చేస్తున్న కూలీలు అటువైపు వచ్చారు. విషయం గుర్తించిన నిందితులు పారిపోయారు. అయితే బాలిక నగ్నంగానే నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులకు జరిగినదంతా చెప్పింది. అయితే బాలిక అలా వెళ్లడాన్ని చూసిన ఓ మహిళ వీడియో తీసి నెట్టింట పెట్టింది.  అది కాస్తా వైరల్ గా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అధికారులు కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. 


అయితే ముందు బాలిక కుటుంబ సభ్యులతో వెళ్లి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని కొందరు చెబుతున్నారు. ఈ ఆరోపణలపై మొరాదాబాద్ ఎస్పీ సందీప్ కుమార్ మీనా దీనిపై వివరణ ఇచ్చారు. తన మేన కోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7వ తేదీన ఫిర్యాదు చేశారని...తాము దర్యాప్తు కూడా ప్రారంభించామన్నారు. కానీ... అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారని వివరించారు. అయినా దర్యాప్తు ఆఫకుండా కొనసాగిస్తున్నట్లు ఒక నిందితుడిని అరెస్టు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. 


బాలికపై రోజూ 10 మందికి పైగా అఘాయిత్యం?


తాజాగా గురుగ్రామ్ కు చెందిన ఓ 14 ఏళ్ల బాలికపై జరుగుతున్న అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. ఓ స్పా సెంటర్ లో ఉద్యోగం కోసం చేస్తున్న బాలికపై రోజూ అత్యాచారం జరుగుతున్నట్లుగా గుర్తించారు. స్పా సెంటర్ నిర్వహకుల మీద అనుమానంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కొన్ని రోజులు స్పా సెంటర్ మీద నిఘా వేసి చివరికి రాత్రి సమయంలో దాడి చేశారు. ఆ బాలికను విచారణ చేయగా, తనను ప్రతిరోజు 15 మంది అనుభవిస్తున్నారని, ఇంత జరగడానికి కారణం పూజా అనే మహిళ, ఆమె బంధువు కారణం అని మైనర్ అమ్మాయి చెప్పింది. తన మీద మొదటి రోజు అత్యాచారం చేసే సమయంలో వీడియో తీశారని, తాను ఉద్యోగం మానేస్తాను అని చెప్పడంతో తన మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారని బాధితురాలు వాపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు స్పా సెంటర్ నిర్వహకుడిని అరెస్టు చేశారు.