యష్ మీద పడి మరి మాళవిక డాన్స్ చేస్తూ ఉంటుంది. ఐ లవ్యూ అని యష్ కి చెప్తూ డాన్స్ చేస్తుంటే అది చూసి వేద చాలా బాధపడుతుంది. అటు అభిమన్యు కూడా చిరాకుగా ఫీల్ అవుతాడు. డాన్స్ చేస్తుంటే యష్ మాళవిక బిడ్డని వదిలేసి వెళ్ళిన సంఘటన గుర్తు చేసుకుంటాడు. తర్వాత డాన్స్ మధ్యలో తన చెయ్యి వదిలిపెట్టడంతో మాళవిక కింద పడిపోతుంది. ఏంటి మాళవిక అందరికీ మన కెమిస్ట్రీ చూపించి ప్రేమ గొప్పతనం చెప్పాలి అనుకుంటే మధ్యలోనే ఆగిపోయావు, నీకు డాన్స్ అయినా లైఫ్ అయినా మధ్యలోనే వదిలేయడం అలవాటే కదా నేనే మర్చిపోయాను. జీవితంలో నాతో కలిసి అడుగులు వేసే అర్హత లేదని ఇప్పటికైనా అర్థం అయ్యిందా అని యష్ కోపంగా అంటాడు. అభి వచ్చి మాళవికని పైకి లేపి తీసుకెళ్లబోతుంటే యష్ ఆగమని అంటాడు.
‘ఫస్ట్ లవ్ గొప్పడే మరచిపోలేని జ్ఞాపకమే. కానీ నువ్వు చేసిన పని వల్ల తలుచుకోడానికే చిరాకుగా ఉంది. నిన్ను పైకి పిలిచింది పాత ప్రేమతోనే చివరికి ప్రూవ్ అయ్యింది మాత్రం నీ అసమర్థత. నాతో బంధాన్ని పంచుకోవాల్సిన నువ్వు అన్నీ వదిలేసి పారిపోయావు, వాటిని ప్రేమతో చేస్తుంది బాధ్యత నిర్వర్తిస్తుంది ఎవరో తెలుసా? వేద.. వైఫ్ ఆఫ్ యశోధర్. అమ్మ అంటే అర్థం వేద, భార్యగా బాధ్యత చేస్తుంది. నువ్వు వెళ్ళినక వచ్చిన వేద గొప్పగా ఉంటుంది. అందుకే నీ వల్ల కాక చేయలేక సగంలో ఆపిన డాన్స్ కూడా తనతోనే చేస్తాను. ఐ యామ్ సోరి వేద. ప్రేమ అనుకుంటున్నా మాళవిక పొగరు అణచాలని నిన్ను స్టేజ్ మీదకి పిలవలేదు. వేదకి నీకు వెలుగుకి చీకటికి ఉన్నంత తేడా ఉంది. నా జీవితంలో ఖుషి పెంపకంలో నీ వల్ల వచ్చిన చీకటి వేద రాకతో వెలుగుగా మారింది. నువ్వు వంద జన్మలు ఎత్తినా వేద కాలి గోటికి కూడా సరిపోవు అని మాళవికని ఘోరంగా అవమానిస్తాడు.
Also Read: హనీకి అమ్మగా మారిన తులసి- కుక్కపిల్లని తెచ్చి పెంచుకోమని నందుకి వార్నింగ్
వేద దగ్గరకి వెళ్ళి నా అడుగులో అడుగేసి నడవగలవా నువ్వు పడకుండా నేను కాపాడుకుంటాను, ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటాను అని కేయి అందిస్తాడు. ఇద్దరు కలిసి అద్భుతంగా డాన్స్ చేస్తారు. మాళవిక నడవలేకపోతుంటే అభి తీసుకెళ్తూ ఉంటాడు. యష్ వచ్చి మాళవికని మరింత రెచ్చగొడతాడు. ‘నిన్ను ప్రేమించి, ఆరాధించిన యష్ నువ్వు దూరం అయిన రోజే చచ్చాడు. నువ్వు నాకు దూరం అయ్యి మంచి పని చేశావు. ప్రేమ అనేది స్పర్శలో ఉండదు గుండె లోతుల్లో ఉంటుంది. చూపుల్లో మాటల్లో తెలుస్తుంది. వాట్ ఈజ్ దిస్ అభిమన్యు నువ్వు పక్కన ఉండగానే మాజీ మొగుడికి పాత ప్రేమ గుర్తు చేస్తుంది. నీ కళ్ల ముందే డాన్స్ చేసింది. నీకు కోపం, బాధ ఇలాంటి ఫీలింగ్స్ ఏమి లేవా. అయినా నీలాంటి వాడికి అలాంటివి ఏమి ఉండవులే. ఇద్దరికీ ఎక్కడ మ్యాచ్ అయినా లేకపోయినా ఇలాంటి ఫీలింగ్స్ దగ్గర బాగా మ్యాచ్ అయ్యింది’ అని అభిని కూడా అవమానిస్తాడు.
వేద యష్ దగ్గరకి వస్తుంది. డాన్స్ అయిపోగానే చెప్పాపెట్టకుండా వచ్చసారే అని వేద అడిగితే ఇక్కడ ఒక ట్రైలర్ లాంఛ్ అయ్యిందిలే అని యష్ అంటాడు. ఎవరిది ఆ అభిమన్యు, మాళవికదా చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా అని వేద అంటుంది. మీ భార్యగా మీరు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ బాగుంది.. ఇప్పటి వరకు ఎప్పుడు అలా అనిపించలేదు.. నచ్చారు అని వేద చెప్పడంతో యష్ చూస్తూ ఉంటాడు.
Also Read: రుక్మిణిని ఇంటి నుంచి వెళ్లిపొమ్మన్న జానకి- రాధని పెళ్లి చేసుకోవడానికి మాధవ్ ఏర్పాట్లు
తరువాయి భాగంలో..
నిధి, వసంత్ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. రింగ్ తొడగమని వసంత్ కి ఇస్తారు కానీ తను చాలా బాధగా లేచి ఈ నిశ్చితార్థం జరగడానికి వీల్లేదు అని చెప్తాడు.