ఆదిత్య బయటకి వెళ్తుంటే సత్య పిలిచి ఆపుతుంది. ఏంటి హడావుడిగా బయల్దేరావ్ ఇంట్లో ఉండవా అని అడుగుతుంది. ముఖ్యమైన పని ఉంది వెళ్తున్న అంటే సత్య బయట వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు కూడా ఇవ్వు అని అరుస్తుంది. సత్య అరుస్తూ ఉంటే దేవుడమ్మ వచ్చి ఏంటి అని అడుగుతుంది. ఆఫీసుకి కాదు బయట పనికి వెళ్తున్నావ్ అన్నావ్ కదా సత్యని కూడా తీసుకెళ్లు అని అంటుంది. లేదమ్మా సత్యని తీసుకెళ్లడం కుదరదు నాకు ముఖ్యమైన పని ఉందని వెళ్ళిపోతాడు. చూశారా ఆంటీ ఎక్కడికో చెప్పడు ఏం చేస్తాడో చెప్పడు అని సత్య అంటుంది. చెప్పలేదంటే మనకి చెప్పి బాధ పెట్టడం ఎందుకని కూడా ఆలోచించు బయటకి వెళ్ళే భర్తని ఎక్కడికి వెళ్తున్నావ్ అని అనుమానిస్తే ఆ కాపురం సక్రమంగా ఉండదని చెప్తుంది.


రాధ దిగులుగా కూర్చుని ఉంటే అదేమీ పట్టనట్టుగా చిన్మయి, దేవి డ్రెస్స్ల గురించి మాట్లాడుకుంటూ ఉండగా రామూర్తి, జానకి చూస్తూ ఉంటారు. ఎప్పుడు గుడికి కూడా వచ్చినోడు కాదు ఇప్పుడు శ్రీశైలం అంటున్నాడు మళ్ళీ ఏదో చేస్తున్నాడని రాధ ఆలోచిస్తూ ఉంటుంది. రామూర్తి శ్రీశైలం గురించి నాన్నతో మాట్లాడతానులే అంటాడు. ఆదిత్య రుక్మిణి ఒకచోట కలుస్తారు.


Also Read: ఒకరికి ఈగో మరొకరికి పొగరు ఇద్దరూ ఇద్దరే -'తగ్గేదే లే' అన్న రిషి, 'వదిలేదే లే' అన్న వసు


ఆదిత్య: ఏంటి రుక్మిణి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఎవరైనా వద్దని అన్నారా నాతో మాట్లాడొద్దని ఆ మాధవ్ గాడు బెదిరించాడా


రుక్మిణి: అదేమీ లేదు పెనిమిటి ఆ మాధవ్ సారు బెదిరిస్తే బెదిరే రోజులు పోయాయి


ఆదిత్య: మరి ఏంటి సమస్య. అన్నీ సార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చెయ్యలేదు


రుక్మిణి: నాకు ఏం చెప్పాలో తెలియడం లేదు నీతో మాట్లాడకుండా ఉంటే నాకు ప్రాణం పోతున్నట్టు ఉంది కానీ సత్య మన విషయంలో చాలా బాధపడుతుంది. అందుకే దేవితో అలా మాట్లాడింది. నీతో మాట్లాడాలంటే సత్తెవ్వ యాదికి వస్తుంది. అందుకే ఫోన్ తియ్యడానికి ఆలోచించా


ఆదిత్య: సత్య గురించి ఆలోచిస్తే మరి నా గురించి దేవి గురించి ఎవరు ఆలోచిస్తారు. నాతోనే పరాయిదానిలా బతుకుతున్న నా బిడ్డ గురించి ఇంకా ఎక్కువ బాధ్యత గురించి ఆలోచించాలి కదా


రుక్మిణి: బిడ్డని ఇవ్వాలని నేను ఆలోచిస్తున్నా కానీ ఆ మాధవ్ సారు శ్రీశైలం పోవాలని అంటున్నాడు. చిన్మయికి దోషం ఉంది నివారణ చేయించాలని అంటున్నాడు కానీ వాడి మాటలు నమ్మడానికి లేదు పెనిమిటి


అప్పుడే అటుగా వెళ్తున్న జానకి ఆదిత్య, రుక్మిణి మాట్లాడుకోవడం చూసి కారు ఆపి వాళ్ళ దగ్గరకి వెళ్తుంది. మాధవ్ అలా ప్రవర్తిస్తున్నాడని ఆఫీసర్కి చెప్తుందా. ఆ పరిస్థితి రాకుండా ముందే నేను మాట్లాడతాను అని వాళ్ళ దగ్గరకి వెళ్లబోతుంది. అప్పుడే రుక్మిణి ఆదిత్యని పెనిమిటి అని పిలుస్తుంది. అది విని జానకి షాక్ అవుతుంది. భర్త గురించి ఎన్ని సార్లు అడిగినా చెప్పలేదంటే కారణం ఇదేనా అని జానకి మనసులో అనుకుంటుంది.


రుక్మిణి దేవుడమ్మ ఇంటికి రావడానికి నిరాకరించిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకుంటుంది జానకి. అంటే ఆదిత్య బాబు రాధ భర్త దేవమ్మ వాళ్ళ బిడ్డ.. ఇందుకేనా రాధ వాళ్ళకి ఎవరికి కనిపించకుండా ఇల్లు దాటకుండా ఉండేది. రాధ ఆ అబ్బాయి భార్య అని తెలిసి కూడా వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడా ఛీ. అంత పెద్ద ఇంటి కోడలు అయ్యి ఉంది ఇలా బిడ్డతో పాటు బయటకి వచ్చి ఉంటుందంటే కారణం ఏంటో తెలియడం లేదు అడిగినా రాధ చెప్పదు కారణం ఏదైనా వాల్మీకి ఆశ్రమం చేరిన సీతమ్మలా మా ఇంటికి చేరింది. తనని పువ్వుల్లో పెట్టి చూసుకోవాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం చాలా తప్పు అని అనుకుంటుంది.


Also Read: వంటలక్కే నా భార్య అన్న కార్తీక్, దీపను పిచ్చిదాన్ని చేసేందుకు స్కెచ్ వేసిన మోనిత!


మాధవ్ తన మాట వినడం లేదని రామూర్తి కూడా చెప్తాడు. మాధవ్ దండాలు పూలు పట్టుకుని పైకి వెళ్ళడం జానకి చూస్తుంది. వాళ్ళ నాన్న మాట కూడా కాదని వీడు శ్రీశైలం ఎందుకు వెళ్తున్నాడో తెలుసుకోవాలి అని జానకి మాధవ్ దగ్గరకి వెళ్తుంది. మాధవ్ రాధ ఫోటో ముందు పెట్టుకుని గిటార్ వెయిస్తూ ఉంటే జానకి చాటుగా చూస్తుంది. రాధ ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి.. కానీ రేపటి నుంచి నీకు ఆ అవకాశం ఉండదు, జీవితాంతం నా నుంచి నువ్వు ఎక్కడికి వెళ్లలేవు రాధ అని మాధవ్ అంటాడు.


ఇక రాధ ఈ ఇంట్లో ఉండటం మంచిది కాదు తనని వెంటనే ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి. రేపటి రోజున వాడు ఏదైనా చేస్తే అని అని జానకి భయపడుతుంది. రాధని జానకి పక్కకి తీసుకొని వస్తుంది. ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అర్థం అయ్యింది ఇక ఏమి కాకూడదని నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని జానకి నగలన్నీ తీసి మూట కట్టి వాటిని రాధకి ఇస్తుంది. ఇంకా ఈ ఇంట్లో నువ్వు ఉండొద్దు రేపు ఉదయాన్నే దేవిని తీసుకుని ఈ ఇంట్లో నుంచి వెళ్లిపో. ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు ఇక నుంచైనా నీకు నచ్చినట్టు బతుకు అని ఎమోషనల్ గా చెప్తుంది. ఏంటి మీరు మాట్లాడేది అని రుక్మిణి అయోమయంగా అడుగుతుంది. ఆఫీసర్ సార్ నీ భర్త అని నాకు తెలుసమ్మా అని చెప్తుంది. కలల ముందు భర్తని పెట్టుకుని తన ముందే నువ్వు నీ బిడ్డ పరాయి వాళ్ళలాగా బతకడానికి నువ్వు ఎంత నరకం అనుభవించావో నాకు తెలుసు అని జానకి అంటుంది.