Horoscope 22 September 2022: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.
మేషం
ఈ రోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఈ రోజు మీరు మీ ఆగిపోయిన కొన్ని పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోకండి లేదంటే తర్వాత పశ్చాత్తాప పడతారు.మీ దినచర్యలో వ్యాయామం చేర్చుకోవడం మంచిది.
వృషభం
ఈ రోజు ఎంత కష్టపడితే అంతే ఫలితం పొందుతారు. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగుల పనితీరుకి ప్రశసంలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి. కొత్త పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు.
మిథునం
ఈ రోజు మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు. మీ మనస్సులో చాలా ఆలోచనలు ఉంటాయి కానీ అవి నెరవేరకపోవడంతో కొంత బాధపడతారు. ఇంట్లో ఆనందవాతావరణం కొనసాగాలి అంటే మీరు చర్చలకు దూరంగా ఉండాలి. సున్నితంగా మాట్లాడటం ద్వారా మీకు గౌరవం లభిస్తుంది. పనికిరాని విషయాల్లో మీ శక్తిని వృధా చేయకండి.
Also Read: బుధుడు, సూర్యుడు ఉన్న రాశిలోనే శుక్రుడి సంచారం, ఈ 5 రాశులవారికి శుభసమయం
కర్కాటకం
ఈ రోజు మీరు మీ కుటుంబంలో కొత్త అతిథిని ఆహ్వానిస్తారు. జీవిత భాగస్వామితో ఉండే మనస్పర్థలు కొంతవరకూ తీరుతాయి పిల్లల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే భార్య భర్త మధ్య వివాదం తెలెత్తుతుంది. విదేశీ పర్యటనలకు వెళ్లాలి అనుకునేవారికి ఇదే సరైన సమయం. ఆర్థిక పరంగా ఈరోజు కొద్దిగా బలహీనంగా ఉంటుంది.
సింహం
ఆరోగ్యం పరంగా ఈరోజు మీరు బలహీనంగా ఉంటారు. ప్రేమికులకు మంచి రోజు. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో విడిచిపెట్టేయ వద్దు. ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. వేరేవారి మాటలు పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి సారిస్తారు.
కన్య
సృజనాత్మక పనిలో నిమగ్నమైన వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు. ఇంటా బయటా గౌరవం పొందుతారు. కొత్త ఉద్యోగాల్లో చేరాలి అనుకునేవారికి శుభసమయం. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. కష్టపడి పనిచేయడం ద్వారా డబ్బు బాగా సంపాదిస్తారు.
తుల
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారికి అంత అనుకూలంగా ఉండదు. మీరు స్నేహితుడి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు కానీ కొంత సమయం తర్వాత అది మెరుగుపడుతుంది. కుటుంబంతో సంతోషంగా స్పెండ్ చేస్తారు.
వృశ్చికం
ఈ రోజు సామాజిక రంగాలలో పనిచేసే వ్యక్తుల ప్రతిష్ట పెరుగుతుంది.వ్యాపారం లేదా కుటుంబంలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. మీ మాటతీరుతో ఆకట్టుకుంటారు. తక్కువ శ్రమతో మంచి లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు.
Also Read: చదువు, సంపద కోసం ఈ పద్యం చదవండి పిల్లలకు నేర్పించండి, మీరు దుర్గమ్మ ఉపాసన చేస్తున్నట్టే!
ధనుస్సు
ఈ రోజు మీరు దాతృత్వ కార్యక్రమాలలో గడుపుతారు. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ మనస్సులో ఉన్న కొన్ని గందరగోళాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడతారు. కుటుంబంలో ఏదైనా వివాదం ఈరోజు మీకు మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. సోదరులు, సోదరీమణుల నుంచి మీకు సహాయం అందుతుంది.
మకరం
వ్యాపారం చేసే వారికి ఈ రోజు కొన్ని సమస్యలు వస్తాయి.కఠినమైన నిర్ణయాలు తీసుకోకుంటే ఈరోజు మీ పురోగతికి ఆటంకం కలుగుతుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యమైన పని కోసం మీ సీనియర్లని సంప్రదిస్తారు. విదేశీ వ్యాపారాలు చేసేవారికి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. పిల్లల కెరీర్ గురించి ఆందోళన చెందుతారు.
కుంభం
ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి ఉపాధ్యాయుల మనసు దోచుకోగలుగుతారు. కుటుంబంలో వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు అనుకూల సమయం. ఇంటోవారికి కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నట్టైతే ఆ ఇబ్బందులు పెరుగుతాయి.
మీనం
ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఇంట్లో మీ బాధ్యతలు పెరగవచ్చు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అవివాహితులకు సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులకు అనుకూల సమయం.