షావోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ ధర తగ్గింపును అందించారు. ఈ ఫోన్ మనదేశంలో 2021లో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.


షావోమీ ఎంఐ 11ఎక్స్ ప్రో ధర
ఇందులో 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.39,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ రూ.31,749 ధరతో లిస్ట్ అయింది. అంటే ఏకంగా రూ.8 వేలకు పైగా తగ్గింపును అందించారన్న మాట. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర లాంచ్ అయినప్పుడు రూ.41,999 కాగా ఇప్పుడు రూ.36,999కు తగ్గింది. దీనిపై రూ.5 వేలు తగ్గింపును అందించారు. కాస్మిక్ బ్లాక్, ఫ్రాస్టీ వైట్, సెలెస్టియల్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.


షావోమీ 11ఎక్స్ ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఈ4 అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 1,080x2,400 పిక్సెల్స్‌గానూ, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గానూ ఉంది.క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా ఇందులో ఉన్నాయి.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్), యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఇందులో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 4520 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. డాల్మీ అట్మాస్‌ను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.


రెడ్‌మీ నోట్ 11ఎస్ఈ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను రూ.13,499గా నిర్ణయించారు. బైఫ్రాస్ట్ బ్లూ, కాస్మిక్ వైట్, స్పేస్ బ్లాక్, థండర్ పర్పుల్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.43 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌‌ను ఈ ఫోన్ పనిచేయడానికి . 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.


ఫోన్ వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.


Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?


Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?