షావోమీ సీవీ 2 స్మార్ట్ ఫోన్ చైనాలో సెప్టెంబర్ 27వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్కెటింగ్ ప్లాన్‌ను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఈ ఫోన్ వెనకవైపు డిజైన్‌ను కూడా ఇందులో రివీల్ చేశారు. షావోమీ సీవీ 2లో వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది.
డిజైన్ చూస్తే ప్యాటర్న్డ్ ప్యానెల్‌ను వెనకవైపు అందించనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ అయ్యే అవకాశం మాత్రం లేదు. ఎందుకంటే దీని ముందు వెర్షన్ షావోమీ సీవీ కూడా మనదేశంలో లాంచ్ కాలేదు.
ఈ ఫోన్ ఇతర మార్కెట్లలో షావోమీ 12 లైట్ 5జీ ఎన్ఈ లేదా షావోమీ 13 లైట్ బ్రాండింగ్‌తో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఇందులో 6.55 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీంతోపాటు ఈ ఫోన్‌లో స్పెషల్ వ్లాగ్ మోడ్స్ ఉండనున్నాయి.
మరో కథనం ప్రకారం... షావోమీ సీవీ 2లో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ ఉండనుంది. ఈ ఫోన్‌లో మైక్రో కర్వ్‌డ్ డిస్‌ప్లే ఉండనుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అందించనున్నారు. ఫోన్ అంచులు కూడా సన్నగా ఉండనున్నాయి.
షావోమీ 12 లైట్ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్లో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 399 డాలర్లుగా (సుమారు రూ.31,600) ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 449 డాలర్లుగానూ (సుమారు రూ.35,600), 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 499 డాలర్లుగానూ (సుమారు రూ.39,600) నిర్ణయించారు.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4300 ఎంఏహెచ్ కాగా... 67W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?