Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే పోటీ ‘అడవిలో ఆట’ జోరుగా సాగింది ఇంట్లో. పోలీసులు, దొంగలు, గీతూ అందరూ తమ తమ ఆటను ఆడారు. కానీ దొంగలు ఐక్యంగా ఆడకపోవడం వల్ల చివరికి వారే ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల టీమ్ గెలిచినట్టు సమాచారం. అయితే చివరికి దొంగల టీమ్ నుంచి ఇద్దరు, పోలీసుల టీమ్ నుంచి ఒకరు, గీతూ... కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచినట్టు తెలుస్తోంది. ఇక ఎపిసోడ్ లో ఏమైందంటే..


రేవంత్ బొమ్మలు కొట్టేసి...
ఆరోహి, నేహా కలిసి రేవంత్ దాచుకున్న బొమ్మలను కొట్టేశారు. రేవంత్, ఆరోహి, నేహా దొంగల టీమే. అయితే వారు ఐక్యంగా ఆడలేదు. తన బొమ్మలు పోయాయని తెలిసి రేవంత్ నోటికి పనిచెప్పాడు. తన బొమ్మలు దాచిన వారికి సిగ్గు సెన్స్ ఉండాలి అంటూ అరిచాడు. ఇక గీతూ  మీ వాళ్లే తీశారు అని చెప్పింది గీతూ. ఎవరు తీశారో మాత్రం చెప్పలేదు. నేను పోలీసుల టీమ్ గెలిచేలా ఆడతా అంటూ అరిచాడు. ‘నీతి కబుర్లు, నీతి సూక్తులు చెప్పకూడదు’ అంటూ కోప్పడ్డాడు. అతని బొమ్మలను నేహా తీసి సుదీపకు ఇచ్చింది. సుదీప వాటిని దాచింది. 


నేహాను కొట్టి, ఆరోహిని తన్ని...
ఇనయ కాసేపు ఇంట్లో హడావుడి చేసింది. పోలీసుల అయిన ఆమె స్టోర్ రూమ్ లో రైడ్ కు వెళ్లింది. దొంగలు దాచిన బొమ్మలు కోసం వెతికింది. రైడ్ టైం ముగిసిన ఆమె అక్కడే ఉండడంతో దొంగలు ఈడ్చిపడేశారు. తోపులాట కాసేపు సాగింది. ఆ తోపులాటలో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆరోహిని కాలితో తన్నేసింది. నేహా చెంప మీద కొట్టేసింది. దీంతో నేహా చాలా బాధపడింది పెద్ద గొడవ చేసింది. ఇనయ తన డ్రెస్ ఎవరో లాగారంటూ అరిచింది. ఈ మధ్యలో గీతూ వచ్చి క్లాసులు తీసుకుంది. దొరికిందే ఛాన్సు అని ఇనయకు వ్యతిరేకంగా మాట్లాడింది. తప్పు మాటలు మాట్లాడుతున్నావ్, మాటలు మారుస్తున్నావు అంటూ వాదించింది. ఈ గొడవ కాసేపు గట్టిగానే సాగింది. గీతూ నుంచి బొమ్మలు కొట్టేయాలని దొంగల టీమ్ అనుకున్నా కూడా పెద్దగా ప్రయత్నించలేదు. గీతూ జోలికి ఎవరూ వెళ్లకపోవడం వల్ల ఆమె సులువైంది. బొమ్మలు కాపాడేందుకు సూర్యతో డీల్ కుదుర్చుకుని డబ్బులు ఇచ్చింది గీతూ. అలాగే శ్రీహాన్ తో కూడా డీల్ కుదుర్చుకుని డబ్బులు ఇచ్చింది.


బుధవారం నాడు ఆట ముగిసింది. ఎపిసోడ్ పూర్తయ్యేసమయానికి శ్రీహాన్ వద్ద 14000 దాకా డబ్బులు ఉన్నాయి. ఇక గీతూ దగ్గర 25 బొమ్మలతో పాటూ, 15800 డబ్బులు ఉన్నాయి. సూర్య దగ్గర 10100 క్యాష్ ఉంది. ఇక పోలీసుల టీమ్ లో శ్రీ సత్య దగ్గర గోల్డెన్ కలర్ కొబ్బరి బోండాం ఉండడం వల్ల ఆమె కూడా కెప్టెన్సీ కంటెండెర్ అయ్యే ఛాన్సు ఉంది. ఇక క్యాష్ అధికంగా ఉన్న శ్రీహాన్, సూర్య, గీతూ కూడా కెప్టెన్సీ కంటెండెర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రేపటి ఎపిసోడ్ లో ఎవరెవరు అయ్యారో బిగ్ బాస్ ప్రకటిస్తారు. 


Also read: నువ్వరిస్తే అరుపులే నేనరిస్తే మెరుపులే - ఓవర్ అవుతున్న గీతూ, ఫిజికల్ అయిపోయిన టాస్క్


Also read: దొంగల టీమ్‌లో ఉండి పోలీసుల టీమ్‌ను గెలిపిస్తానన్నా రేవంత్, కారణం ఏంటో తెలుసా?