ఎవరైనా  ట్రాఫిక్‌ నిబంధనలు ఒక సారి.. రెండు సార్లు మహా అయితే పది సార్లు ఉల్లంఘించి దొరికిపోతారు. అంత కంటే ఎక్కువ చలానాలు ఉంటే ఆ బండి ఓనర్ అడ్డంగా బుక్కయిపోతాడు. అయితే హైదరాబాద్ పాతబస్తీలోని ఓ బండిపై మాత్రం ఏకంగా 117 చలానాలు ఉన్నాయి. ఆ చలనాల ఫైన్ల విలువ రూ. 30వేలకు పైగానే ఉంది. ఈ రోజు కూడా అలా ట్రాఫిక్ ఉల్లంఘించి జోరుగా వెళ్తున్న ఆ బైక్‌ను ఆపి ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాశారు. ఆ చలాన్ బిల్లు తీసి ఓనర్‌కు ఇద్దామని ట్రాఫిక్ పోలీస్ తన చేతిలోని మిషన్‌లో ప్రింట్ బటన్ నొక్కితే.. చాంతాడంత స్లిప్ వచ్చింది. దీంతో పోలీసు అధికారి ఆశ్చర్యపోయారు. 




Also Read : మీ కరివేపాకు ఐడియాలకు దణ్ణంరా బాబు.. అమెజాన్ లో విశాఖ టూ మధ్యప్రదేశ్ కు గంజాయి సరఫరా


మొత్తం లెక్కిస్తే 117 ట్రాఫిక్ చలానాలు ఉన్నాయి. 2015 నుంచి అన్‌లైన్ చేశారు. అప్పట్నుంచి 76 వెబ్ సైట్‌లో కనిపిస్తున్నాయి. మిగతావి పాతవి. దీంతో అప్పటికప్పుడు ఆ బైక్ ఓనర్ని పట్టుకుని పోలీసులు అరెస్ట్ చూపించారు. ఆ బైక్ ఫరీద్ అనే వ్యక్తి పేరుతో ఉంది. బైక్ నెంబర్  AP 09 AU 1727.  అది యాక్టివా పాత మోడల్. దాని రీసేల్ విలువ రూ. 20వేలు కూడా ఉండదు. కానీ చలాన్లు రూ. 30వేలకు పైగా ఉన్నాయి. అయితే పోలీసులు వాహనాన్ని సీజ్ చేయడం... ఓనర్ దొరికిపోవడంతో కట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.


Also Read: Andhra Sameer Wankhede : ఆంధ్రాపై గురి పెట్టిన సమీర్ వాంఖడే ! ఈ సారి ఏం పట్టుకున్నారో తెలుసా ?


పాతబస్తీలో ఉండే ఫరీద్ హెల్మెట్ పెట్టుకోవడాన్ని నామోషీగా భావిస్తారేమో కానీ..  అసలు హెల్మెట్ పెట్టుకోరు. పైగా రోజూ ప్రధాన రహదారిలో వెళ్తారేమో కానీ ట్రాఫిక్ పోలీసుల కెమెరాకు ఎప్పుడూ అనువుగానే దొరికిపోయారు. ఆయన బండి ఫోటోలు తీయడం... ఫైన్ వేయడం ట్రాఫిక్ పోలీసులకు కామన్ అయిపోయింది. హెల్మెట్ వాడకపోవడానికి తోడు సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా ఉంది. దీనికి ఫైన్లు పడ్డాయి. 


Also Read : వీడియో కాల్‌లో టెంప్ట్ అయిన యువకుడు.. న్యూడ్‌గా చాట్, చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్!


ఇక కోవిడ్ సమయంలో మాస్క్ పెట్టుకోకపోవడానికి మాస్క్ సరిగ్గా పెట్టుకోపవడానికి అంటే మాస్క్‌తో ముక్కు కవర్ చేసుకోకపోవంతో దానికీ రూ. వెయ్యి ఫైన్ వేశారు. ఇలాంటి ఫైన్లు అన్నీ కలిపి117 అయ్యాయి. ఇందులో అత్యధికం ట్రాఫిక్ లేనివే.  ఆ పాత యాక్టివా మీద ఓనర్ స్పీడ్ డ్రైవింగ్.. ప్రమాదకరమైన డ్రైవింగ్... రేసులు లాంటివేమీ చేయలేదు. కానీ ట్రాఫిక్ పోలీసుల కెమెరాను పట్టించుకోకపోవడం వల్ల బుక్కయిపోయారు.   


Also Read: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అశ్లీల నృత్యాలు... ఇవేం పనులంటూ స్థానికుల మండిపాటు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి