Elon Musk Twitter Blue tick: ట్విట్టర్ టేకోవర్ చేసిన తర్వాత ఎలన్ మస్క్ కీలక మార్పులు చేస్తున్నారు. ప్రత్యేకించి ఆయన ట్విట్టర్ లో సమానవత్వం అనే కాన్సెప్ట్ ను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా బ్లూటిక్ వ్యవస్థను సంస్కరిస్తానన్న ఎలన్ మస్క్....సెలబ్రెటీ, కామన్ మ్యాన్ అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ ట్విట్టర్ ఆథరైజ్డ్ అకౌంట్లు, వెరిఫైడ్ సర్టిఫికేషన్ ఇచ్చే ప్రక్రియ చేపడతామన్నారు. ఇందుకోసం ప్రీమియం పెడుతున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్.....ట్విట్టర్ లో బ్లూ టిక్ కోసం నెలకు 8 యూఎస్ డాలర్లు పెడుతున్నట్లు ప్రకటించారు. అమౌంట్ పే చేసిన వాళ్లకు ప్రత్యేక ఆఫర్స్ కూడా ఉంటాయని ప్రకటించారు ఎలన్ మస్క్. ఆడియో, వీడియోలు ఎక్కువ నిడివి పెట్టుకునే అవకాశం, సెర్చ్ లో త్వరగా పేరు పుష్ అవటం, ఆథరైజేషన్ ఇంకా అనేక ఫీచర్లు అందిస్తామని ఎలన్ మస్క్ తెలిపారు. అయితే ఎలన్ మస్క్ నిర్ణయంపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. కొందరు మస్క్ నిర్ణయాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు భావప్రకటనా స్వేచ్ఛను కమర్షియలైజ్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.




ట్విటర్‌ను టేకోవర్‌ చేసిన ఎలన్‌ మస్క్‌  ఇప్పుడు సంస్థాగతంగా, అంతర్గతంగా దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాడని తెలిసింది. ట్విటర్‌ను మునుపటి కన్నా భిన్నంగా మార్చేందుకు ప్రయత్ని్స్తున్నాడు. సోషల్‌ మీడియా ఖాతాల పట్ల మరింత విశ్వసనీయతను పెంచేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఒక అకౌంట్‌ అథెంటిక్ అవునో కాదో తెలుసుకొనేందుకు బ్లూటిక్‌ ఇస్తున్నారు. ఇకపై బ్లూ టిక్‌ ఇచ్చే ప్రక్రియను మస్క్‌ మార్చబోతున్నాడని కొన్నాళ్లుగా వార్తలు వచ్చాయి.




ప్రస్తుతం బ్లూ టిక్‌ ఉన్న వాళ్లు త్వరలోనే వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుందట! నెలకు 4.99 డాలర్లతో ఆప్షనల్‌ ప్లాన్‌ ఉంటుందని ఇందులో కొన్ని అదనపు ఫీచర్లు ఇస్తారని సమాచారం. కొత్తగా బ్లూ టిక్‌ కావాలని కోరుకునేవాళ్లకు 19.99 డాలర్లు ఫీజు వసూలు చేయనున్నారని వెర్జ్‌ రిపోర్టు చేసింది. ఇప్పుడీ ప్లాన్‌లో ఉన్నవారు 90 రోజుల్లోగా సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాలని లేదంటే చెక్‌ మార్క్‌ తొలగిస్తారని కంపెనీ ప్రతినిధి ఒకరు మీడియాకు చెప్పారని తెలిసింది. కొత్త ఫీచర్‌ కోసం కొందరు ఉద్యోగులను నియమించారని, నవంబర్‌ 7లోగా ప్రాజెక్టు పూర్తి కాకుంటే వారు ఇంటికెళ్లాళ్లి ఉంటుందట. పూర్తి వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఇప్పుడీ సబ్‌స్క్రిప్షన్‌ విలువ 8 డాలర్లు ఉంటే ఎలా ఉంటుందని స్వయంగా మస్క్‌ ట్వీట్‌ చేయడం గమనార్హం.


'మొత్తం వెరిఫికేషన్‌ ప్రక్రియ ఈ క్షణం నుంచే మారబోతోంది' అని మస్క్‌ ఆదివారం ట్వీట్‌ చేశాడు. అయితే ఏ మార్పులు వస్తాయో మాత్రం చెప్పలేదు. ట్విటర్‌ చీఫ్‌ మీమ్స్‌ ఆఫీసర్‌ జేసన్‌ కొన్ని రోజుల క్రితమే ఓ ట్వీట్‌ పెట్టాడు. 'మీరు తనిఖీ చేసుకోవడానికి, ట్విటర్‌ బ్లూ మార్క్‌ పొందడానికి ఎంత చెల్లిస్తారు? నెలకు 4 డాలర్లు, 10 డాలర్లు, 15 డాలర్లు, అసలు చెల్లించరు' అని ఆయన పెట్టిన ట్వీట్‌కు మస్క్‌ 'ఆసక్తికరం' అని ఇంతకు ముందే స్పందించడం గమనార్హం.