Swiggy Weird Searches:
దేశవ్యాప్తంగా స్విగ్గీకి అనేక మంది కస్టమర్లు ఉన్నారు. ఏడాది పొడవునా ఆహార పదార్థాలు ఆర్డర్ చేస్తూనే ఉంటారు. ఎప్పట్లాగే ఎక్కువ మంది బిరియానీ ఆర్డర్ చేశారు. ఈ కంపెనీకి గ్రాసరీ డెలివరీ బిజినెస్ ఉన్న సంగతి తెలిసిందే. ఏటా డిసెంబర్లో ఇన్‌స్టామార్ట్‌లో ఎక్కువగా వెతికిన వస్తువుల జాబితాను కంపెనీ విడుదల చేస్తుంది. 2022లో విచిత్రంగా పెట్రోల్, అండర్‌వేర్, మమ్మీ, సోఫా, బెడ్ గురించి కస్టమర్లు సెర్చ్ చేశారని తెలిపింది.
స్విగ్గీ 2020లో ఇన్‌స్టామార్ట్ సేవలను ఆరంభించింది. అత్యంత వేగంగా గ్రాసరీస్‌ను డెలివరీ చేస్తోంది. 2022లో కేవలం మూడు నగరాల్లోనే 5 కోట్లకు పైగా ఆర్డర్లను అందించింది. బెంగళూరులో ఓ కస్టమర్ ఏకంగా రూ.16.6 లక్షల విలువైన వస్తువులు కొనుగోలు చేశారని కంపెనీ తెలిపింది. ఇక మరో వ్యక్తి దీపావళికి ఒకే ఫుడ్‌పై రూ.75,378 ఖర్చు చేశారు.
ఇన్‌స్టా మార్ట్ యాప్‌లో కొందరు కస్టమర్లు పెట్రోల్, అండర్‌వేర్ వంటివీ వెతికారని స్విగ్గీ తెలిసింది. ఉదాహరణకు పెట్రోల్‌ను 5,981 సార్లు వెతికారు. ఆ తర్వాత అండర్‌వేర్‌ను 8,810 సార్లు శోధించారు. సోఫా 20,653, బెడ్‌ను 23,432 సార్లు వెతకడం గమనార్హం. 'మమ్మీ' అనే పదాన్ని సెర్చ్ చేయడంతో తామే ఆశ్చర్యపోయామని స్విగ్గీ వెల్లడించింది. 2022లో మమ్మీ అనే పదాన్ని 7275 సార్లు శోధించారని తెలిపింది.
గురుగ్రామ్‌లోని ఓ కస్టమర్ ఇన్‌స్టామార్ట్‌లో ఏకంగా 1542 సార్లు గ్రాసరీస్‌ను ఆర్డర్ చేశారని స్విగ్గీ తెలిపింది. కాగా బెంగళూరులో 50 మీటర్ల దూరంలో ఉన్న కస్టమర్లకు 1.03 నిమిషాల్లోనే సరుకులను అందించామని పేర్కొంది. ఇదే నగరంలో ఐస్ క్యూబ్‌లను ఎక్కువగా కొన్నారని తెలిపింది. ముంబయి, చెన్నై, దిల్లీ నగరాల్లో ఆర్డర్ చేసిన మొత్తం కన్నా ఐటీ క్యాపిటల్‌లో ఆర్డర్ చేశారని వెల్లడించింది. ఈ ఏడాది 3,62,10,084 ప్యాకెట్ల చిప్స్‌ను కొన్నారని తెలిపింది.
స్విగ్గీలో బిర్యానీ తన దమ్ము చూపిస్తోంది. ఏకంగా నిమిషానికి 137 బిర్యానీలు ఆర్డర్ అవుతున్నాయి. అంటే సెకనుకు 2.28 ఆర్డర్లు అంటూ ఆ నివేదికలో రాసుకొచ్చింది. అంటే ఏ స్థాయిలో బిర్యానీ అమ్మకాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం స్విగ్గీలోనే ఇలా అమ్ముడుపోతుంటే ఇక జొమాటో వంటి ఇతర ఫుడ్ అగ్రిగేటర్లలోని అమ్మకాలు చూస్తే బిర్యానీ ఇంకా ఎక్కువగానే అమ్ముడవుతున్నట్టే లెక్క.
బిర్యానీ తర్వాత అధికంగా అమ్ముడవుతున్న అయిదు వంటకాలు ఏమిటో కూడా ప్రకటించింది స్విగ్గీ. మసాలా దోశ, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్.