Earnings From X: ప్రపంచంలో నంబర్‌ వన్‌ ధనవంతుడు ఎలాన్ మస్‌కు చెందిన సోషల్ మీడియా కంపెనీ X (గతంలో ట్విట్టర్) ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలకు కొత్త సంపాదన మార్గానికి తలుపులు తెరిచింది. ఈ కంపెనీ ఇటీవలే కొత్త మానిటైజేషన్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం, తన ప్రకటన ఆదాయాన్ని యూజర్లతో పంచుకుంటుంది. దీనివల్ల వినియోగదార్లు భారీగానే సంపాదిస్తున్నారు. ఈ సంపాదనపై గూడ్స్‌ & సర్వీసెస్‌ టాక్స్‌ (GST) వర్తిస్తుందని టాక్స్‌ ఎక్స్‌పర్ట్స్‌ చెబుతున్నారు.


యాడ్ రెవెన్యూ షేరింగ్ స్కీమ్ ద్వారా X యూజర్లు సంపాదించే ఆదాయాన్ని GST చట్టం కింద ప్రకారం సప్లైగా పరిగణించి, 18 చొప్పున పన్ను విధించవచ్చని ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు. ఒక వ్యక్తి అద్దె, బ్యాంకు ఎఫ్‌డీ, ఇతర వృత్తిపరమైన సేవలపై వచ్చే ఆదాయం ఏడాదికి రూ. 20 లక్షలకు మించితే, అప్పుడు పన్ను చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


X నుంచి డబ్బు సంపాదించడానికి కొన్ని షరతులు
ప్రీమియం కస్టమర్‌లు, వెరిఫైడ్‌ కంపెనీల కోసం యాడ్ రెవెన్యూ షేరింగ్ స్కీమ్‌ను X ప్రారంభించింది. ఈ పథకంలో భాగం కావడానికి కొన్ని షరతులు వర్తిస్తాయి. సంబంధిత ఖాతా గత మూడు నెలల్లో పోస్ట్‌లపై 15 మిలియన్ ఇంప్రెషన్స్‌, కనీసం 500 మంది ఫాలోయర్లను కలిగి ఉండాలి. బ్లూ టిక్‌ సబ్‌స్క్రిప్షన్ బేస్‌ను పెంచేందుకు X వేసిన ప్లాన్‌లో ఇది భాగంగా చెబుతున్నారు.


లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు
X కొత్త స్కీమ్‌ నుంచి చాలా మంది యూజర్లు డబ్బు చాలా సంపాదిస్తున్నారు. X ప్లాట్‌ఫామ్‌లోని డజన్ల కొద్దీ అకౌంట్‌ హోల్డర్లు లక్షల రూపాయల పేమెంట్స్‌ అందుకుంటున్నారని సమాచారం. ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న, ఎక్కువ ఎంగేజ్‌మెంట్ పోస్ట్‌లు ఉన్న అకౌంట్‌ ఓనర్లు ఈజీగా లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. కొంత మంది, తమ ఆదాయం గురించి ఇటీవల ఓపెన్‌గా ప్రకటించారు కూడా. దీని ద్వారా చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు X నుంచి సంవత్సరానికి రూ. 20 లక్షలకు పైగా సంపాదించే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని టాక్సబుల్‌ ఇన్‌కమ్‌గా (పన్ను విధించదగిన ఆదాయం) పరిగణించాలని ఎక్స్‌పర్ట్స్‌ భావించడానికి కారణం ఇదే.


జీఎస్టీ చట్టం ప్రకారం, సప్లై లిస్ట్‌లోకి వచ్చే అన్ని సర్వీసుల్లో, ఒక ఏడాదిలో రూ. 20 లక్షలకు పైగా ఆదాయం అందుకుంటే, ఆ వ్యక్తి 18 శాతం చొప్పున జీఎస్టీని చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది మొత్తం ఆదాయం రూ. 20 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఆ టాక్స్‌ పేయర్‌ GST చెల్లించాల్సిన అవసరం లేదు.


కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఆదాయ పరిమితి
కొంతమంది X యూజర్లకు ఈ పరిమితి భిన్నంగా ఉండవచ్చు. ఉదాహరణకు, మిజోరం, మేఘాలయ, మణిపూర్ వంటి కొన్ని ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఈ పరిమితి రూ. 10 లక్షలు. అంటే ఈ రాష్ట్రాల్లోని యూజర్లు తమ వార్షిక ఆదాయం రూ. 10 లక్షలు దాటితే జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: ఐటీ డిపార్ట్‌మెంట్‌ నుంచి 6 రకాల నోటీస్‌లు వచ్చే ఛాన్స్‌, ఈ లిస్ట్‌లోకి మీరు వస్తారేమో చెక్‌ చేసుకోండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial