Suzlon Energy Rights Issue: మన దేశానికి చెందిన మల్టీ నేషనల్‌ విండ్‌ టర్బైన్‌ తయారీ కంపెనీ సుజ్లాన్‌ ఎనర్జీ (Suzlon Energy) షేర్లు ఇప్పుడు మార్కెట్‌ ఫోకస్‌లో ఉన్నాయి. రైట్స్‌ జారీ (Rights Issue) ద్వారా ₹1200 కోట్ల వరకు సేకరించేందుకు ఈ కంపెనీ ప్లాన్‌ వేసింది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. 


240 కోట్ల ఈక్విటీ షేర్లను, ఒక్కో షేరును ₹5 చొప్పున ఈ కంపెనీ జారీ చేస్తోంది. ఈ షేర్ల ముఖ విలువ 2 రూపాయలు.


ఈ రైట్స్‌ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ ఈ నెల 11న ‍‌(మంగళవారం) ప్రారంభం అవుతుంది. రెండో రోజున, అంటే 12 వ తేదీన ‍‌(బుధవారం) ముగుస్తుంది. 


సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సంఘ్వి కూడా ఈ రైట్స్‌ ఇష్యూలో పాల్గొనబోతున్నారు. 2012లో ఈ కంపెనీ కన్వర్టబుల్‌ బాండ్‌ డిఫాల్టర్‌గా మారింది. 2015లో సుజ్లాన్‌లో 23 శాతం వాటాను రూ.1,800 కోట్లకు సంఘ్వి కొనుగోలు చేశారు. ఆ డబ్బుతో ఇది అప్పులు తీర్చేసి, తిరిగి లాభాల్లోకి వచ్చింది. సంఘ్వీ మళ్లీ కంపెనీలో వాటా కొనేందుకు సిద్ధపడడంతో ఈ రైట్స్‌ ఇష్యూకి ప్రాధాన్యత పెరిగింది. 


గత వారం, కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా (CMD) వినోద్ తంతిని సుజ్లాన్‌ ఎనర్జీ నియమించింది. మూడేళ్ల కాలానికి ఆయన ఆ సీట్లో కూర్చుంటారు. అంతకుముందు ఇదే బాధ్యతలు నిర్వహించిన కంపెనీ వ్యవస్థాపకుడు తులసి తంతి ఈ నెల 1న మరణించారు. ఆయన స్థానంలో వినోద్ తంతి నియామకం జరిగింది.


సుజ్లాన్ ఎనర్జీ టెక్నికల్‌ ఔట్‌లుక్‌:


ఔట్‌లుక్: రూ.11.50 కంటే పైన బ్రేక్ ఔట్, 200-DMA పైన ట్రెండ్ సానుకూలంగా ఉంది.


సుజ్లాన్ ఎనర్జీకి ప్రస్తుత సంవత్సరం అంతగా కలిసి రాలేదు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు (YTD) ఈ స్టాక్ దాదాపు 23 శాతం క్షీణించింది. రూ.4.85 మార్క్‌ వద్ద ఉన్న 200-డేస్‌ మూవింగ్ యావరేజ్ (DMA) కంటే పైన సానుకూల సెంటిమెంట్‌ ఉంది.


వీక్లీ చార్ట్ ప్రకారం, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్ (MACD) జీరో లైన్‌ కంటే పైకి చేరే ట్రాక్‌లో ఉంది. ఇది పాజిటివ్‌ బయాస్‌ను సూచిస్తుంది. దీంతోపాటు, "హయ్యర్ హైస్‌ - హైయర్ లోస్‌" నమూనా ఒక బుల్లిష్ ఫార్మేషన్‌. ఈ స్టాక్ 200-DMAని రెస్పెక్ట్‌ చేయలేకపోతే మాత్రం ట్రెండ్‌ ప్రతికూలంగా మారవచ్చు.


రూ.11.50 కంటే పైన మళ్లీ బ్రేక్‌ ఔట్‌ ర్యాలీని చూడవచ్చు. కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఈ స్టాక్‌లో వచ్చిన మొత్తం బుల్లిష్‌నెస్‌ను ఈ స్థాయి గట్టిగా అడ్డుకుంది. అందుకే ఇది చాలా కీలకమైన పాయింట్‌.


స్టాక్‌కు తక్షణ మద్దతు రూ.6 వద్ద కనిపిస్తోంది. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.