సుప్రియా లైఫ్ సైన్సెస్ షేర్లు మంగళవారం భారీ ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. మార్కెట్లో సానుకూల సెంటిమెంటు ఉండటం, ఐపీవోకు భారీ స్థాయిలో స్పందన రావడంతో షేర్లు బంపర్ ధరకు లిస్టయ్యాయి. 55.11 శాతం ప్రీమియంతో రూ.151 అధికంగా రూ.425 వద్ద షేర్లు లిస్టయ్యాయి. వాస్తవంగా షేర్లను రూ.274కే కేటాయించడం గమనార్హం.
ఈ కంపెనీ ఐపీవో డిసెంబర్ 16న మొదలైంది. 20న సబ్‌స్క్రిప్షన్లు ముగిశాయి. 23న షేర్లను కేటాయింపు చేశారు. రూ.274 ధరతో ఒక లాట్‌కు 54 షేర్లను కేటాయించారు. అంటే లాట్‌కు రూ.14,796 ఖర్చైంది. రూ.425 వద్ద లిస్టవ్వడంతో ఒక్కో లాట్‌కు రూ.8154 వరకు లాభం వచ్చింది. కాగా మధ్యాహ్నం 1:30 గంటలకు సుప్రియా లైఫ్ సైన్సెస్ షేర్లు రూ.400 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.
ఈ ఐపీవో ద్వారా సుప్రియా లైఫ్ సైన్సెస్ రూ.700 కోట్లు సమీకరించింది. ఈ కంపెనీ ఐపీవోకు భారీ స్పందన లభించింది. 71.51 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. ఇక నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 161 రెట్లు, రిటైల్ విభాగంలో 56 రెట్లు, క్యూఐబీ విభాగంలో 31.83 రెట్లు సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. లిస్టింగ్ తర్వాత ప్రమోటర్ల వాటా 99.98 శాతం నుంచి 68.24 శాతానికి తగ్గింది.
Also Read: 28 Days Validity: అమ్మో.. 28 రోజుల వ్యాలిడిటీ వెనుక ఇంత కథా.. రూ.వేల కోట్ల ఆదాయం!
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
Also Read: Cyber Crime: మీ మొబైల్ ఫోన్ సేఫేనా! పూర్తి వివరాలు కోసం క్లిక్ చేయండి
Also Read: డ్రగ్స్ కేసు భయంతో యువనటి ఆత్మహత్య.. అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంతో దారుణం.. చివర్లో ట్విస్ట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి