Stock Market Today, 30 April 2024: గ్లోబల్‌ మార్కెట్లన్నీ ఈ రోజు ముదురు పచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. ఆ రంగు ఈ రోజు (మంగళవారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు కూడా అంటి, లాభాలతో ప్రారంభం కావచ్చు. Q4 FY24 ఫలితాలు కూడా విడిగా స్టాక్స్‌కు దిశానిర్దేశం చేస్తాయి.


మంగళవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,643 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,797 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం.. నికాయ్‌ 1.6 శాతం లాభపడింది. హాంగ్ సెంగ్, కోస్పి 0.6 శాతం వరకు పెరిగాయి. ASX200 0.3 శాతం పచ్చగా ఉంది. స్ట్రెయిట్స్ టైమ్స్, తైవాన్ ఫ్లాట్‌గా ట్రేడ్ అయ్యాయి.  డాలర్‌తో పోలిస్తే జపాన్‌ యెన్ విలువ సోమవారం 34 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడింది.


US ఫెడ్ సమావేశానికి ముందు, సోమవారం, అమెరికన్‌ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. ఎస్&పి 500 0.32 శాతం, నాస్‌డాక్ కాంపోజిట్ 0.35 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.38 శాతం పెరిగాయి. మంగళ, బుధ వారాల్లో యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ జరుగుతుంది.


యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ కోసం ఇన్వెస్టర్లు ఎదురు చూస్తుండడంతో అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ తగ్గింది, 4.603 శాతం వద్ద ఉంది. గాజాలో సీజ్‌ ఫైర్‌ ప్రయత్నాలతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు $88 వద్దకు చేరింది. యూఎస్‌ ఫెడ్‌ మీటింగ్‌ ఫోకస్‌లో ఉండడంతో గ్లోబల్‌ మార్కెట్‌లో పసిడి రేటు ఔన్సుకు $2,345 దగ్గరకు చేరింది.
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, REC, హావెల్స్ ఇండియా, ఇండస్ టవర్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్, ప్రోక్టర్ & గాంబుల్, సోనా BLW, స్టార్ హెల్త్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్, వేదాంత్ ఫ్యాషన్స్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్, క్యాస్ట్రోల్ ఇండియా, ఇండియామార్ట్, నువోకో విస్టాస్ కార్ప్, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్, గ్రావిటా ఇండియా, సింఫనీ, నియోజెన్ కెమికల్స్, అదానీ టోటల్ గ్యాస్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFCI.


పూనావాలా ఫిన్‌కార్ప్: Q4 FY24లో రికార్డ్‌ స్థాయి నికర లాభాన్ని ప్రకటించింది, రూ. 331.7 కోట్లు ఆర్జించింది. ఇది ఏడాది ప్రాతిపదికన (YoY) 83.6 శాతం వృద్ధి. ఆస్తి నాణ్యత మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం (NII) 57 శాతం పెరిగి రూ. 640.5 కోట్లకు చేరుకుంది.


టాటా కెమికల్స్: గత ఏడాది మార్చి త్రైమాసికంలోని రూ. 841 కోట్ల నికర నష్టంతో పోలిస్తే ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో రూ. 692 కోట్ల లాభాన్ని సాధించింది.


నిన్న Q4 ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు: యూకో బ్యాంక్, రోసారి బయోటెక్, కెన్ ఫిన్ హోమ్స్, కెఫిన్ టెక్, షాపర్స్ స్టాప్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, జిల్లెట్ ఇండియా, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బిర్లాసాఫ్ట్. ఈ రోజు ట్రేడింగ్‌లో వీటిపైనా ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఉంటుంది.


న్యూ లిస్టింగ్: JNK ఇండియా కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌లో లిస్ట్‌ అవుతాయి. దీని ఇష్యూ ధర రూ. 415. గ్రే మార్కెట్‌ను బట్టి 30 శాతం లిస్టింగ్ లాభాన్ని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.


రాష్ట్రీయ కెమికల్స్: తాల్చెర్ ఫెర్టిలైజర్ ప్రాజెక్ట్‌లో రూ. 2,169.67 కోట్ల పెట్టుబడికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. గతంలో రూ.1,184.20 కోట్లకు అంగీకారం తెలపగా, దీనిని రూ. 2,169.67 కోట్లకు సవరించారు.


రైట్స్: బంగ్లాదేశ్ రైల్వేకి 200 బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ క్యారేజీల సరఫరా కాంట్రాక్ట్‌ సంపాదించింది. వాటిని 36 నెలల్లో సరఫరా చేయాలి, ఒప్పందం విలువ 111.26 మిలియన్‌ డాలర్లు.


పతంజలి ఫుడ్స్: రూ.27.46 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఎందుకు తిరిగి తీసుకోకూడదో చెప్పాలంటూ పతంజలి ఫుడ్స్‌కు జీఎస్‌టీ ఇంటెలిజెన్స్ విభాగం షోకాజ్ నోటీసును అందజేసింది.


NMDC: లంప్‌ ఓర్‌ను టన్నుకు రూ.400 నుంచి రూ.6,200కు, ఫైన్స్‌ను టన్నుకు రూ.200 నుంచి రూ.5,260 వరకు పెంచింది.


M&M: రూ.7.49 లక్షల ప్రారంభ ధరతో XUV 3XO ను లాంచ్‌ చేసింది. బుకింగ్స్‌ మే 15 నుంచి ప్రారంభమవుతాయి, మే 26 నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయి.


RVNL: తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయడానికి రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్, కేరళ రైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌ జాయింట్ వెంచర్‌కు కాంట్రాక్ట్‌ దక్కింది. దక్షిణ రైల్వే నుంచి అంగీకార పత్రాన్ని (LoA) అందుకుంది. ప్రాజెక్టు వ్యయం రూ.439.95 కోట్లు.


KEC ఇంటర్నేషనల్: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో రూ.1,036 కోట్ల విలువైన కొత్త ఆర్డర్లు అందుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి