LSG vs MI IPL 2024 Head to Head Records: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌(IPG) 2024లో 48వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌(LSG)తో ముంబై ఇండియన్స్(MI) తలపడనుంది. ముంబై పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ముంబై ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడితే 3 విజయాలు, 6 ఓటములు ఉన్నాయి. ముంబై రన్ రేట్ -0.261గా చాలా తక్కువగా ఉంది. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో లక్నోపై ముంబై పెద్ద తేడాతో గెలవాల్సి ఉంది. మరోవైపు పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్‌ ఐదో స్థానంలో నిలిచింది. లక్నో ఇప్పటి వరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మొత్తం 5 విజయాలు, 4 ఓటములు ఉన్నాయి. ఈ మ్యాచ్ లక్నోలోని వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ప్రస్తుతం రెండు జట్లూ గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. లక్నో బ్యాటింగ్‌ లైనప్‌లో KL రాహుల్, క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, మాట్ హెన్రీలతో విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. ముంబైలో కూడా జస్ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లతో చాలా బలంగా ఉంది. 


హెడ్-టు-హెడ్ రికార్డ్
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ లక్నో-ముంబై నాలుగుసార్లు తలపడ్డాయి. ఇందులో లక్నో మూడు మ్యాచుల్లో విజయం సాధించగా... ముంబై కేవలం ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. లక్నోపై ముంబై 2023 సీజన్‌లో 182 పరుగులు నమోదు చేసింది. 


ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 


లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, అర్షద్ మన్కడ్, ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్ మరియు అర్షిన్ కులకర్ణి.