LSG vs MI IPL 2024 Preview and Prediction : ఈ ఐపీఎల్‌(IPL)లో ప్లే ఆఫ్‌ సమరం మరింత రసవత్తరంగా మారింది. మ్యాచ్‌ మ్యాచ్‌కు పాయింట్ల పట్టికలో స్థానాలు మారుతున్నాయి. ఈ తరుణంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌(LSG), ముంబై ఇండియన్స్‌(MI) కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ప్లే ఆఫ్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ముంబై ఇండియన్స్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్న లక్నో... తొమ్మిదో స్థానంలో ఉన్న ముంబైతో అమీతుమీ తేల్చుకోనుంది. టీ 20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించేందుకు రేపే ఆఖరి తేదీ కావడంతో అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ప్రకటించనుంది. ఇందులో కీపర్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఇదే చివరి అవకాశం.


రాహుల్‌ రాణిస్తాడా..।?
ఈ ఐపీఎల్‌లో లక్నో కెప్టెన్‌ కె.ఎల్‌. రాహుల్‌ ఒక్క భారీ ఇన్నింగ్స్‌ ఆడలేదు. పవర్‌ ప్లేలో ఫీల్డింగ్‌ పరిమితులు ఉన్నా రాహుల్‌ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఐపీఎల్‌లో రాహుల్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటాడు. కానీ ఈ ఐపీఎల్‌లో రాహుల్‌ గతంకంటే భిన్నంగా వేగంగా ఆడుతున్నాడు. 2024 ఎడిషన్‌లో రాహుల్‌ 144.27 స్ట్రైక్ రేట్‌తో 378 పరుగులు చేశాడు. అయితే ఇది రిషబ్ పంత్ 160.60, సంజు శాంసన్ 161.08 కంటే తక్కువగా ఉంది. వీరిద్దరిని దాటి టీ 20 ప్రపంచకప్‌ జట్టులో కీపర్‌ చోటు దక్కించుకోవాలనుకుంటున్న రాహుల్‌కు ఇది ప్రతికూలంగా మారింది. అయితే గాయం నుంచి కోలుకుని కీపింగ్‌లోనూ బ్యాటింగ్‌లోనూ మంచి ప్రదర్శనలు చేస్తున్న పంత్‌కు టీ 20 ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. మరో స్థానం కోసం రాహుల్ ఈ మ్యాచ్‌లో రాణించాల్సి ఉంది. మరోవైపు లక్నో 200 కంటే ఎక్కువ పరుగులు చేసేందుకు పవర్‌ ప్లేలో ఫీల్డ్ పరిమితులను ఉపయోగించుకోవాలి. క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్‌లతో లక్నోకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. 


ముంబైలో బౌలింగ్‌ సమస్య
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై బౌలర్లు తేలిపోవడం ఆ జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. ముంబై బౌలింగ్‌లో పవర్‌ప్లేలో ఢిల్లీ బ్యాటర్‌ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్‌ విధ్వంసం సృష్టించాడు. ల్యూక్ వుడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంతవరకూ రాణించలేదు. ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్‌ నుంచి నిష్క్రమించే స్థితిలో ఉంది. ప్లే ఆఫ్‌లో ఉండాలంటే ముంబై మిగిలి ఉన్న అన్ని మ్యాచ్‌లను గెలవాలి.  రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి ముంబై బ్యాటర్లు ప్రపంచ కప్‌నకు ముందు లయ అందిపుచ్చుకోవడానికి ఈ మ్యాచ్‌ ఉపయోగం కానుంది. ఆల్ రౌండర్ పాండ్యా ఈ సీజన్‌లో బ్యాట్, బాల్‌తో విఫలమయ్యాడు. 


ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, డెవాల్డ్ బ్రీవిస్, జస్ప్రీత్ బుమ్రా, పియూష్ చావ్లా, గెరాల్డ్ కోయెట్జీ, టిమ్ డేవిడ్, శ్రేయస్ గోపాల్, ఇషాన్ కిషన్, అన్షుల్ కాంబోజ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మద్వాల్, క్వేనా మఫాక , మహ్మద్ నబీ, షామ్స్ ములానీ, నమన్ ధీర్, శివాలిక్ శర్మ, రొమారియో షెపర్డ్, అర్జున్ టెండూల్కర్, నువాన్ తుషార, తిలక్ వర్మ, హార్విక్ దేశాయ్, నేహాల్ వధేరా, ల్యూక్ వుడ్. 


లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్, KL రాహుల్ (కెప్టెన్‌), దీపక్ హుడా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్, మణిమారన్ సిద్ధార్థ్, ప్రేరక్ మన్కడ్, అర్షద్ మన్కడ్, ఖాన్, కృష్ణప్ప గౌతం, అమిత్ మిశ్రా, కైల్ మేయర్స్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, నవీన్-ఉల్-హక్, దేవదత్ పడిక్కల్, యుధ్వీర్ సింగ్ చరక్, మయాంక్ యాదవ్ మరియు అర్షిన్ కులకర్ణి.