Trinayani Today Episode  విశాలాక్షి తానే గాయత్రీ, అన్నపూర్ణ, జగధాత్రి ఇలా అమ్మవారి పేర్లు చెప్తే వల్లభ.. విశాలాక్షిని నువ్వు ముదిరిపోయావని ముదర బెండకాయవని అంటాడు. దీంతో లలితాదేవి అమ్మతో అలా మాట్లాడుతావా నువ్వే ముదర బెండకాయవని వల్లభని అంటుంది. 


తిలోత్తమ: ఈ పిల్లని మీరు కూడా అమ్మ అంటున్నారు ఏంటి అక్క.


లలితాదేవి: పోగొట్టున్న బిడ్డ జాడ తెలిపేది ఎవరైనా సరే అమ్మే అవుతారు. తల్లికే కదా బిడ్డ జాడ తెలిసేది.


సుమన: మీకు తెలీదు కానీ ఈ పిల్లకే పిల్లగా ఉండే గాయత్రీ అత్తయ్య గురించి తెలుస్తుందని అందరూ అంటారు.


తిలోత్తమ: ఇంట్లోకి అడుగుపెట్టే ముందు అమ్మకు కాలు లేదు పాదం ఎలా మోపుతుంది అని గురువుగారు అన్నారు కదా మరి ఆ సంగతి ఏంటి. 


లలితాదేవి: మహాత్ములు ఏ మాట ఊరికే అనరు. 


విశాల్: అమ్మా విశాలాక్షి ఒక్కసారి ఇంట్లోకి అడుగుపెట్టి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆ సంగతెందుకు.


వల్లభ: ఎక్స్యూజిమీ పాప నీ డ్రస్ కాస్త పైకి ఎత్తుతావా పాదాలు ఉన్నాయో లేదో చూస్తాం. తిలోత్తమ, వల్లభ, సుమనలు నవ్వుతారు. 


ఎవరు పరీక్షించదలిస్తే వాళ్లే చూడాలి అని గురువుగారు అంటే వల్లభ నేను చూస్తా అని వెళ్లబోతాడు. దీంతో హాసిని ఆడపిల్ల డ్రస్ పట్టుకుంటారా అని ప్రశ్నిస్తూ తిడుతుంది. ఇక పాదాలు ఉన్నాయో లేవో అని నేను చూస్తాను అని తిలోత్తమ కొంగు దోపుతుంది. నయని వద్దు అన్నా తిలోత్తమ వినదు. ఇక విశాలాక్షి నయని దగ్గర ఉన్న మూట పట్టుకొని చూడమని అంటుంది. దీంతో తిలోత్తమ దిష్టి మూట నేను ముట్టుకోను అంటుంది. ఎవరు ఎంత చెప్పినా వినదు. 


తిలోత్తమ విశాలాక్షి పాదాలు చూడాలి అని డ్రస్ కొంచె ఎత్తి చూసేటప్పుడు గాయత్రీ పాప మూట కింద పడేస్తుంది. ఇక విశాలాక్షి కాలు స్థానంలో గుర్రం కాలు కనిపిస్తాయి. అందరూ షాక్  అయిపోతారు. అందరూ గుర్రం నడిచొస్తున్న సౌండ్ విని ఆశ్చర్యపోతారు. తిలోత్తమ అయితే వాయు.. వాయు.. అని అలా ఉండిపోతుంది. ఇంతలో గుర్రం కాలు తిలోత్తమను ఒక్కసారిగా తన్నేస్తుంది. లలితాదేవి వాయువే తిలోత్తమను శిక్షించిందని అంటుంది.


గురువుగారు: అందుకే ఆ మూట పట్టుకోమని చెప్పింది.


విశాల్: గురువుగారు అమ్మ గుండె మీద తన్నింది ఇప్పుడు ఏం చేద్దాం. నొప్పి చాలా ఎక్కువ ఉన్నట్లుంది. 


గురువుగారు: తులసి ఆకు రసం తాగించండి. ఉపశమనం వస్తుంది.


విశాలాక్షి: లోపలికి తీసుకెళ్లండి రాత్రి గాయత్రీ దేవి ఛాయ చూడాలి అన్నా తన కోరిక తీరాలి అన్నా తిలోత్తమ క్షేమంగా ఉండాలి కదా. 


వల్లభ: మమ్మీ గుర్రానికి నాలుగు కాళ్లు ఉంటాయి కదా విశాలాక్షికి  రెండు కాళ్లు ఎందుకు ఉన్నాయి.


తిలోత్తమ: ఎందుకంటే విశాలాక్షి గుర్రం కాదుకదా..


వల్లభ: కాకపోతే మరి రెండు కాళ్లు ఎందుకు ఉన్నాయి. 


తిలోత్తమ: మాయ చేసి ఉంటుందిరా. ఛాతిలోని నొప్పి ఇంకా తగ్గలేదురా మరేం అడగకురా. వదిలేయ్..
 
హాసిని తులసి ఆకు రసం పట్టుకొని వస్తుంది. తింగరి మొగుడు పెళ్లాలు కలిసి తిలోత్తమను ఇబ్బంది పెడతారు. ఇక వల్లభ తిలోత్తమ కాళ్లు పట్టుకోగానే.. హాసిని పసరు తాగించేస్తుంది. తిలోత్తమ గింజుకుంటుంది. 


విశాల్: వదినా.. రాత్రికి అమ్మ ఆచూకి ఏ రూపంలో కనిపిస్తుందా అని టెన్షన్ పడుతున్నాను.


హాసిని: నువ్వు బయట పడటం లేదు. నేను ఇందులో నుంచి ఎలా బయట పడాలా అని ఆలోచిస్తున్నాను. 


విశాల్: గాయత్రీ నీడను పట్టికూడా చెప్పేస్తారు.


హాసిని: ఈజీగా దొరికిపోతుంది. ఒక పని చేస్తే.. పాపను తీసుకొని ఎటైనా వెళ్లిపోతే.. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు.


విశాల్: కష్టం వదినా..


హాసిని: అసలు గురువుగారు మనకి హెల్ప్ చేస్తున్నారో.. ఇరికిస్తున్నారో అర్థం కావడం లేదు. 


విశాల్: పాపం ఆయన మాత్రం ఏం చేస్తారు వదినా.. జరగబోయేది ముందే చెప్పడం వలన జాగ్రత్త పడటానికి అవకాశం సృష్టించమంటున్నారు. అసలు పాప నీడ కనిపిస్తుంది కాబట్టి పాపే మా అమ్మ అని గుర్తుపట్టేస్తారు అని భయంగా ఉంది.


హాసిని: ఏంటమ్మా అలా చూస్తున్నావ్. నువ్వు చిన్నప్పుడే తప్పిపోయావ్. మళ్లీ ఈ ఇంటికి వచ్చాక నిన్ను కాపాడుకోవడం కష్టమైంది.  


విశాల్: వదినా పాపని అంటే తనకి ఏం అర్థమవుతుంది.


హాసిని: అమ్మా.. మీ అమ్మని అంత తక్కువ అంచనా వేయకు. మాటలు రావడం లేదు కానీ తను మనకన్నా బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితి తనకు తెలుసు కాబట్టి ఏం చేయాలా అని ప్లాన్స్ వేసేస్తుంది. 


ఇంతలో విశాల్‌కు ఓ ఐడియా వస్తుంది. పాపకు డ్రస్ వేయాలి అని అంటాడు. తర్వాత తన ప్లాన్ వదినకు చెప్తాడు. ఐడియా అదిరిపోయిందని హాసిని అంటుంది. వదినకు అమలు చేయమంటాడు. తాను అనుమానం రాకుండా చూసుకుంటా అంటాడు. ఇక హాసిని పాపని తీసుకొని కొత్తగా రెడీ చేస్తాను అంటుంది. 


ఇక సూర్యాస్తమయం కావడంతో అమ్మవారికి పూజ చేస్తారు. అందరూ పౌర్ణమి ఛాయ కోసం ఎదురు చూస్తారు. అందరూ గాయత్రీ దేవి ఛాయ కోసం తెగ ఆరాట పడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: మానవ శక్తితో ఈ ఆత్మను కట్టడి చేయలేం, అది దైవశక్తి వల్లే సాధ్యం - భయపెడుతున్న తమన్నా, రాశిఖన్నా 'బాక్' ట్రైలర్‌