Naga Panchami Today Episode పంచమి ఆలోచిస్తూ ఉంటే మోక్ష పాలు తీసుకొని వస్తాడు. పంచమికి తానే దగ్గరుండి పాలు తాగిస్తాడు. దీంతో పంచమి ఒకప్పుడు మోక్ష ప్రేమ అంతా నాకే అని మురిసిపోయానని ఇప్పుడు తమకు పుట్టబోయే బిడ్డ మొత్తం లాగేసుకుందని అంటుంది.  


పంచమి: మీ జాగ్రత్తలు చూస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. రేపు బిడ్డ పుడితే మీరు అసలు నన్ను పట్టించుకోరు కదా.
మోక్ష: నువ్వు నా గుండె అయితే మనకు పుట్ట బోయే బిడ్డ నా ఊపిరి పంచమి. నా గుండె కొట్టుకోవాలి అంటే మీ ఇద్దరూ ఉండాల్సిందే. 
పంచమి: కానీ నాకు అన్నీ మీరే మోక్షాబాబు. మీరు లేకుంటే నేను లేను. మీ ప్రేమే నన్ను బతికిస్తుంది. 
మోక్ష: నాకు నువ్వు నీకు నేను పంచమి మన కలయిన మన ప్రయాణం గుర్తుచేసుకుంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. మనం ఒకరి కోసం ఒకరం పుట్టాం పంచమి. ఇప్పుడు మన కోసం ఈ బుజ్జిది పుట్టబోతుంది. 
పంచమి: అవును ఈ రోజు అంతా మనకు ఏదో పని ఉంది అన్నారు ఏంటది.
మోక్ష: మన పాపకు పేరు సెలక్ట్ చేయడం. 
పంచమి: మరి బాబు పుడితే.
మోక్ష: మీ అమ్మ పుడుతుంది అన్నావ్ కదా. అందుకే పాపే పుడుతుంది. ఏమైంది పంచమి.
పంచమి: ఏం లేదు మోక్షాబాబు మా అమ్మ ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా.
మోక్ష: నీలాగే అందంగా ఉంటుంది. 


పంచమి, మోక్ష ఇద్దరూ పుట్టబోయే బిడ్డ కోసం ప్రేమగా మాట్లాడుకుంటారు. ఇక పంచమి మోక్షను ముద్దు పెట్టుకుంటుంది. దీంతో మోక్ష చాలా సంతోషిస్తాడు. మరోవైపు వైదేహి తానేం చెప్పినా మోక్ష తప్పుగా తీసుకుంటున్నాడు అని బాధ పడుతుంది. 


రఘురాం: ఇప్పుడు మనం వాళ్లకు ఇచ్చే సలహా చాలా ఆలోచించి ఇవ్వాలి. అస్సలు తొందరపాటు పనికిరాదు. ఎందుకుంటే మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం పంచమికి లేదు. 
వైదేహి: ఏవండీ మన డాక్టర్ అంత చెప్పినా వినకుండా మనం వాళ్ల ఇష్టానికి వదిలేయడం సరికాదండి. జీవితాంతం నరకం అనుభవించాల్సింది వాళ్లే అండి.
జ్వాల: ఇందులో ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు క్యాన్సిల్ చేసేయ్ మని మోక్షకి చెప్పండి మామయ్య.
చిత్ర: నేను మొదటి నుంచి చెప్తున్నా ఆ పంచమికి పాము పిల్లే పుడుతుంది. 
భార్గవ్: ఏ పిల్ల పుడితే మనకు ఎందుకు. మనం సలహాలు ఇవ్వడం కూడా వేస్ట్. 
వరుణ్: మమ్మీ డాడీ ఎలాగూ చెప్పలేరు. పిల్లలు వద్దని నువ్వే చెప్పేయ్ ఆలస్యం చేస్తే మన పరువే పోతుంది. 
శబరి: సలహాలు ఇవ్వడం ఈజీనే కానీ రేపు మళ్లీ వాళ్లకు పిల్లలు కావాలి అంటే ఎలా వస్తారు.
జ్వాల: అది డిసైడ్ చేసుకోవాల్సింది మోక్ష.
మోక్ష: అల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. మాకు పుట్టబోయే బిడ్డ కోసం మీరు ఎవ్వరూ వర్రీ అవ్వనవసరం లేదు మేం  చాలా క్లారిటీగా ఉన్నాం. నేను సైంటిస్ట్‌ని నాకు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో క్లారిటీ ఉంది. ఇక మీరు దీని గురించి మర్చిపోండి. 
వైదేహి: మోక్ష నేను పిల్లల్ని కన్నదాన్నే నాకు ఆ ప్రేమ తెలుసు. కానీ మీకు అది వికటించకూడదు అనే నా బాధ. కావాలంటే ఆ డాక్టర్ని మరోసారి కలుద్దాం. లేదంటే పెద్ద హాస్పిటల్‌కి వెళ్లి చూపిద్దాం.  మళ్లీ పిల్లలు పుట్టరు అన్న కారణంతో జీవితాంతం సరిదిద్దుకోలేని పొరపాటు మాత్రం చేయొద్దు నాన్న.
రఘురాం: ఇది చాలా సున్నితమైన విషయం నాన్న. మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఎందుకుంటే ఎంత విలువైన వస్తువు అయినా నచ్చకపోతే పడేయొచ్చు. కానీ పిల్లల విషయంలో ఆ మానసిక సంఘర్షణ చాలా ఘోరంగా ఉంటుందిరా. ఈ విషయంలో ఒకటికి వందసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.
మోక్ష: మీరు అనుకున్నంత క్రిటికల్ ఇష్యూలు ఏం రావు నాన్న. మాకు పుట్టబోయే బిడ్డకు ఏ చిన్న ప్రాబ్లమ్ కూడా రాదు.
పంచమి: దేవుడి మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది. 
మోక్ష: ఇంక ఈ విషయాన్ని మీరు వదిలేయండి. మేం చూసుకుంటాం. 


పంచమి మోక్షలు పార్క్‌లో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కరాళి మంత్ర శక్తితో చూస్తుంది. గరుడ పక్షిగా మారిన ఫణేంద్రను రప్పిస్తుంది. భార్యభర్తలు ఆనందంగా ఉన్నారని వాళ్ల సంతోషం రెండు నిమిషాల్లో మాయమైపోవాలి అని పంచమిని గాయపరిచి తన గర్భం పోయే వరకు తరిమి తరిమి వెంటాడమని ఆదేశిస్తుంది. 


పార్క్‌లో పంచమి మోక్ష సంతోషంగా ఉండగా గరుడరాజు (ఫణేంద్ర) గరుడపక్షిగా మారి పంచమి మీదకు దాడికి వస్తాడు. పంచమి చాలా భయపడుతుంది. మోక్ష కూడా దాన్ని చూసి షాక్ అవుతాడు. గరుడ పక్షి పంచమిని వెంటాడుతుంది. దీంతో పంచమి పరుగులు తీస్తుంది. ఇక నాగేశ్వరి పాము కూడా అక్కడికి వస్తుంది. 


మోక్ష పంచమిని గరుడ నుంచి కాపాడుకుంటూ పొదల వెనక దాక్కొంటాడు. ఇక నాగేశ్వరి పాము గరుడపక్షితో పోరాడుతుంది. దీంతో గరుడపక్షి వెనక్కి వెళ్లిపోతుంది. మోక్ష, పంచమి బయటకు వస్తారు. మోక్ష పంచమిని తీసుకొని ఇంటికి వెళ్లిపోతాడు. ఇక గరుడుపక్షి కరాళి దగ్గరకు గాయాలతో వస్తుంది. అది చూసి కరాళి షాక్ అవుతుంది. నాగేశ్వరి పాముని  ఓడించడం చాలా కష్టం అని గరుడపక్షి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: వైర‌ల్ అవుతున్న మ‌హేశ్ బాబు వీడియో.. రాజ‌మౌళి సినిమా లుక్ అదేనా?