Stock Market Today, 28 November 2023: మూడు రోజుల వరుస సెలవుల తర్వాత, ఈ రోజు (మంగళవారం), ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు 'జాగ్రత్త వైఖరి'తో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 


గత వారంలో బుల్స్‌ ర్యాలీతో ఊపిరి పీల్చుకున్న అమెరికన్‌ మార్కెట్లు, నిన్న స్వల్ప నష్టాలతో ఎరుపు రంగులో ముగిశాయి. ఈ వారం ఫెడ్ చైర్మన్‌ ప్రసంగం, ద్రవ్యోల్బణం డేటాపై దృష్టి ఉంటుంది.


ఏసియా-పసిఫిక్‌ మార్కెట్ల నుంచి మిక్స్‌డ్‌ సిగ్నల్స్‌ అందుతున్నాయి. నికాయ్‌, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.3 శాతం వరకు తగ్గాయి. కోస్పి, తైవాన్ 0.4 శాతం చొప్పున పెరిగాయి.


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 27 పాయింట్లు లేదా 0.14% గ్రీన్‌ కలర్‌లో 19,883 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఈ రోజు F&O నిషేధంలో ఉన్న స్టాక్స్‌: బలరాంపూర్ చీని, BHEL, గ్రాన్యూల్స్ ఇండియా, హిందుస్థాన్ కాపర్, HPCL, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, Zee ఎంటర్‌టైన్‌మెంట్.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


BSE: గ్లోబల్ బ్రోకరేజ్ కంపెనీ జెఫరీస్, BSE షేర్ల మీద 'బయ్‌' రేటింగ్‌ + రూ. 2,700 ప్రైస్‌ టార్గెట్‌తో కవరేజీని ప్రారంభించింది. బీఎస్‌ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయి నుంచి మరో 24 శాతం ర్యాలీ చేస్తుందని ఈ ప్రైస్‌ టార్గెట్‌ అర్ధం. BSE షేర్లు గత ఆరు నెలల్లో 4 రెట్లు పెరిగాయి.


సీమెన్స్: 2023 సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను ఈ రోజు నివేదిస్తుంది.


ఐషర్ మోటార్స్: రూ. 2.69 లక్షల ప్రారంభ ధరతో కొత్త హిమాలయన్ బైక్‌ను విడుదల చేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 కూడా రూ. 4.25 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రైస్‌తో వద్ద అందుబాటులో ఉంటుంది.


న్యూజెన్ సాఫ్ట్‌వేర్: ఈ కంపెనీ బోర్డు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలిపింది.


హోనాస కన్స్యూమర్: షేరు ధరలో తీవ్రమైన అస్థిరత వల్ల, స్టాక్‌ ఎక్స్ఛేంజీలు ఈ స్టాక్ రోజువారీ సర్క్యూట్ పరిమితిని 20% నుంచి 10%కు తగ్గించాయి.


సెల్లో వరల్డ్: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.17.70 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో రూ. 11.02 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. మొత్తం ఆదాయం QoQలో 1.7% పెరిగి రూ.251.38 కోట్లకు చేరుకుంది.


లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC): డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భాగంగా, ఫిన్‌టెక్ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు.


రియాల్టీ షేర్లు: గత తొమ్మిది నెలల్లో దేశంలో లగ్జరీ హౌసింగ్‌ అమ్మకాలు 97% వరకు పెరిగాయి. ఎక్కువ మంది కస్టమర్లు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ కోసం ప్రత్యేక గదులతో కూడిన పెద్ద స్పేస్‌ ఉన్న ఇళ్లను ఎంచుకుంటున్నారు.


ఫోర్టిస్ మలార్ హాస్పిటల్స్: చెన్నై గాంధీనగర్‌లోని మలార్ హాస్పిటల్‌ను రూ. 45.50 కోట్లకు MGM హెల్త్‌కేర్‌కు విక్రయించనున్నారు.


అదానీ గ్రూప్: అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో, సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పును రిజర్వ్ చేసింది, సెబీకి మరికొన్ని ఆదేశాలు ఇస్తామని సూచించింది. ఈ కేసు విచారణను పూర్తి చేసేందుకు పొడిగింపు కోరబోమని సెబీ కోర్టుకు తెలిపింది.


ఇండిగో: నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, ఇండిగోతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2024 చివరి నాటికి ఇక్కడి నుంచి ఇండిగో సేవలు ప్రారంభం అవుతాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply


మరో ఆసక్తికర కథనం: సెల్లింగ్‌ ట్రెండ్‌ను రివర్స్‌ చేసిన ఫారిన్‌ ఇన్వెస్టర్లు, మార్కెట్లు రేంజ్‌ బౌండ్‌ నుంచి బయటపడే ఛాన్స్‌!