Cockroaches: మీరు బెడ్ రూమ్‌లో భోజనం చేస్తున్నారా? మంచంపై కూర్చొని ఆహార పదార్థాలు తింటున్నారా? అయితే మీరు చాలా పెద్ద ప్రమాదంలో పడ్డట్టే.. ఇవి ఎంత పెద్ద ప్రమాదమో తెలిస్తే మీ మతి పోవడం ఖాయం. 


సాధారణంగా ఇళ్లల్లో ఎక్కువగా కనిపించే కీటకం బొద్దింక. వాటిని మనం ఎంత కంట్రోల్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. బొద్దింకలు ఆరోగ్యానికి హానికరం. వాస్తవానికి ఈ బొద్దింకలు ఆహారం ఎక్కడ ఉంటే అక్కడే ఎక్కువగా తిరుగుతుంటాయి. కాబట్టి, అసలు విషయం మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. బెడ్ రూమ్‌లో భోజనం చేసినా.. ఇదే పరిస్థితి. మీ బెడ్ కూడా బొద్దింకలకు నివాసంగా మారుతుంది. ఆగండి.. ఆగండి.. అసలైన డేంజర్ గురించి మీరు ఇంకా తెలుసుకోలేదు.


బెడ్రూంలో భోంచేస్తే అంతే సంగతులు :


మీరు బెడ్ రూమ్ లో భోజనం చేసినప్పుడు కొద్ది మొత్తంలో ఆహార పదార్థాలు మీ బెడ్ చుట్టుపక్కల పడటం సహజమే. వాటిని తినేందుకు బొద్దింకలు అక్కడ చేరుకుంటాయి.  అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మంచంపై తిరిగే బొద్దింకలు ఊరికే ఉండవు.. మీరు నిద్రిస్తున్నప్పుడు నెమ్మదిగా మీ చెవుల్లోకి దూరతాయి. ఎందుకంటే.. చెవుల్లో మన శరీరం స్రవించే జిగురుకు అవి ఆకర్షితమవుతాయి. అలా నెమ్మదిగా బొద్దింకలు మీ చెవి లోపలికి ప్రవేశిస్తాయి. అప్పుడు మీకు ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది.


చెవిలో జోరీగ కాదు బొద్దింక:


సోషల్ మీడియాలో తరచూ మనం పలు వైరల్ వీడియోలు చూస్తూనే ఉంటాం. అలాంటి వీడియోలో కొందరు తమ చెవుల్లో బొద్దింకలు నివాసం పెట్టినట్లు షూట్ తీసి మరి చూపిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల చోటు చేసుకున్నాయి. దీనికి ప్రధాన కారణం మీ బెడ్ రూమ్‌లో పరిశుభ్రత లేకపోవడమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ముఖ్యంగా బెడ్రూంలో ఆహార పదార్థాలు తిన్నప్పుడు చిన్న చిన్న ఆహార వ్యర్ధాలు పడటం సహజమే. అయితే వాటిని గమనించకుండా వదిలేస్తే ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆహార పదార్థాలను తినేందుకు బొద్దింకలు మీ మంచం చుట్టూ చేరుతాయి. అవి మీరు నిద్రిస్తున్నప్పుడు నెమ్మదిగా చెవు లోపల భాగంలోకి ప్రవేశిస్తాయి. అవి మీ చెవిలోకి వెళ్లినా మీకు పెద్దగా స్పర్శ తెలియదు. నొప్పి కూడా ఉండదు. అవి పూర్తిగా చెవి లోపలికి ప్రవేశించిన తర్వాతే నొప్పి కలుగుతుంది. మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే కంగారు పడొద్దు. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.


ఇలా చేస్తే బెటర్:


మీ బెడ్రూంలో బొద్దింకల బాధ ఉన్నట్లయితే, వెంటనే శుభ్రం చేసుకోవడం మంచిది. మీ బెడ్రూంలో బొద్దింకలు చేరకుండా అక్కడ ఆహార పదార్థాలు ఉంచకూడదు. మీ బెడ్ పై ఆహారం తినకూడదు. అలాగే మీరు నిద్రిస్తున్నప్పుడు చెవులో కాటన్ బడ్స్ పెట్టుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Also Read : మునగ ఆకులో ఇన్ని ప్రయోజనాలా? ఆరెంజ్, అరటి పండు కంటే మెరుగైన పోషకాలు


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.