Stock Market Today, 28 December 2023: నిన్న (బుధవారం) ట్రేడ్స్‌ సరికొత్త ఎత్తులకు చేరడ్‌లలో కొత్త ఎత్తులను చేరాయి. అదే జోరు ఈ రోజు కూడా కొనసాగి, బెంచ్‌మార్క్ సూచీలు మరొకసారి కొత్త గరిష్టాలను టచ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే, మంత్లీ డెరివేటివ్స్‌కు చివరి రోజు కాబట్టి కొంత అస్థిరత ఉండొచ్చు.


మరోవైపు, డీమ్యాట్ & మ్యూచువల్ ఫండ్ ఖాతాల్లో నామినీని యాడ్‌ చేసే గడువును సెబీ 2024 జూన్ 30 వరకు పొడిగించింది.


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 05 పాయింట్లు లేదా 0.02% రెడ్‌ కలర్‌లో 21,754 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


బ్యాంకులు, NBFCs: ఈ ఆర్థిక సంస్థలు పటిష్టంగా ఉన్నాయని 'ట్రెండ్ & ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫర్ 2022-23'లో ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ నేపథ్యంలో, బ్యాంకులు, బ్యాంకింగేతర ఫైనాన్షియల్ కంపెనీల ( NBFCs) షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. బ్యాంకుల స్థూల నిరర్థక ఆస్తులు (GNPAs) దశాబ్ద కనిష్ట స్థాయికి చేరుకున్నాయి.


ఆజాద్ ఇంజినీరింగ్: ఈ రోజు ఈ కంపెనీ షేర్లు మార్కెట్లలో అరంగేట్రం చేస్తున్నాయి. ఈ స్టాక్‌కు 50 శాతం పైగా లిస్టింగ్ గెయిన్స్‌ను గ్రే మార్కెట్ ప్రీమియం సూచిస్తోంది.


జొమాటో: 29 అక్టోబర్ 2019 నుంచి 31 మార్చి 2022 వరకు, వడ్డీ & పెనాల్టీతో సహా రూ.401.70 కోట్ల పన్ను చెల్లించాలని చెబుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ GST ఇంటెలిజెన్స్ జొమాటోకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. 


బాటా ఇండియా: రూ.60.56 కోట్ల పన్ను & వడ్డీ చెల్లింపు కోసం సేల్స్ టాక్స్ అన్నా సలై అసెస్‌మెంట్ డివిజన్ నుంచి షోకాజ్ నోటీసును అందుకుంది.


అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ టోటల్ గ్యాస్: ఈ రెండు అదానీ గ్రూప్ కంపెనీలు... కొత్త భాగస్వామ్యాన్ని, కొత్త ఆర్డర్‌ను, జాయింట్ వెంచర్‌ను బుధవారం వేర్వేరుగా ప్రకటించాయి.


కన్సాయ్ నెరోలాక్ పెయింట్స్: ముంబైలో కొంత భూమిని, భవనాన్ని రూ.726 కోట్లకు రన్‌వాల్ గ్రూప్‌నకు విక్రయించనుంది.


KPI గ్రీన్ ఎనర్జీ: బోనస్ ఇష్యూ, మూలధనం పెంపు, ఇతర వ్యాపారాల గురించి పరిశీలించడానికి ఈ నెల 30న ఈ కంపెనీ బోర్డు సమావేశం కానుంది.


సౌత్ ఇండియన్ బ్యాంక్: ఈక్విటీ షేర్లను ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన జారీ చేసి ద్వారా రూ.1,750 కోట్ల వరకు సమీకరించనుంది.


SBI: వివిధ కాలావధుల కోసం 50 బేసిస్ పాయింట్ల (bps) వరకు రిటైల్ & బల్క్ డిపాజిట్ల వడ్డీ రేట్లను పెంచింది, బుధవారం నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి.


ఈ రోజు F&O నిషేధంలో స్టాక్స్‌: నేషనల్ అల్యూమినియం, RBL బ్యాంక్ 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గ్రీన్‌ ఎనర్జీపై అదానీ దృష్టి-రూ.9,350 కోట్ల పెట్టుబడులు