Stock Market Today, 25 April 2024: వాల్‌ స్ట్రీట్‌లో అస్థిర వాతావరణం నెలకొంది, ఈ రోజు (గురువారం) ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు మీద అది ప్రభావం చూపవచ్చు. ఏప్రిల్ డెరివేటివ్స్ సిరీస్ నెలవారీ F&O గడువు ఈ రోజు ముగుస్తుంది. దీంతోపాటు గ్లోబల్ మార్కెట్ల సూచనలు, Q4 FY24 ఫలితాలను ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ట్రాక్‌ చేస్తారు.


మంగళవారం సెషన్‌లో నిఫ్టీ ఇండెక్స్‌ 22,402 దగ్గర క్లోజ్‌ అయింది. ఈ ఉదయం 8.10 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 22,362 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం కావచ్చని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో, ఈ ఉదయం జపాన్‌కు చెందిన నికాయ్‌ 1.7 శాతం, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 1 శాతం క్షీణించాయి. హాంగ్ సెంగ్, షాంఘై కాంపోజిట్ 0.3 శాతం వరకు పడిపోయాయి.


యూఎస్‌లో, నిన్న, S&P 500 0.02 శాతం లాభపడగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.11 శాతం పడిపోయింది. నాస్‌డాక్ కాంపోజిట్ 0.1 శాతం పెరిగింది.


యూఎస్‌ ఎకనమిక్‌ డేటా కోసం ట్రేడర్లు ఎదురు చూస్తుండడంతో అమెరికన్‌ బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పెరిగింది, ప్రస్తుతం 4.642 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $88 దిగువకు వచ్చింది. గోల్డ్ స్థిరంగా ఉంది, ఔన్సుకు $2,331 దగ్గర ఉంది. 
 
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఈ రోజు Q4 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: నెస్లే ఇండియా, టెక్ మహీంద్ర, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, కోరమాండల్ ఇంటర్నేషనల్, సైయెంట్‌, L&T టెక్నాలజీ సర్వీసెస్, లారస్ ల్యాబ్స్, యంఫసిస్, షాఫ్లర్‌ ఇండియా, తాన్లా ప్లాట్‌ఫామ్స్‌, UTI అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, జెన్సార్ టెక్నాలజీస్.


కోటక్ మహీంద్ర బ్యాంక్: కొత్త క్రెడిట్‌ కార్డ్‌లు జారీ చేయకుండా, కొత్త కస్టమర్లను చేర్చుకోకుండా కోటక్ మహీంద్ర బ్యాంక్‌ మీద రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించింది.


ITC: ఐటీసీ హోటల్స్‌ డీమెర్జర్‌ స్కీమ్‌ను ఆమోదించడానికి ITC సాధారణ వాటాదార్లు జూన్ 06న సమావేశం అవుతారు.


యాక్సిస్ బ్యాంక్: దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ4ఎఫ్‌వై24) రూ.7,129.67 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది, అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.5,728.42 కోట్ల నికర నష్టాన్ని ఆర్జించింది. నికర వడ్డీ మార్జిన్ 4.06 శాతం వద్ద ఉంది, QoQలో అతి స్వల్పంగా 5 bps పెరిగింది.


హిందుస్థాన్ యూనిలీవర్: కంపెనీ నికర లాభం Q4 FY24లో 1.6 శాతం YoY తగ్గి రూ. 2,558 కోట్లకు చేరింది. ఏకీకృత ఆదాయం ఒక శాతం కన్నా తక్కువ పెరిగి రూ. 15,441 కోట్లు వచ్చింది. 


ఇండియన్ హోటల్స్: 2024 మార్చి త్రైమాసికంలో ఏకీకృత లాభంలో 29.36 శాతం YoY వృద్ధితో రూ. 438.33 కోట్లకు పెరిగింది.


LTI మైండ్‌ట్రీ: ఈ IT సేవల కంపెనీ జనవరి-మార్చి కాలంలో రూ. 1,100 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. సంవత్సరానికి (YoY) ఇది 1.2 శాతం తగ్గింది. ఆదాయం 2.3 శాతం వృద్ధితో రూ. 8,892.9 కోట్లకు పెరిగింది. ఈ రెండు నంబర్లు అంచనాలను మిస్‌ చేశాయి.


మాక్రోటెక్ డెవలపర్స్‌: మార్చి త్రైమాసికంలో మాక్రోటెక్ డెవలపర్స్ (లోధా) ఏకీకృత నికర లాభం వార్షికంగా 10.6 శాతం పడిపోయి రూ.667 కోట్లకు పరిమితమైంది. అయితే.. ప్రీ-సేల్స్‌ విషయంలో ఈ కంపెనీ అత్యుత్తమ త్రైమాసిక & వార్షిక గణాంకాలను నివేదించింది.


నిన్న Q4 ఫలితాలు ప్రకటించిన కొన్ని కంపెనీలు: AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సింజీన్ ఇంటర్నేషనల్, సుప్రీం పెట్రోకెమ్, OFSS, ఆగ్రో టెక్ ఫుడ్స్, అనంత్ రాజ్, దాల్మియా భారత్, 5G, మరియు MAS ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ రోజు ట్రేడింగ్‌లో వీటిపైనా ఇన్వెస్టర్ల ఫోకస్‌ ఉంటుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్‌ ఈక్విటీ ఫండ్స్‌ - వీటి ట్రాక్ రికార్డ్‌ కేక