Horoscope Today 25th April 2024
మేష రాశి
ఈ రోజు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించవద్దు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. కష్టపడి పని చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆరోగ్యం బావుంటుంది
వృషభ రాశి
మీ సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. అనవసర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వొద్దు. మీ పనిలో స్థిరత్వం ఉంటుంది. శత్రువు మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ సహోద్యోగులలో కొందరు మిమ్మల్ని చూసి అసూయపడతారు. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక సంబంధిత నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి.
Also Read: మేష రాశిలో శుక్ర సంచారం - ఈ 7 రాశులవారికి ఆర్థికలాభం, ఆనందం!
మిథున రాశి
ఈ రోజు అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. ఎక్కువ ఒత్తిడికి గురికావొద్దు. సానుకూల ఆలోచనలు కొనసాగించండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు సాధారణ ఫలితాలున్నాయి. ప్రేమ సంబంధాలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ అజాగ్రత్త పెద్ద సమస్యలను ఆహ్వానించవచ్చు
కర్కాటక రాశి
పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి సలహా తీసుకోండి. కార్యాలయంలో బాధ్యతల ఒత్తిడి పెరగవచ్చు. ప్రత్యర్థులు మీ ఇమేజ్‌ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. మీరు చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. మీ ప్రవర్తన వల్ల అంతా మీవైపు ఆకర్షితులవుతారు. అయితే మీరు సలహాలు ఇచ్చేటప్పుడు వారిపై ఎక్కువ ఆధిపత్యం చెలాయించవద్దు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
Also Read: మే 19 వరకూ ఈ 4 రాశులవారికి చుక్కలే - ముఖ్యంగా మాట జాగ్రత్త!
సింహ రాశి
సింహ రాశివారు క్రమశిక్షణతో ఉంటారు. మీరు ఒక ముఖ్యమైన సమావేశానికి ప్లాన్ చేసుకోవచ్చు. డబ్బుకు సంబంధించిన సమస్య పరిష్కారమవుతుంది. రాజకీయాలతో ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈ రోజు గొప్ప రోజు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి పొందుతారు. ఆరోగ్యం బావుంటుంది.
కన్యా రాశి
ఆలోచనలు సానుకూలంగా ఉంచుకోండి. సమస్యలను చూసి పారిపోవద్దు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. పిల్లలు చదువు విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు. సోమరితనం దరిచేరనివ్వొద్దు.
Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!
తులా రాశి
మీ కలలు పెద్దగా ఉంటాయి కానీ గాల్లో మేడలు కట్టొద్దు. ఉన్నత లక్ష్యాలు కలిగి ఉండడం సరే కానీ వాటినిచేరుకునేందుకు ప్రణాళికలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. బయట ఆహారానికి దూరంగా ఉండాలి. కుటుంబానికి సమయం కేటాయించాలి. కొందరు తమ పిల్లల కెరీర్ గురించి గందరగోళానికి గురవుతారు.
వృశ్చిక రాశి
మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉండండి. విదేశాలలో ఉండే వారికి డబ్బు కొరత ఏర్పడవచ్చు. అడగకుండా సలహాలు ఇవ్వడం వల్ల మీరు అవమానాల పాలవుతారు. ఇది మీకు సానుకూలంగా ఉండకపోవచ్చు కానీ కొన్నిసార్లు దీనివల్ల కూడా మీకు మంచే జరుగుతుంది.
ధనుస్సు రాశి
ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉంటుంది కానీ నెమ్మదిగా మార్పువస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. కోర్టు కేసులలో మీకు అనుకూలంగా నిర్ణయాలు రావచ్చు. వైవాహిక జీవితం బావుంటుంది.
Also Read: రాజకీయ నాయకుల విమర్శలలో వినిపించే 'పాపాల భైరవుడు' పురాణాల్లో ఉన్నాడా!
మకర రాశి
మీ జీవిత భాగస్వామితో కొనసాగుతున్న వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపార పనులపై చేసే ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. సంబంధాల మధ్య పెరుగుతున్న దూరాలు తొలగిపోతాయి. మీ సామర్థ్యం మేరకు పని చేయడం ద్వారా సంతృప్తి పొందుతారు. మీరు కోరుకున్న జీవితాన్ని పొందడానికి తగిన ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.
కుంభ రాశి
ఆరోగ్యం బాగుంటుంది. రహస్య విషయాలవైపు ఆకర్షితులవుతారు. కోపాన్ని నియంత్రించుకోండి. కొన్నిసార్లు విచారంగా , ఒంటరిగా అనిపిస్తుంది. కొత్త స్నేహితులను కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
మీన రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు లేవు..జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. మారుతున్న వాతావరణ ప్రభావం మీ ఆరోగ్యంపై ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కొన్ని రోజులు వాయిదా వేయడం మంచిది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...