Venus Transit 2024: శని రెండేళ్లకోసారి రాశిమారుతాడు..రాహు, కేతువులు ఏడాదికోసారి రాశి మారుతారు. కానీ మిగిలిన గ్రహాలైన సూర్యుడు, కుజుడు, గురుడు, శుక్రుడు, చంద్రుడు, బుధుడు మాత్రం నెల రోజులకో రాశిలో సంచరిస్తారు.  అన్ని గ్రహాల కన్నా శుక్రుడుని శుభగ్రహంగా పరిగణిస్తారు. ఒక్కోసారి శని ప్రభావం ఉన్నప్పటికీ శుక్రుడు, గురుడు అనుకూలం అయితే శని ప్రభావం తగ్గుతుంది. పైగా శుక్రుడు విలాసాలకు అధిపతి . ఏప్రిల్ 23 వరకూ మీన రాశిలో సంచరించిన శుక్రుడు ఏప్రిల్ 24 నుంచి మేషంలో అడుగుపెట్టాడు. మే 19 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. ముఖ్యంగా వృషభం, కన్యా, కుంభం, మీనం రాశులవారికి ప్రతికూల ఫలితాలున్నాయి...తులా రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి..


వృషభ రాశి (Taurus)


మీ రాశి నుంచి పదకొండో స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు. ఈ ఫలితంగా ఉద్యోగులకు సమస్యలు తప్పవు. చేసే పనిలో నిర్లక్ష్యం ఉండకూడదు. ఓపిగ్గా వ్యవహరించాలి. ఆ సమయంలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.  విలాసాల కోసం ఖర్చులు పెరుగుతాయి.  


Also Read: అక్షయతృతీయ రోజు బంగారం కొనాల్సిందే అనే మాయలో పడుతున్నారా!


కన్యా రాశి (Virgo)


మేష రాశిలో శుక్ర సంచారం అంటే మీకు అష్టమంలో ఉంది..ఎనిమిదో స్థానంలో శుక్రుడి సంచారం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వ్యాపారంలో లాభం పొందలేరు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. మీ మాటతీరుని నియంత్రించుకోవాలి. ఆర్థిక సంబంధిత విషయాల్లో పురోగతి సాధ్యమే. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 


తులా రాశి  (Libra)


శుక్రుడు మీ రాశి నుంచి ఏడో స్థానంలో ఉన్నాడు. ఫలితంగా వైవాహిక, ప్రేమ జీవితంలో చిన్న చిన్న వివాదాలు వచ్చినా చివర్లో సర్దుకుంటాయి. వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ఘడియలు ఆసన్నమవుతాయి..


Also Read: రాజకీయ నాయకుల విమర్శలలో వినిపించే 'పాపాల భైరవుడు' పురాణాల్లో ఉన్నాడా!


కుంభ రాశి (Aquarius )


కుంభ రాశి వారికి శుక్ర గ్రహ సంచారం ఖర్చులు పెంచుతుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ జీవితంలో భాగస్వామి భావోద్వేగాలను గౌరవించండి. చేసే పనిపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత, శ్రద్ధను పెట్టి చేయాల్సి ఉంటుంది. 


మీన రాశి (Pisces)


మేష రాశిలో శుక్రుడి సంచారం మీన రాశివారికి అంతగా కలసిరాదు. మే 19 వరకూ అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీడియా , వినోద రంగాల్లో ఉండే ఉద్యోగులకు సమస్యలు ఎదురవుతాయి. ప్రేమ, వైవాహిక జీవితంలో అనవసర వాదనలుంటాయి. పై స్థాయి అధికారులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందేందుకు అనుకూల సమయం కాదు.


Also Read: రానున్న ఎన్నికల్లో ఈ రాశుల రాజకీయ నాయకులు ధనం నష్టపోయినా గెలుపు పక్కా!


 శుక్రుడు.. జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం, ఆకర్షణ, అందం,  సృజనాత్మకత, కళలు, సంగీతం, కవిత్వం, డిజైనింగ్, వినోదం, ప్రదర్శనలు, గ్లామర్, ఫ్యాషన్, నగలు, విలువైన రాళ్లు, అలంకరణ, విలాసవంతమైన ప్రయాణం, విలాసవంతమైన ఆహారం, లగ్జరీ వాహనాలకు సంబంధించన అంశాలను సూచిస్తుంది.  శుక్రగ్రహ సంచారం అనుకూలం అయితే విలాసవంతమైన జీవితం గడుపుతారు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు... ప్రతికూలం అయితే కొన్ని ఇబ్బందులు తప్పవు...


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి...