TSBIE TS Inter 2nd Year Results 2024: తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చేశాయ్. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 24న ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్ర ఇంటర్ బోర్డు కార్యాలయంలో బుధవారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ రెగ్యూలర్ విద్యార్థులతో పాటు ఒకేషనల్ విద్యార్థుల ఫలితాలు వెల్లడించారు. ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
సెకండియర్ ఒకేషనల్ రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి
జిల్లాల వారీగా సెకండియర్ పాస్ పర్సెంటేజ్..ములుగు - 82.95 శాతంమేడ్చల్ - 79.31రంగారెడ్డి - 77.63 శాతంకరీంనగర్ - 74.39 శాతంఖమ్మం - 74.2 శాతంహన్మకొండ - 73.23 శాతంకొమురం భీమ్ ఆసిఫాబాద్ - 72.06 శాతంజయశంకర్ భూపాలపల్లి - 69.89 శాతంభద్రాద్రి కొత్తగూడెం - 69.73 శాతంనల్గొండ - 68.45 శాతంహైదరాబాద్ - 67.12 శాతంనిర్మల్ - 66.17 శాతంఆదిలాబాద్ - 65.75 శాతంహైదరాబాద్3 - 65.59 శాతంసంగారెడ్డి - 65.57 శాతంరాజన్న సిరిసిల్ల - 65.5 శాతంమహబూబాబాద్ - 65.14 శాతంజనగామ - 64.99 శాతంహైదరాబాద్2 - 64.85 శాతంవనపర్తి - 64.75 శాతంజగిత్యాల - 64.29 శాతంమహబూబ్ నగర్ - 64.21 శాతంజోగులాంబ గద్వాల - 62.82 శాతంసూర్యాపేట - 62.74 శాతంయాదాద్రి - 62.64 శాతంవరంగల్ - 62.27 శాతంవికారాబాద్ - 61.42 శాతంసిద్దిపేట - 61.08 శాతంనిజామాబాద్ - 59.59 శాతంమంచిర్యాల - 59.53 శాతంపెద్దపల్లి - 59.32 శాతంనాగర్ కర్నూల్ - 59.06 శాతంమెదక్ - 57.49 శాతంనారాయణపేట్ - 53.81 శాతంకామారెడ్డి - 44.29 శాతం
ఈ ఏడాది ఇంటర్ బోర్డ్ పరీక్షలకు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కాగా, అందులో సెకండియర్ రెగ్యూలర్ విద్యార్థులు 4,43,993 మంది ఉండగా.. 46,542 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఉన్నారు. తెలంగాణ ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం మంది పాసయ్యారని అధికారులు వెల్లడించారు. తెలంగాణలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. తెలంగాణ ఇంటర్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్ తో పాటు ఏబీపీ దేశం వెబ్‌సైట్ లో ఇంటర్ విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ సెకండియర్ పూర్తైన విద్యార్థులు రెగ్యూలర్ డిగ్రీతో పాటు బీటెక్, ఎంబీబీఎస్ సహా పలు ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరతారు. ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
Also Read: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ రిజల్ట్స్ విడుదల - రంగారెడ్డి టాప్, అట్టడుగున కామారెడ్డి