Stock Market Today, 22 November 2023: రెండు వరుస సెషన్లలో రివర్స్ గేర్‌లో నడిచిన తర్వాత, నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఫ్రంట్ గేర్‌లోకి మారాయి. ఈ రోజు, విదేశీ మార్కెట్ల నుంచి పెద్దగా గ్రీన్ సిగ్నల్స్ లేకపోవడాన్ని బట్టి, మన మార్కెట్లలో ముందుకు కదల్లేకపోవచ్చు.
ఓవర్‌నైట్‌లో, టెక్నాలజీ షేర్లలో బలహీనత కారణంగా US మార్కెట్ ఐదు రోజుల విన్నింగ్ రన్‌ను ముగించింది. US FOMC మినిట్స్ ప్రకారం, భవిష్యత్‌లో వడ్డీ రేట్ల పెంపుపై 'జాగ్రత్తతో కూడిన వైఖరి'ని అనుసరించేందుకు ఫెడ్ నిర్ణయించింది.
ఇండో-పసిఫిక్ మార్కెట్లలో... నికాయ్ 0.4 శాతం పెరగగా, కోస్పి, తైవాన్ 0.5 తలో శాతం క్షీణించాయి.
ఈ రోజు ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 35 పాయింట్లు లేదా 0.17% గ్రీన్ కలర్‌లో 19,8645 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి (Stocks in news Today):
TCS: ఎపిక్ సిస్టమ్స్ కార్పొరేషన్ కేసులో TCSకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. 140 మిలియన్ డాలర్ల పరిహారాన్ని US సుప్రీంకోర్టు నిర్ధారించింది. దీంతో, Q3లో TCSకు 125 మిలియన్ డాలర్ల నష్టం వచ్చే అవకాశం ఉంది.
మారుతి: ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు 12.32 లక్షల ఈక్విటీ షేర్ల కేటాయింపును పరిశీలించేందుకు కంపెనీ బోర్డు ఈ నెల 24న సమావేశం కానుంది.
టైటన్: కేరట్‌లేన్‌లో వాటా కొనుగోలు కోసం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి టైటన్ ఆమోదం పొందింది. ఈ ఏడాది ఆగస్టులో, కేరట్‌లేన్‌లో 27.18 శాతం వాటాను కొనుగోలు చేస్తామని టైటన్ ప్రకటించింది.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్: కంపెనీని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) హోదా నుంచి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ (CIC) కిందకు మార్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జియో ఫిన్ దరఖాస్తు చేసుకుంది.
అరబిందో ఫార్మా: అరబిందో ఫార్మాకు చెందిన యూఎస్ స్టెప్-డౌన్ విభాగం Evive Biotech, కీమోథెరపీ-ఇన్డ్యూస్డ్ న్యూట్రోపెనియా (CIN) కోసం ఉపయోగించే Ryzneuta ఇంజెక్షన్‌ను అమెరికాలో మార్కెటింగ్ చేసేందుకు US FDA నుంచి ఆమోదం పొందింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB): లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), బ్యాంక్ ఆఫ్ బరోడాలో తన వాటాను 4.98 శాతం నుంచి 5.03 శాతానికి పెంచుకుంది.
స్ట్రైడ్స్ ఫార్మా: కంపెనీ పూర్తి యాజమాన్యంలోని సింగపూర్ ఆధారిత అనుబంధ సంస్థ స్ట్రైడ్స్ ఫార్మా గ్లోబల్, లెవెటిరాసెటమ్ ఓరల్ సొల్యూషన్ USP, 100 mg/mL కోసం US FDA నుంచి ఆమోదం పొందింది. మూర్ఛల చికిత్సలో దీనిని ఉపయోగిస్తారు.
ఈ రోజు F&O బ్యాన్‌లో ఉన్న స్టాక్స్: BHEL, చంబల్ ఫెర్టిలైజర్స్, డెల్టా కార్ప్, హింద్ కాపర్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా సిమెంట్స్, మణప్పురం ఫైనాన్స్, MCX, NMDC, RBL బ్యాంక్, Zee ఎంటర్‌టైన్‌మెంట్.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: టీసీఎస్ బైబ్యాక్‌లో పాల్గొనాలంటే ఇన్ని షేర్లు మాత్రమే మీ దగ్గరుండాలి, ఒక్కటి ఎక్కువైనా అర్హత కోల్పోతారు!