TCS Share Buyback Record Date: టెక్నాలజీ జెయింట్‌, టాటా గ్రూప్‌లో ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services) బైబ్యాక్‌ గడువు తేదీ దగ్గర పడుతోంది. రూ.17,000 కోట్ల బైబ్యాక్ ప్లాన్‌ ప్రకటించిన టీసీఎస్, ఈ నెల 25 తేదీని రికార్డ్‌ డేట్‌గా (TCS share buyback plan record date) ప్రకటించింది. 


ఈ ఐటీ సేవల కంపెనీ, ఒక్కో షేరుకు రూ.4,150 ఫ్లోర్ ప్రైస్‌తో షేర్‌హోల్డర్ల నుంచి రూ.17,000 కోట్ల విలువైన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంది. ఇలా, మొత్తం 4.09 కోట్ల షేర్లను (కంపెనీలో 1.12% వాటాకు సమానం) మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటుంది. 


మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా, మన దేశంలో రిలయన్స్ తర్వాత రెండో అతి పెద్ద కంపెనీ, అతి పెద్ద IT కంపెనీ TCS.


ఏ తేదీ లోగా టీసీఎస్‌ షేర్లు కొనాలి? (By which date to buy TCS shares?)
నవంబర్‌ 25వ తేదీన లేదా ఆలోగా డీమ్యాట్‌ అకౌంట్‌లో టీసీఎస్‌ షేర్లు ఉన్న వాళ్లు మాత్రమే బైబ్యాక్‌లో పార్టిసిపేట్‌ చేయడానికి అర్హులు. 25 తేదీ నాటికి డీమ్యాట్‌ అకౌంట్‌లో షేర్లు ఉండాలంటే, మీరు 23వ తేదీ లోగా షేర్లను కొనాలి. సెటిల్‌మెంట్‌ పూర్తయి అవి 25వ తేదీన మీ డీమ్యాట్‌ అకౌంట్‌లో కనిపిస్తాయి. 23వ తేదీ కంటే ముందే కొంటే ఇంకా మంచిది.


ఈ రోజు (మంగళవారం, 21 నవంబర్‌ 2023) మధ్యాహ్నం 12.40 గంటల సమయానికి, BSEలో టీసీఎస్‌ షేర్‌ ప్రైస్‌ (TCS share price today) రూ.16.80 లేదా 0.48% లాభంతో రూ. 3,536.10 వద్ద ఉంది. కంపెనీ ప్రకటించి బైబ్యాక్‌ ఫ్లోర్‌ ప్రైస్‌ రూ. 4,150 కంటే డిస్కౌంట్‌లో ట్రేడ్‌ అవుతోంది.


షార్ట్‌ టర్మ్‌ ట్రేడర్‌ ఎన్ని షేర్లు కొనొచ్చు? (How Many TCS Shares Can A Short-Term Trader Buy?)
బైబ్యాక్‌లో పాల్గొనడానికి రిటైల్‌ ఇన్వెస్టర్లు అర్హులు. పోర్ట్‌ఫోలియోలో రూ.2 లక్షల కంటే తక్కువ విలువైన షేర్లు ఉన్నవాళ్లను రిటైల్‌ ఇన్వెస్టర్లుగా లెక్కలోకి తీసుకుంటారు. బైబ్యాక్‌ తేదీ నాటికి టీసీఎస్‌ షేర్‌ ప్రైస్‌ రూ.4,150కి చేరుకుంటుందని ఊహిస్తే... టీసీఎస్‌ షేర్‌ బైబ్యాక్‌లో పాల్గొనాలంటే ఒక్కో ఇన్వెస్టర్‌ పోర్ట్‌ఫోలియోలో 48 టీసీఎస్‌ షేర్లు (రూ.2,00,000/రూ.4,150) మించి ఉండకూడదు. దీనికి మించి ఒక్క షేర్‌ ఉన్నా, (రూ.4,150)పోర్ట్‌ఫోలియోలో ఉన్న టీసీఎస్‌ షేర్ల విలువ రూ.2 లక్షలు దాటుతుంది. ఒకవేళ, 25 తేదీ నాటికి షేర్‌ ధర రూ.4,150 కంటే తక్కువే ఉంటే, మరికొన్ని షేర్లు యాడ్‌ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. 


ఒకవేళ, మీరు ఇప్పుడు టీసీఎస్‌ షేర్లు కొని & బైబ్యాక్‌ స్కీమ్‌లో పాల్గొనాలంటే, 48 షేర్లు మించకుండా కొనడం ఉత్తమం. అప్పుడే మీకు అర్హత లభిస్తుంది.


గత ఆరేళ్లలో, టీసీఎస్‌కు ఇది 5వ బైబ్యాక్‌. చివరిసారి, 2022 జనవరిలో రూ.18,000 కోట్ల రూపాయల విలువైన సొంత షేర్లను బైబ్యాక్‌ చేసింది. ఆ బైబ్యాక్‌లో షేర్‌ ఫ్లోర్‌ ప్రైస్‌ రూ.4,500. ఆ ఆఫర్‌ 7.5 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్ అయింది.  మార్కెట్‌ నుంచి 4 కోట్ల షేర్లను వెనక్కు తీసుకోవాలని కంపెనీ నిర్ణయిస్తే, షేర్‌హోల్డర్లు మొత్తం 30.12 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేశారు.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఎస్‌బీఐ వికేర్‌ చివరి తేదీ పొడిగింపు - ఎక్కువ వడ్డీ ఆదాయం అందించే స్కీమ్‌ ఇది