Naga Panchami Serial November 21st Episode
సుబ్బు(సుబ్రహ్మణ్యస్వామి) ఓ చెట్టు కింద కూర్చొని ఉంటే అక్కడికి నెమలి(వాహనం) వస్తుంది. ప్రణామాలు చెప్తుంది. తనకు ఓ సందేహం ఉందని చెప్తుంది. సుబ్బు అడుగు అని అంటే. మోక్ష మానవుడు, పంచమి నాగ కన్య వాళ్లకు పెళ్లి అయితే అయింది కానీ వాళ్లు కలిసి కాపురం చేయడం ప్రకృతి విరుద్ధం కదా అని అంటాడు.
సుబ్బు: ముమ్మాటికీ నువ్వు చెప్పింది నిజం. వాళ్ల కలయిక విశ్వంలోనే ఓ వింత అవుతుంది.
నెమలి: నాగకన్యతో కలిసిన మానవుడు ప్రాణాలతో ఉండడు కదా స్వామి. అప్పుడు మోక్ష సంగతి ఏంటి స్వామి
సుబ్బు: ఆ సంగతి మోక్షకు కూడా తెలుసు.
నెమలి: అక్కడే స్వామి నాకు అర్థం కావడం లేదు. తాను చనిపోతాను అని తెలిసినా తండ్రి అవుతానని చెప్పడం. పండంటి బిడ్డను కంటాను అని చెప్పి బామ్మకు ఆశ పెట్టడం ఏంటి స్వామి. ప్రాణాల మీద ఆశలేని వారు ఎక్కడైనా ఉంటారా స్వామి.
సుబ్బు: భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి పంచమి తన ప్రాణాలు పణంగా పెట్టడం అలాంటి త్యాగమే కదా
నెమలి: ఇందులో కొంత తిరకాసు ఉంది స్వామి. పంచమి తన భర్త కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమైంది. కానీ మోక్ష తండ్రి కావాలన్న ఆశతో తన ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకుంటున్నాడు.
సుబ్బు: మోక్ష ఆశ పిల్లల కోసం కాదు. పంచమిని శాశ్వతంగా ఈ లోకంలో ఉంచేయాలి అని. తను లేకపోయినా తనకు పుట్టిన బిడ్డలో తనని చూసుకుంటూ సంతోషంగా ఉండాలి అని.
నెమలి: మరి మోక్ష కోరిక నెరవేరుతుందా స్వామి
సుబ్బు: పంచమి ఇందుకు ససేమిరా ఒప్పుకోదు. పంచమి మోక్షల ప్రేమ గెలవాలి అంటే విధి ఓడిపోవాల్సిందే. అది ఒక్క ప్రేమకే సాధ్యం. ప్రేమ ప్రాణాలను సైతం నిలబెట్టగలదు. మృత్యువుతో పోరాడి యముడిని ఓడించగలదు. దేవుడినైనా తలవంచిచాల్సిందే. అలాంటి ప్రేమ ఓడిపోయి విధి గెలిస్తే పంచమి, మోక్షల ప్రేమలో ఏదో లోపం ఉన్నట్లే.
నెమలి: సరే స్వామి వెళ్లొస్తాను
మరోవైపు పంచమి వాంతులు చేసుకుంటుంది. అది శబరి చూస్తుంది. ఇక మోక్ష కూడా చూసి నిజంగా పంచమి ప్రెగ్నెంట్ అయితే తనను శబరి ఎలా చూసుకుంటానో అని కలలు కంటాడు.
మోక్ష: (మనసులో) నేను లేకపోయినా పంచమి ఇక్కడే ఉండాలి. పంచమిని శబరి కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది. నేను లేను అనే బాధ పంచమికి ఉండకూడదు. నా బిడ్డలో నన్ను చూసుకుంటూ తనలో నన్ను చూసుకుంటుంది. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకూడదు. పంచమిని ఎలా అయినా ఒప్పించాలి.
పంచమి: (మోక్ష అన్న మాటల్ని తలచుకొని బాధ పడుతుంది) తనలో తాను.. మీరు ఆకాశం నేను భూమి మోక్ష బాబు. చూడటానికి కలిసినట్టే ఉంటాం కానీ ఎప్పటికీ కలలేము. మీకే కాదు మోక్ష బాబు ప్రతి దంపతులు పిల్లలు కావాలి అని కోరుకుంటారు. కానీ మీకు ఆ అదృష్టం లేదు. మనం కలిస్తే మీరు ప్రాణాలతో ఉండరు. ఆ విషయం తెలిస్తే మీరు భరించలేరు. ఇది పరిష్కారం లేని సమస్య మోక్ష బాబు. మీరే అర్థం చేసుకోవాలి నేను చెప్పలేను. మీ ఆశ నిరాశపరచడం నాకు ప్రాణ సంకటంగానే ఉంది. మిమల్ని సంతోష పెడితే నా మెడలో ఈ మాంగల్యం ఉండదు. మీ బిడ్డను మీరే చూసుకోలేరు. ఆ సంతోషం మనకు అవసరం లేదు మోక్షబాబు. నాకు మీరు ప్రాణాలతో కావాలి అంతే మోక్ష బాబు.
ఫణేంద్ర: (పంచమి దగ్గరకు వచ్చి) ఈ పండగలు పెళ్లి రోజులు మానవులకే యువరాణి మనకు కాదు. మోక్ష మన శత్రువు నువ్వు తనేం చెప్పినా వినకు. తనకు ఎన్ని కోరికలు అయినా ఉండొచ్చు. అవి నీకు సంబంధం లేదు. చావు దగ్గర అవుతున్నప్పుడు చావు తెలివి తేటలే వస్తాయి. తన జీవితం ముగిస్తుంది అని తెలిసి పిల్లలు కావాలి అని కోరుకుంటున్నాడు. వచ్చే కార్తీక పౌర్ణమి వరకే మీరిద్దరూ పక్కపక్క ఉంటారు పంచమి. ఆ తర్వాత నువ్వు నువ్వుగా నాతో నాగలోకానికి రావాలి. పిల్లల కోసం మోక్ష ఆశపడితే చావుని ఇంకా ముందు కోరుకోవడమే. దాని వల్లనీకు చాలా సమస్యలు వస్తాయి. నేనుండగా నీకు అలాంటి సమస్యలు రానివ్వను. ఈ మాత్రం తను నీకు దగ్గర అవ్వాలని ప్రయత్నించినా మరుక్షణమే నా గాటు తన ఒంట మీద ఉంటుంది. మోక్షకు మృత్యువు వెన్నంటి ఉన్నట్లే నేను నీ కనుచూపుకు దగ్గరలోనే ఉంటా. నా కన్ను కప్పి ఎలాంటి తప్పు జరగదు. జరగనివ్వను. (ఫణేంద్ర వెళ్లిపోతాడు)
ఫణేంద్ర పాములా వెళ్తూ సుబ్బు దగ్గరకు వస్తాడు. సుబ్బుకి దండం పెడతాడు. తన అదృష్టం వల్ల ప్రత్యక్షంగా చూడగలిగాను అంటాడు. తమరు దర్శనం ఇచ్చారు అంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. ఆజ్ఞాపించండి స్వామి శిరసావహిస్తాను అని ఫ్రణేంద్ర అంటాడు. దానికి సుబ్బు పంచమి నా భక్తురాలు అంటే ఫణేంద్ర తను మా యువరాణి స్వామి అంటాడు. తాను పంచమిని తీసుకెళ్లిపోతానని చెప్తాడు. అయితే పంచమిని భయపెట్టడం తప్పు అని సుబ్బు అంటాడు. తన యువరాణిని ఎలా అయినా తీసుకెళ్లాలి అదే నా కర్తవ్యం అని ఫణేంద్ర అంటారు.
మోక్ష: పంచమి పెళ్లి కూతురు ఏంటి డల్‌గా ఉంది. పెళ్లి కొడుకు నచ్చకపోతే ఇప్పుడే చెప్పేయాలి. పంచమి రేపు మంచి చీర కట్టుకో మంచి ఫొటోలు దిగుదాం. అప్పుడు మన పెళ్లి అవసరం కోసం జరిగింది. రేపు జరగబోయేదే మనకు నిజమైన పెళ్లి. అప్పుడు పెళ్లిలో మనం మనుషులిగా దగ్గరయ్యాం. ఇప్పుడు మనసులు కూడా ఒక్కటయ్యాయి. మన మధ్య బంధం పెరిగింది. రేపటి నుంచి మనం పాలు నీళ్లలా కలిసిపోయి ఒకే కంచం ఒకే మంచం అన్నట్లు ఉంటాం. మనద్దరం ఓ జీవిత కాలం పాఠం నేర్చుకున్నాం. ప్రతీ క్షణం మనకు అమూల్యమే. దుఖించినా.. సంతోషంగా గడిపినా కాలాన్నిమాత్రం ఆపలేం. ఆ పరుగులో ఎవరు ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి. కాలం మాత్రం ప్రయాణిస్తూనే ఉంటుంది.
పంచమి: ఆ ప్రయాణంలో మీ కంటే ముందు నేను ఆగిపోవాలి మోక్ష బాబు
మోక్ష: వెనకోముందో అందరూ ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే. కానీ అంతవరకు అలసిపోకూడదు. ఆడుతూ పాడుతూ ఏ దిగులు చింతా లేక హాయిగా సాగిపోవాలి పంచమి. అదే నేను నేర్చుకున్న పాఠం.
పంచమి: ఆ పాఠం గమ్యం తెలియని జీవితాళ్లకు పనికొస్తుంది. చరమాంక దశలో ఉన్నవాళ్లకి జీవితం అగమ్య గోచరంగా ఉంటుంది.
మోక్ష: మలచుకోవడం మన చేతిలోనే ఉంది పంచమి. నాభర్తకు ఏదీ కాదు నా భర్తను ఏ గండం ఏమీ చేయలేదు అని నువ్వు తలచుకుంటే చాలు మన జీవితంలో వెలుగు వచ్చినట్లే అనిఅనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.