Krishna Mukunda Murari Serial November 21st Episode:


రాత్రంతా మురారి ఆరుబయట కృష్ణ ఒడిలోనే నిద్రపోతాడు. ఉదయం లేచి కృష్ణకు సారీ చెప్తాడు. పర్లేదు అన్న కృష్ణ లోపలికి వెళ్లి ఫ్రెష్ అప్ అయి రమ్మని చెప్తుంది. 
మురారి: మీకో విషయం అడగొచ్చా వేణిగారు
కృష్ణ: ప్రతీసారీ నన్ను పర్మిషన్ అడగొద్దని నిన్నే చెప్పాను కదా
మురారి: నాకు గతం గుర్తు రాకపోతేనే బాగుంది అనిపిస్తోంది. అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు
కృష్ణ: ఏసీపీ సార్ గతంలో నేను లేకపోతే నాకు దూరం కావాల్సివస్తుందని అలా అన్నారా.. భగవంతుడా నేను ఏసీపీ సార్ భార్యనని త్వరలో తెలియజేయు తండ్రీ
భవాని: (ముకుంద కాఫీ తీసుకొచ్చి ఇస్తే) ఏంటి అలా డల్‌గా ఉన్నావ్.. నిన్న నైట్ మురారి మనల్ని అడిగిన ప్రశ్నలు కృష్ణను ఎందుకు అడగలేదు.
ముకుంద: అదే నాకు అర్థం కావడం లేదు. కృష్ణని చూడగానే అంత కూల్‌గా ఉన్నాడు. ఏదీ జరగనట్టే ప్రవర్తించాడు. వాళ్లిద్దరినీ ఇలా చూస్తుంటే చాలా ప్రమాదం అనిపిస్తుంది.
భవాని: దీనంతటికీ కారణం ఆ కృష్ణ. తను తనకు ఫేవర్‌గా చెప్తోంది. అప్పటికీ రూమ్‌లోకి వెళ్లే ముందు చెప్పాను అంతా నిజమే చెప్పాలి అని అయినా తను ఏం చెప్పలేదు అంటే తనను ఏమనాలి
ముకుంద: మురారి అడిగుంటే చెప్పేది ఏమో అయినా తనకు ఫేవర్ కానిది ఎందుకు చెప్తుంది అత్తయ్య. తను మురారికి దూరంగా ఉండాలి అనుకుంటే అసలు ఇదంతా ఉండదు కదా. కానీ తను దూరంగా ఉండదు.
భవాని: చేయాలి వాళ్లిద్దరినీ దూరం చేయాలి. వీలైనంత త్వరలోనే ఆ పని చేస్తాను.


కృష్ణ: (ముగ్గు వేస్తూ) నైట్ జరిగిన దానికి ఏసీపీ సార్‌కి గతం గుర్తు రావాలే. చెప్పాలి అంటే గతంలో కూడా ఏసీపీ సార్ ఇలా చేయలేదు. పెద్దత్తయ్య ఏసీపీ సార్‌కి నా గురించి ఏం చెప్పుంటుంది. ముకుంద రాత్రి ఎందుకు అంత టెన్షన్‌ పడింది. ఏసీపీ సార్ ఎందుకు రాత్రి నాకు ఏమీ అడగలేదు
మురారి: గుడ్ మార్నింగ్ వేణి గారు. మీరు మళ్లీ ఏంటి వీడు మళ్లీ నా ప్రాణానికి తయారయ్యాడు అనుకుంటున్నావా
కృష్ణ: సార్ ఇంకోసారి అలా మాట్లాడొద్దు నేను బాధపడగాను
మురారి: సారీ అండీ జస్ట్ కిడ్డింగ్
కృష్ణ: కిడ్డింగ్ లేదు బుడ్డింగ్ లేదు ఇంకోసారి మాత్రం అలా అనకండి. మీరంటే నాకు.. 
మురారి: చెప్పండి వేణి గారు నేనంటే మీకు
కృష్ణ: అపారమైన గౌరవం సార్, చెప్పలేనంత అభిమానం 
 
ఇక మురారి, కృష్ణతో కలిసి ముగ్గు వేస్తాడు. దాన్ని ముకుంద చూస్తుంది. మరోవైపు భవాని మురారి గురించి మధుని అడుగుతుంది. ఇంట్లో ఎక్కడా మురారి లేడని చెప్పడంతో మధు, రేవతిలకు చీవాట్లు పెడుతుంది. ఇక మధు రాత్రి తాగి చేసిన పనిని రేవతితో చెప్తుంది. ఇంతలో మురారి వస్తాడు. ఇక ఇందుకు పరిష్కారంగా భవాని మురారిని ముకుందతో కలిసి అమెరికా పంపిస్తాను అంటుంది. 


కృష్ణ: (తులసి కోట దగ్గర) అమ్మా తులసమ్మ నీకు జరుగుతున్నది తెలుసు జరగబోయేది తెలుసు కానీ నీతో పాటు నాకు కూడా జరగబోయేది తెలిసేలా చేస్తున్నావ్ చూడు దానికి నేను జన్మంతం రుణపడి ఉంటాను తల్లీ. ఏసీపీ సార్‌ నాకు దగ్గరయ్యేలా చేస్తున్నావ్. ఇన్ని రోజులు నేను అమెరికా ప్రయాణం గురించి బయపడ్డాను ఎన్నో నిద్ర లేని రాత్రలు గడిపాను. ఆ ముకుంద ఏసీపీ సార్‌ని తిరిగి రానివ్వదేమో అని బయపడ్డాను కానీ నువ్వు అంతా తీర్చేశావ్ తల్లి. ఎప్పటికీ నీకు రుణ పడి ఉంటాను. 
ముకుంద: (చేతిలో కవర్‌తో అక్కడికి వస్తుంది) బాగా టెన్షన్ పడుతున్నావ్ కదా.. అందుకే టెన్షన్ నుంచి బయట పడటానికి తులసమ్మను వేడుకుంటున్నావా. కృష్ణ ఈ కవర్ ఏంటో తెలుసా బంగారం. ఇక నీ ఆసలన్నీ అడియాశలు చేసే కవర్ ఇది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే నా మురారి నీకు కనిపిస్తాడు. దీనికే ఇలా అయిపోయావు ఇంకా పూర్తిగా విషయం తెలిస్తే ఇంకా ఎలా అయిపోతావో. ఏముందిలే అని ఊరెళ్లిపోతావు. ఇంకా నిన్ను టెన్షన్‌ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఈ కవర్ ఏంటో తెలుసా నా మురారి నేను అమెరికా వెళ్లడానికి టికెట్స్. శుక్రవారమే ప్రయాణం. 
కృష్ణ: నిజమా ఒక్కసారి చూడొచ్చా. శుక్రవారం రాత్రి 11 గంటలకు.. శుక్రవారం దాకా ఎందుకు ఇప్పుడే వెళ్లిపోవచ్చుగా. వెళ్లి పెద్దత్తయ్య గారికి రిపోర్ట్ చేయ్. నేనిచ్చిన షాక్‌కు గిలగిలా కొట్టుకుంటుంది.
మురారి: వేణి గారు. అమెరికా ప్రయాణం నాకు వెళ్లాలి అని లేదు. ఎందుకో దిగులుగా అనిపిస్తుంది. ఒంటరిగా వెళ్లాలి అంటే దిగులుగా ఉంది. మీరు కంపెనీ ఇస్తారా
కృష్ణ: థ్యాంక్యూ సార్ కానీ మీరు వెళ్లాలి. మీరు ఎలా ఫీలవుతున్నారో నేను అలాగే ఫీలవుతున్నాను. కానీ నేను మిమల్ని ఎందుకు వెళ్లమంటున్నాను తెలుసా. మీ మదిలో ఉన్న ఎన్నో ప్రశ్నలకు అక్కడ సమాధానం దొరుకుతుంది అనిపిస్తుంది. చూడండి సార్ మనం ఏ పని చేయడానికి జంకుతామో, ధైర్యం చేసి ఆ పని చేస్తే ఆ కిక్‌యే వేరు
మురారి: వెళ్లమంటారా 
కృష్ణ: వెళ్లండి సార్ ప్లీజ్
మురారి : సరే మీ మాట కాదనలేక వెళ్తున్నా
కృష్ణ: ఏంటీ నాకు గతం గుర్తొస్తుంది అని వేణి ఇన్‌డైరెక్ట్‌గా చెప్తుంది అని ఎందుకు అనుకోవడం లేదు. నన్ను ఇంతగా ఇష్టపడుతున్నాగానీ ఏసీపీ సార్‌కి గతం ఎందుకు గుర్తు రావడం లేదు. 
భవాని: (ముకుంద జరిగింది చెప్తే)అవునా కృష్ణ ఎందుకు అలా అడిగిందో నేను తెలుసుకుంటా నువ్వు వెళ్లు.. రేవతి ఆ కృష్ణ మళ్లీ కొత్త నాటకాలకు తెరతీసింది అంట.. మొన్నటి దాకా ముకుందతో మురారి అమెరికా వెళ్తాడు అంటే తెగ టెన్షన్ పడింది. ఇప్పుడు శుక్రవారం దాకా ఎందుకు మీ అత్తయ్యతో చెప్పి రేపోమాపో వెళ్లడానికి టికెట్స్ బుక్ చేయించు అని చెప్పింది అంట. అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.