Stock Market Today, 18 March 2024: వడ్డీ రేట్ల విషయంలో.. అమెరికా, జపాన్ సహా కీలక సెంట్రల్ బ్యాంక్‌ నిర్ణయాలు ఈ వారంలో వెలువడతాయి. పెట్టుబడిదార్లు ఆ బ్యాంక్‌ల నిర్ణయాలను గమనిస్తారు కాబట్టి ఈ వారం మార్కెట్లు ఒడిదొడుకులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ‍‌(సోమవారం), ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్‌ సూచీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొనవచ్చు.


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 51 పాయింట్లు లేదా 0.23 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,065 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
గ్లోబల్ సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. నికాయ్‌ ఏకంగా 2 శాతం పెరిగింది. కోస్పి 0.5 శాతం పైకి చేరింది. హాంగ్ సెంగ్, ASX 200 0.3 శాతం వరకు పడిపోయాయి.


శుక్రవారం, అమెరికాలో, డౌ జోన్స్‌, S&P 500 వరుసగా 0.49 శాతం, 0.65 శాతం క్షీణించాయి. నాస్ డాక్ 0.96 శాతం నష్టపోయింది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


అదానీ గ్రూప్: గ్రీన్ & రెన్యువబుల్‌ ఎనర్జీ వ్యాపారాల కోసం FY25లో రూ. 1.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతుందని పీటీఐ రిపోర్ట్ చేసింది. దీంతోపాటు, అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ & అతని కంపెనీ లంచాలు ఇచ్చిందా అన్న కోణంలో అమెరికా దర్యాప్తు విస్తృతమైందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది.


హిందుస్థాన్ ఏరోనాటిక్స్: భారత నౌకాదళం కోసం 25 డోర్నియర్ విమానాలు, వివిధ పరికరాలను అప్‌గ్రేడ్ చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖతో రూ. 2,890 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.


లుపిన్: ఈ నెల 6 నుంచి 15 వరకు, ఔరంగాబాద్‌లోని తయారీ కేంద్రంలో US FDA తనిఖీలు నిర్వహించింది. US FDA ఒక పరిశీలనతో ఫారం 483 జారీ చేసిందని లుపిన్‌ వెల్లడించింది.


టొరెంట్ పవర్: రూ. 3.65/kWh టారిఫ్‌తో 300 మెగావాట్ల విండ్ & సోలార్ హైబ్రిడ్ ప్రాజెక్ట్ కోసం 'లెటర్ ఆఫ్ అవార్డు'ను అందుకుంది. ఈ కాంట్రాక్ట్ కాల వ్యవధి 25 సంవత్సరాలు.


జిందాల్ స్టెయిన్‌లెస్: దేశంలోనే మొదటిసారిగా, కోల్‌కతాలో నీటి అడుగున నిర్మించిన మెట్రో లైన్ కోసం స్టెయిన్‌లెస్ స్టీల్‌ సరఫరా చేసినట్లు ఈ కంపెనీ తెలిపింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.4,965 కోట్లు.


LIC: తన ఉద్యోగులకు 17 శాతం వేతన పెంపును ప్రకటించింది. ఇది ఆగస్టు 1, 2022 నుంచి అమలులోకి వస్తుంది.


KPI గ్రీన్: మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కో నుంచి 100 MWA సౌర విద్యుత్ ప్రాజెక్ట్ కోసం విజయవంతమైన బిడ్డర్‌గా నిలిచింది.


జైడస్‌ లైఫ్‌: ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా చికిత్సకు ఉపయోగించే ఫినాస్టరైడ్, తడలఫిల్ క్యాప్ క్యాప్సూల్స్‌ కోసం US FDA తుది ఆమోదం లభించింది.


డ్రోన్‌ ఆచార్య: జమ్ము&కశ్మీర్‌లోని ఇండియన్ ఆర్మీ డ్రోన్ ల్యాబ్‌కు ఐటీ హార్డ్‌వేర్‌ సరఫరా చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవే