Puttaparthi Man Half head shaved: పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం తెలిసిందే. పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దిద్దె కుంట శ్రీధర్ రెడ్డికి జగన్ టికెట్ ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అనుచరులు, పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి వైపీపీ అధినేత జగన్ మరోసారి టికెట్ కేటాయించినందుకు ఒక వ్యక్తి నిరసనగా పుట్టపర్తి పట్టణంలోని సత్యమ్మ దేవాలయం ఎదురుగా అరగుండు, అర మీసం చేయించుకుని  నిరసన తెలిపాడు. ఈ విషయం ఇది సత్యసాయి జిల్లా (Sri Satya Sai district) వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 


ఈ ఒక్క సీటు నష్టంలేదని వ్యాఖ్యలు


సజ్జల మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు ఎమ్మెల్యే దిద్దె కుంట శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో పనిచేసేవాడు. గత కొంతకాలం నుంచి ఎమ్మెల్యేపైన అసహనంతో సజ్జల మహేశ్వర్ రెడ్డి ఆయనకు దూరం ఉంటూ వస్తున్నాడు. గతంలో శ్రీధర్ రెడ్డికి వైసీపీ టికెట్ కేటాయిస్తే అరగుండు ఆరమిసం తీపించుకుంటానని చాలెంజ్ చేశాడు. అందుకనే శ్రీధర్ రెడ్డికి టికెట్ ఇచ్చిన వెంటనే మాట ప్రకారం అరగుండు అరమిసం తీపించుకున్నానని సజ్జల మహేశ్వర్ రెడ్డి తెలిపాడు. పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచించాలని, మరోసారి దుద్దేకుంట శ్రీధర్ రెడ్డికి ఓట్లు వేస్తే పుట్టపర్తి నియోజకవర్గం అదోగతిపాలు అవుతుందని హెచ్చరించాడు. కచ్చితంగా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుంది కానీ 175 సీట్లలో ఒక సీటు పోతే ఏమీ కాదని, 174 సీట్లు వస్తాయన్నాడు. కనుక  వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు కూడా దీని గురించి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలన్నారు. దిద్దే కుంట శ్రీధర్ రెడ్డిని కచ్చితంగా ఓడిస్తామని అతను తనకు తీవ్ర అన్యాయం చేశాడని 23 ఏళ్లుగా తనతో పని చేయించుకున్నప్పటికీ, తనకు తీరని అన్యాయం చేశాడని సజ్జల మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.