Stock Market Today, 11 December 2023: గత వారంలో రికార్డ్‌ స్థాయులను నమోదు చేసిన ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ & నిఫ్టీ, ఈ రోజు (సోమవారం, 11 డిసెంబర్‌ 2023) మందకొడిగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టీ గత సెషన్‌లో మొదటిసారి 21,000 మార్క్‌ను దాటింది.


అమెరికన్‌ మార్కెట్స్‌లో మిక్స్‌డ్‌ రిజల్ట్స్‌
శుక్రవారం సెషన్‌లో... డో జోన్‌, S&P 500 వరుసగా 0.36 శాతం, 0.41 శాతం లాభపడగా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.45 శాతం నష్టపోయింది.


పడిపోయిన ఆసియా మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో...  CSI 300 1.3 శాతం, హాంగ్ సెంగ్ 0.9 శాతం పడిపోయాయి. ప్రతి ద్రవ్యోల్బణ ఒత్తిడితో, చైనాలో ప్రధాన ద్రవ్యోల్బణం 3 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగంగా పడిపోయింది. జపాన్ నికాయ్‌ 1.7 శాతం లాభపడింది. ఆస్ట్రేలియా S&P/ASX 200, దక్షిణ కొరియాలో కోప్సీ 0.2 శాతం వరకు పెరిగాయి.


ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 05 పాయింట్లు లేదా 0.02% రెడ్‌ కలర్‌లో 21,072 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


టాటా మోటార్స్: 2024 జనవరి నుంచి తన మొత్తం కమర్షియల్‌ వెహికల్స్‌ ధరలను 3 శాతం వరకు పెంచుతామని వాహన తయారీ కంపెనీ తెలిపింది. పెట్టుబడి వ్యయాల పెరుగుదలను భర్తీ చేసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. 


మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్: 19 విభాగాల్లో సుమారు 44.4 కి.మీ. సబ్‌సీ పైప్‌లైన్‌లను వేయడానికి ONGC నుంచి ఈ కంపెనీ రూ.1,145 కోట్ల విలువైన ఆర్డర్‌ అందుకుంది.


రామ్‌కో సిమెంట్స్‌: కొలిమిగుండ్ల క్లింకర్‌ ప్లాంట్‌ సామర్థ్యాన్ని 2.5 MTPA నుంచి 3.15 MTPA కి పెంచుకుంది.


REC: జర్మన్ బ్యాంక్ KfWతో REC 200 మిలియన్ యూరోల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ రీవ్యాంప్‌డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీమ్‌కు (RDSS) అనుగుణంగా, డిస్కమ్‌ల మౌలిక సదుపాయాలు పెంచడానికి ఈ డబ్బును లోన్స్‌గా ఇస్తుంది.


బ్లూ డార్ట్ ఎక్స్‌ప్రెస్: కంపెనీ పూర్తి అనుబంధ సంస్థ అయిన బ్లూ డార్ట్ ఏవియేషన్ లీజుకు తీసుకున్న రెండు విమానాలను DHL ఏవియేషన్ (నెదర్లాండ్స్) నుంచి రూ.40 కోట్లకు కొనుగోలు చేసేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


లాయిడ్స్ మెటల్స్: ఇనుప ఖనిజం మైనింగ్ కెపాసిటీని ఏడాదికి 55 మిలియన్ టన్నుల వరకు పెంచుకోవడం కోసం... సంవత్సరానికి 45 మిలియన్ టన్నుల బ్యాండెడ్ హెమటైట్ క్వార్ట్‌జైట్ (BHQ) బెనిఫికేషన్ ప్లాంట్‌ను గడ్చిరోలి జిల్లాలో ఏర్పాటు చేయడానికి డైరెక్టర్ల బోర్డు నుంచి ఆమోదం లభించింది.


సిప్లా: ఈ ఫార్మా సంస్థ అనుబంధ కంపెనీ అయిన ఇన్‌వాజెన్ ఫార్మాస్యూటికల్స్, ఓరల్ సొల్యూషన్ విగాబాట్రిన్‌ను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తోంది. విగాబాట్రిన్‌లో సీల్ సంబంధిత సమస్యలు ఉన్నాయి.


లిండే ఇండియా: ఆసియా ఇండెక్స్, తన S&P BSE ఆయిల్ & గ్యాస్ ఇండెక్స్‌లోకి లిండే ఇండియా స్థానంలోకి గుజరాత్ గ్యాస్‌ చేరుతుందని నేషనల్‌ మీడియా రిపోర్ట్‌ చేసింది. డిసెంబర్ 18 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.


సండూర్ మాంగనీస్ & ఐరన్ ఓర్స్: సండూర్ మాంగనీస్ & ఐరన్ ఓర్స్‌ను, డిసెంబర్ 18 నుంచి, BSE ఎనర్జీ ఇండెక్స్‌లో చేర్చాలని ఆసియా ఇండెక్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.


PSP ప్రాజెక్ట్‌లు: గుజరాత్‌లో రూ.101.67 కోట్ల కాంట్రాక్టును పొందినట్లు ఈ కంపెనీ వెల్లడించింది.


దర్శన్ ఓర్నా: రైట్స్‌ ఇష్యూను ఆమోదించడానికి ఈ కంపెనీ బోర్డు ఈ నెల 15న సమావేశం అవుతుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: అమాంతం పెరిగిన టాప్-7 కంపెనీల మార్కెట్ విలువ, నం.1 ర్యాంక్‌లో రిలయన్స్