Stock Market Today, 09 January 2024: విదేశీ స్టాక్‌ మార్కెట్ల నుంచి బలమైన సంకేతాలు రావడంతో, ఇండియన్‌ మార్కెట్లు ఈ రోజు (మంగళవారం) మంచి పొజిషన్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.


ఈ రోజు ఆసియా మార్కెట్లలో బుల్స్‌ జోరు కనిపించింది. జపాన్‌కు చెందిన నికాయ్‌ 1.5 శాతానికి పైగా పెరిగింది. కోస్పి, తైవాన్ 0.5 శాతం చొప్పున పెరిగాయి. S&P/ASX 200 1 శాతం లాభపడింది. నిన్న, టెక్ షేర్ల ర్యాలీతో US మార్కెట్ స్ట్రాంగ్‌ గెయిన్స్‌తో ముగిసింది. నాస్‌డాక్ 2.2 శాతం, S&P 500 1.4 శాతం, డౌ జోన్స్ 0.6 శాతం పెరిగాయి. 


ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 03 పాయింట్లు లేదా 0.02% గ్రీన్‌ కలర్‌లో 21,705 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు గ్యాప్‌ అప్‌ అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


బజాజ్ ఆటో: ఈ వెహికల్‌ కంపెనీ ఒక్కో షేరుకు రూ.10,000 చొప్పున 40,00,000 షేర్ల వరకు రూ.4000 కోట్ల షేర్ల బైబ్యాక్‌ ప్రకటించింది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: సోనీ గ్రూప్, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో విలీన ఒప్పందం నుంచి వైదొలగాలని యోచిస్తోందని బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్‌ చేసింది.


టాటా మోటార్స్: డిసెంబరు త్రైమాసికంలో, అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) హోల్‌సేల్స్‌ 27 శాతం YoY పెరిగి, 1,01,043 యూనిట్లకు చేరాయి. గత 11 త్రైమాసికాల్లో ఇదే అత్యధిక హోల్‌సేల్‌ నంబర్‌.


అరబిందో ఫార్మా: 2023 సెప్టెంబర్ 22-29 తేదీల్లో తెలంగాణలోని చిట్కుల్‌లో ఉన్న కంపెనీ యూనిట్‌ను తనిఖీ చేసిన US FDA, తన తనిఖీ నివేదికలో 'వాలంటరీ యాక్షన్ ఇండికేట్' ఇచ్చింది.


మెట్రోపొలిస్ హెల్త్‌కేర్: Q3లో, కోర్‌ బిజినెస్‌ ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించామని, సంవత్సరానికి 12 శాతం పెరుగుదల కనిపించిందని ఈ హాస్పిటల్ చైన్ తెలిపింది. 9 శాతం వాల్యూమ్ వృద్ధి వల్ల ఆదాయ వృద్ధి సాధ్యమైంది. B2C ఆదాయాలు సంవత్సరానికి 14 శాతం పెరిగాయని అప్‌డేట్‌ చేసింది.


ఫినో పేమెంట్స్ బ్యాంక్: లైసెన్సింగ్ నిబంధనల ప్రకారం, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్స్ కోసం RBIకి దరఖాస్తు చేసింది.


ఐషర్ మోటార్స్: ఈ కంపెనీ యూనిట్ అయిన రాయల్ ఎన్‌ఫీల్డ్, తమిళనాడులో ఎనిమిదేళ్ల పాటు రూ.3,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది, కొత్త వాహనాల అభివృద్ధికి వాటిని కేటాయించింది.


అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఈ కంపెనీ స్టెప్-డౌన్ అనుబంధ సంస్థ, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (MIAL), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాపై ఆర్బిట్రేషన్ కేసును గెలుచుకుంది. దీనివల్ల, 2020 మార్చి 13 - 2022 ఫిబ్రవరి 28  మధ్య కాలంలో నెలవారీ వార్షిక రుసుము చెల్లింపుల నుంచి మినహాయింపు లభించింది.


సిప్లా: సిప్లా (EU) లిమిటెడ్, యుఎస్‌లో జాయింట్ వెంచర్‌ స్థాపించడానికి విలీనం కెమ్‌వెల్ బయోఫార్మా, మణిపాల్ ఎడ్యుకేషన్ & మెడికల్ గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.