Stock Market Today, 01 April 2024: FY24లో నక్షత్ర స్థాయి ర్యాలీ చేసిన ఇండియన్‌ ఈక్విటీ బెంచ్‌మార్క్ సూచీలు, ఈ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని సానుకూలంగా ప్రారంభించే అవకాశం ఉంది.


ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01 శాతం గ్రీన్‌ కలర్‌లో 22,526 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో.. ఈ ఉదయం ఆస్ట్రేలియా & హాంకాంగ్ బెంచ్‌మార్క్‌లు దాదాపు 1 శాతం లాభాల్లో ఉన్నాయి, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్ 0.7 శాతం లాభంతో, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి 0.4 శాతం బలంతో కనిపించాయి. జపాన్‌కు చెందిన నికాయ్‌ 0.6 శాతం క్షీణించింది. సెప్టెంబర్‌ తర్వాత తొలిసారిగా ఈ ఏడాది మార్చిలో చైనా తన తయారీ కార్యకలాపాలు పెరగడంతో ఆసియా స్టాక్స్‌ సానుకూలంగా ట్రేడ్ అవుతున్నాయి.


అమెరికన్‌ మార్కెట్లలో, శుక్రవారం, డౌ జోన్స్‌, నాస్‌డాక్ ఫ్యూచర్స్ 100 పాయింట్లకు పైగా పెరిగాయి. యూఎస్‌లో 'వ్యక్తిగత వినియోగ వ్యయాల' (PCE) సూచీ నెలలో (MoM) 0.3 శాతం పెరిగింది. ఈ రోజు రాత్రి US మార్కెట్ ఈ గణాంకాలపై ప్రతిస్పందిస్తుంది, 


అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ స్వల్పంగా పెరిగి 4.20 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ భారీగా పెరిగాయి, బ్యారెల్‌కు $87 పైన ట్రేడవుతున్నాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 


ఆటో స్టాక్స్‌: మారుతి సుజుకి ఇండియా, బజాజ్ ఆటో, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, M&M, ఎస్కార్ట్స్ కుబోటా, అశోక్ లేలాండ్ వంటి ఆటోమొబైల్ కంపెనీలు మార్చి నెల అమ్మకాలను ఈ రోజు రిపోర్ట్ చేస్తాయి.


NTPC: ఈ విద్యుత్ దిగ్గజం 220 మెగావాట్ల బరౌనీ థర్మల్ పవర్ స్టేషన్ స్టేజ్-1ను మార్చి 31, 2024 నుంచి శాశ్వతంగా మాసేసింది.


HDFC బ్యాంక్: HDFC ఎడ్యుకేషన్ &డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో తన మొత్తం వాటాను విక్రయించడానికి కచ్చితమైన ఒప్పందం చేసుకుంది.


జొమాటో: కర్ణాటక అధికార్ల నుంచి రూ. 23.26 కోట్ల విలువైన టాక్స్‌ డిమాండ్ నోటీస్‌, పెనాల్టీని ఎదుర్కొంది. అయితే, దీనిపై అప్పీల్‌ చేస్తామని జొమాటో ప్రకటించింది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: ఖర్చులను తగ్గించుకోవడానికి బెంగళూరులోని టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌లో ఉద్యోగులను సగానికి సగం తగ్గించింది.


NHPC: భారతదేశవ్యాప్తంగా పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటు కోసం జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (JBIC) నుంచి 20 బిలియన్ల (సుమారు రూ. 1,100 కోట్లు) విదేశీ రుణాన్ని పొందింది.


ఇన్ఫోసిస్: ఆదాయపు పన్ను విభాగం నుంచి రూ. 6,329 కోట్ల రిఫండ్‌ వస్తుందని ఆశిస్తోంది.


గ్లోబస్ స్పిరిట్స్: జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో ఉన్న రెండు యూనిట్లలో అదనపు సామర్థ్యంతో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది.


వెరాండా లెర్నింగ్: తన అనుబంధ సంస్థ వెరాండా XL లెర్నింగ్ సొల్యూషన్స్ ద్వారా తపస్య విద్యాసంస్థల్లో (TEIPL) 50 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ. 240 కోట్లు.


గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్: FY24 సమయంలో ఈ కంపెనీ రూ. 3,400 కోట్లకు పైగా టర్నోవర్‌ నమోదు చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి ఇదే అత్యధిక వార్షిక టర్నోవర్‌. 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఈ రోజు నుంచి మన జీవితాల్లో మార్పులు, అన్నీ డబ్బుతో ముడిపడినవే!