IPL 2024 DC vs CSK Delhi Capitals Won By 20 Runs: ఐపీఎల్ లో చెన్నై కి తొలి ఓటమి ఎదురైంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో చెన్నై పోరాడి ఓడింది. పంత్ అర్ధ శతకంతో మెరిసిన వేళ ఢిల్లీ ఈ ఐపీఎల్ లో తొలి విజయం సాధించింది. తొలుత బాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో  191 పరుగుల భారీ స్కోర్ చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 171 పరుగులే చేసింది. దీంతోచెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధోని మెరుపు ఇన్నింగ్స్ తో అలరించాడు. 16 బంతుల్లో  37 పరుగులు చేసాడు. ధోని ఇన్నింగ్స్ లో 3 సిక్సలు.... 4 ఫోర్లు ఉన్నాయి.


 మెరిసిన పంత్‌ , అదిరిన ఆరంభం 
 టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్లు పృథ్వీ షా, వార్నర్ తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 90 పరుగులు జోడించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడిన ఈ ఇద్దరు బ్యాటర్లు... ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. దీపక్ చాహర్ వేసిన తొలి ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి. తుషార్ దేశ్‌పాండే రెండో ఓవర్‌లో షా రెండు సిక్సర్లు కొట్టాడు.  డేవిడ్ వార్నర్‌ దూకుడుగా ఆడాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో మూడో బంతికి సిక్స్ బాదిన అతడు.. తర్వాతి రెండు బంతులను బౌండరీకి పంపాడు. ముస్తాఫిజుర్ రెహ్మన్ వేసిన ఆరో ఓవర్‌లో పృథ్వీ షా హ్యాట్రిక్ ఫోర్లు బాదేశాడు. ఇదే ఓవర్‌లో వార్నర్‌ కూడా ఓ బౌండరీ రాబట్టడంతో మొత్తం 20 పరుగులు వచ్చాయి.


పవర్‌ ప్లే ముగిసేసరికి దిల్లీ 62/0 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉంది. డేవిడ్ వార్నర్ 32 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. 9 ఓవర్లకు స్కోరు 91 పరుగులకు చేరింది. డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 52 పరుగులు చేసి అవుటయ్యాడు. ముస్తాఫిజుర్‌ వేసిన ఓవర్‌లో మూడో బంతికి వార్నర్‌ రివర్స్‌ స్కూప్‌ షాట్‌ ఆడగా పతిరన గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ పట్టాడు. కాసేపటికే ఢిల్లీ మరో వికెట్ కోల్పోయింది. 27 బంతుల్లో 43 పరుగులు చేసిన పృథ్వీ షా ఔటయ్యాడు. జడేజా  ఓవర్‌లో  ధోనీకి క్యాచ్‌ ఇచ్చి షా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ పట్టడం ద్వారా ధోనీ టీ20ల్లో 300 డిస్మిసల్స్‌ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మతిశా పతిరన ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు.  15 ఓవర్‌లో నాలుగో బంతికి మిచెల్ మార్ష్‌ (18), చివరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్‌ (0) ఔట్‌ చేశాడు . రిషభ్‌ పంత్ ఫామ్‌లోకి రావడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో పంత్‌ 51 పరుగులు చేసి ఔటయ్యాడు. పతిరన వేసిన 19 ఓవర్‌లో వరుసగా 6,4,4 బాది 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్న పంత్.. తర్వాతి బంతికే రుతురాజ్‌ గైక్వాడ్‌కు చిక్కాడు. పృథ్వీ షా, వార్నర్, పంత్‌ మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ అయిదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 171 పరుగులే చేసింది. దీంతోచెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.  మొత్తానికి ఢిల్లీ జట్టు ఎట్టకేలకు ఖాతా తెరిచింది.