IPL 2024 Dc Vs CSK Delhi Capitals chose to bat :  విశాఖ  వేదికగా ఢిల్లీ, చెన్నై మధ్య ఐపీఎల్‌ మ్యాచ్‌ కు సర్వం సిద్ధం అయ్యింది .టాస్‌ గెలిచిన ఢిల్లీ  కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో ఉన్న రుతురాజ్‌ సేన ఆఖరి నుంచి రెండో స్థానంలో ఉన్న పంత్‌ టీమ్‌ మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి ఐదు మ్యాచుల్లో 4 - 1తో ఇప్పటివరకు చెన్నైదే ఆధిపత్యం. 


ఐపీఎల్‌(IPL)లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై(CSK) మరో సమరానికి సిద్ధమైంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న చెన్నై... రిషభ్‌ పంత్‌ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)తో అమీతుమీ తేల్చుకోనుంది.   రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఢిల్లీ... గెలుపు బాటలో ఉన్న చెన్నైని ఎలా అడ్డుకోగలదా అన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అయితే పృథ్వీ షా మళ్లీ జట్టులో చేరనుండడం ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌ను మరింత పటిష్టం చేయనుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో ఆడిన గత నాలుగు మ్యాచుల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓడిపోవడం వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తోంది.


చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది. చెన్నై విషయానికి వస్తే రచిన్‌ రవీంద్ర, రహానే, రుతురాజ్‌, ధోనీ, రవీంద్ర జడేజాలతో కూడా చెన్నై బ్యాటింగ్‌ లైనప్‌ పటిష్టంగా ఉంది. ధోనీ మార్గనిర్దేశనం చెన్నైకి బాగా కలిసి వస్తోంది. ముస్తాఫిజుర్ బౌలింగ్‌ చెన్నైకు ప్రధాన బలం.


హెడ్ టు హెడ్ రికార్డ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఇప్పటివరకూ మొత్తం 29 మ్యాచులు జరిగాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్... చెన్నైపై పదిసార్లు గెలిచింది.  గత అయిదు మ్యాచుల్లో చెన్నైపై ఢిల్లీ కేవలం ఒకే విజయం సాధించగా.. చెన్నై నాలుగు సార్లు విజయం సాధించింది.  చెన్నైతో జరిగిన గత మూడు మ్యాచుల్లోనూ ఢిల్లీ ఘోరంగా ఓడిపోయింది. 91, 27, 77 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ చెత్త రికార్డును చెరిపేసుకోవాలని ఢిల్లీ పట్టుదలతో ఉంది.


చెన్నై: ధోని, మొయిన్ అలీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్‍(కెప్టెన్‌), రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, అజింక్యా రహానే,  షేక్ రషీద్, మిచెల్ శాంట్నర్‌, సిమర్జిత్‌ సింగ్‌, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావు అరవెల్లి. 


ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్ (కెప్టెన్‌), డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, యశ్ ధుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, అన్రిచ్ నోర్ట్జే, కుల్దీప్ యాదవ్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్ ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ట్రిస్టన్ స్టబ్స్, రికీ భుయ్, కుమార్ కుషాగ్రా, రసిఖ్ దార్, ఝే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, స్వస్తిక్ చికారా, షాయ్ హోప్.