Stock Market Today, 31 October 2023: ఇండియన్ ఈక్విటీల్లో సోమవారం కొంత కొనుగోలు ఆసక్తి కనబడింది. కార్పొరేట్ ఆదాయాలు బాగుంటాయని, US ఫెడ్ వడ్డీ రేటును పెంచకుండా యథాతథంగా కొనసాగించవచ్చన్న ఆశలు US మార్కెట్‌లో కనిపిస్తున్నాయి.
US స్టాక్స్ అప్
వాల్ స్ట్రీట్ సోమవారం ర్యాలీ చేసింది. భారీ ఆదాయాల డాకెట్, ఆర్థిక డేటా, ఫెడరల్ రిజర్వ్ రెండు-రోజుల ద్రవ్య విధాన సమావేశం నేపథ్యంలో అమెరికన్ ఈక్విటీలు పెరిగాయి.
ఆసియా షేర్లు మిశ్రమం
జపనీస్ స్టాక్స్ మిశ్రమంగా ఉన్నాయి. టోపిక్స్ ఇండెక్స్ లాభాలను నమోదు చేయగా, నిక్కీ 225 దిగువన ఉంది. US ఈక్విటీ కాంట్రాక్ట్స్ పడిపోయాయి.
ఈ రోజు ఉదయం 8.15 గంటల సమయానికి గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 10 పాయింట్లు లేదా 0.05 శాతం రెడ్ కలర్‌లో 19,215 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: భారతి ఎయిర్‌టెల్, L&T, టాటా కన్స్యూమర్, అదానీ గ్యాస్. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
TVS మోటార్: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో TVS మోటార్ నికర లాభం 32% పెరిగి రూ.536 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 13% పెరిగి రూ.8,145 కోట్లకు చేరుకుంది.
DLF: రియల్టీ మేజర్ DLF లిమిటెడ్ నెట్ ప్రాఫిట్ జులై-సెప్టెంబర్ కాలంలో ఏడాది ప్రాతిపదికన (YoY) 31% పెరిగి రూ.623 కోట్లుగా నమోదైంది.
మారికో: కన్సూమర్ గూడ్స్ కంపెనీ మారికో లిమిటెడ్, 2023-24 సెకండ్ క్వార్టర్‌లో రూ.353 కోట్ల లాభాన్ని మిగుల్చుకుంది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 17% వృద్ధి.
టాటా మోటార్స్: ప్రస్తుతం పని చేయని సింగూర్ ప్లాంట్‌లో తమ పెట్టుబడికి పరిహారంగా, టాటా మోటార్స్ 766 కోట్ల రూపాయల మధ్యవర్తిత్వ అవార్డును (కోర్టు తీర్పు) పొందింది.
DCM శ్రీరామ్: సెప్టెంబర్ క్వార్టర్‌లో డీసీఎం శ్రీరామ్ రూ.75 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.2,708 కోట్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది.
కోల్గేట్: 2021-22 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించి, ఇన్‌కమ్ ట్యాక్స్ అథారిటీ నుంచి ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ ఆర్డర్‌ను ఈ కంపెనీ అందుకుంది.
GMR ఎయిర్‌పోర్ట్స్: రెండో త్రైమాసికంలో GMR ఎయిర్‌పోర్ట్స్ రూ.190 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయగా, కార్యకలాపాల ద్వారా రూ.2,063 కోట్ల ఆదాయం వచ్చింది.
APL అపోలో ట్యూబ్స్: సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ రూ.203 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ.4,630 కోట్ల ఆదాయం సంపాదించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, రేటే సగానికి పడిపోయింది
Join Us on Telegram: https://t.me/abpdesamofficial