అక్టోబరు 31 రాశిఫలాలు


మేష రాశి 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతారు. ఏదైనా సమస్యపై మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే అది పరిష్కారమవుతుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. పనుల జాబితా ముందే రూపొందించుకుని ముందుకు సాగితే అది మీకు మంచిది.


వృషభ రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు. మీ ఆలోచనలు చాలా సున్నితంగా ఉంటాయి. చట్టపరమైన విషయాల్లో గెలుపు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలుంటే అవి పరిష్కారం అవుతాయి. వ్యాపారులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. చేసే పనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలి. 


మిథున రాశి
ఈ రోజు మీరు పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు ఉపందుకుంటాయి. విదేశాల్లో నివశించేవారినుంచి గుడ్ న్యూస్ లింటారు. మీరు మీ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. ఖాళీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. గ్రూప్ ని ఫామ్ చేయడంలో మీరు విజయం సాధిస్తారు. కొన్ని విషయాలవల్ల కొంత నష్టపోతారు.


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


కర్కాటక రాశి
ఈరోజు మీకు ఆహ్లాదకరమైన ఫలితాలుంటాయి. పోటీ భావన పెరుగుతుంది. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్నవారు గుడ్ న్యూస్ వింటారు. చేసే పనిలో జాప్యాన్ని నివారించండి. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు ఊపందుకుంటాయి. 


సింహ రాశి 
ఈరోజు మీ కళా నైపుణ్యాలు మెరుగుపడతాయి. వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ కీర్తి మరియు గౌరవం పెరిగేకొద్దీ మీరు సంతోషంగా ఉంటారు. పాలన- పరిపాలనా విషయాలలో వేగాన్ని కొనసాగించాలి. అనుకున్న పనులు పూర్తికావడంతో సంతోషంగా ఉంటారు. మీరు తలపెట్టే కొన్ని పనుల్లో తోబుట్టువుల నుంచి సహకారం అవసరం అవుతుంది. ఉద్యోగాల కోసం వెతుకుతున్న వ్యక్తులు మరికొంత కాలం ఆందోళన చెందవలసి ఉంటుంది.


కన్యా రాశి
ఈ రోజు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘకాలిక ప్రణాళిక మెరుగ్గా ఉంటుంది. మీ పనిని విధికి వదిలివేయవద్దు సమస్యలు తలెత్తవచ్చు. మీకు సీనియర్ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మతపరమైన పనులపై మీ విశ్వాసం పెరగడం వల్ల  సంతోషంగా ఉంటారు. 


Also Read: అట్ల తదియ - వివాహితులకే కాదు పెళ్లికానివారికీ ప్రత్యేకమే!


తులా రాశి 
ఈ రోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కెరీర్ కి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీ జీవన శైలి మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. మీ వ్యతిరేకులలో కొందరు మీ సమస్యలను పెంచుతారు. విదేశాలలో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి తగిన మద్దతు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు సకాలంలో పూర్తిచేయాలి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు తీసుకోవద్దు.


వృశ్చిక రాశి
ఈ రోజు మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు ముఖ్యమైన పనిలో చాలా బిజీగా ఉంటారు. కార్యాలంలో మంచి పనితీరు కనబరుస్తారు. భాగస్వామ్యంగా పని చేయడం మీకు చాలా మంచిది. వ్యాపారంలో ఎవ్వరిపైనా అతినమ్మకాన్ని పెంచుకోవద్దు. ఆనందంగా ఉంటారు. మీరు ఎవ్వరి మాటా వినరు..మీకు తోచిన విధంగా మీరు నడుచుకుంటారు.


ధనుస్సు రాశి 
ఈ రోజు మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండొచ్చు. మీ మనసులో మాటని తల్లిదండ్రులను తెలియజేయడానికి మంచి అవకాశం లభిస్తుంది. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నట్లయితే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. స్నేహితులలో ఒకరికి మీ నుంచి సహాయం అవసరం అవుతుంది. కుటుంబంలో ఉన్న ఆందోళనలు దూరమవుతాయి.


మకర రాశి 
ఈ రోజు ఈ రాశివారు వాహనాన్ని జాగ్రత్తగా వినియోగించాలి, ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. మేధో ప్రయత్నాలు వేగవంతమవుతాయి. ఓ ప్రణాళిక ప్రకారం చేయాల్సిన పనులను ప్లాన్ చేసుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారు. రాజకీయాల్లో పనిచేసే వారికి పెద్ద పదవులు దక్కుతాయి. మీ పని ఏదైనా చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటే అది ఈరోజు పూర్తవుతుంది. మీరు స్నేహితులతో కొన్ని వినోద కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. 


Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!


కుంభ రాశి 
ఈ రోజు మీకు సాధారణంగా ఉండబోతోంది. నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. కుటుంబ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మాటని లెక్కచేయని పరిస్థితులు ఎదురవుతాయి.  ఉద్యోగులు గుడ్డిగా పనిచేయవద్దు...జరిగిన తప్పుకి మీరే బాధ్యులు అవుతారు. స్నేహితులను కలుస్తారు. 


మీన రాశి 
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాలను సులభంగా వ్యక్తం చేయగలుగుతారు. సామాజిక కార్యక్రమాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంటారు. ముఖ్యమైన పనిలో వేగాన్ని కొనసాగించండి. అందరినీ వెంట తీసుకెళ్లే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు.