November Horoscope 2023: నవంబరు నెల రాశిఫలాలు


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


మేషరాశి వారికి నవంబర్ నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి.  మీరు వ్యాపారం మరియు వృత్తిలో అభివృద్ధిని పొందే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. అయితే అష్టమంలో గ్రహ సంచారం కారణంగా ఏవో ఆందోళనలు వెంటాడుతాయి. అనవసర వివాదాలు జరిగే అవకాశం ఉంది...జాగ్రత్త.  ఈ నెలలో ప్రయాణాలకు దూరంగా ఉండడమే మంచిది. ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఈ నెలలో మీ ఆరోగ్యం గురించి అప్రమత్తంగా ఉండాలి. 


వృషభ రాశి (Taurus) (కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు)


వృషభ రాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది. ఉద్యోగులకు శుభసమయం. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. మీరు భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకుంటే సరైన సలహాలు లేకుండా ముందు అడుగు వేయొద్దు. కుటుంబంలో విభేదాలు ఉంటాయి.  ఒత్తిడికి లోనవుతారు.


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


నవంబరు నెల మిథున రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మంచి జీతం పొందుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సోదరుల నుంచి సహకారం ఉంటుంది. ఈనెలలో చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. దైవకార్యాల్లో పాల్గొంటారు.


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)కర్కాటక రాశి


కర్కాటక రాశి వారికి ఈ నెల బాగానే ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే సరైన సమయం. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆదాయానికి లోటుండదు. వ్యవహార జయం ఉంటుంది. సంఘంలో పేరు ప్రతిష్ఠలు ఉన్న వ్యక్తులను కలుస్తారు. భూ సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి.   వ్యక్తిగత జీవితంలో చిన్న చిన్న సమస్యలు తప్పవు. ప్రేమికులకు కలిసొచ్చే సమయం కాదిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. 


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


సింహ రాశి (Leo)(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


సింహ రాశివారికి ఈ నెల గ్రహసంచారం అనుకూలంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామి నుంచి మద్దతు  పొందుతారు. వ్యాపారంలో లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీలు రావొచ్చు. ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. బంధువులను కలుస్తారు. చేపట్టిన పనులు సక్సెస్ ఫుల్ గా పూర్తిచేస్తారు. ఈ నెలలో మీకు అనారోగ్య సూచనలున్నాయి. 


కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


నవంబర్ నెల కన్య రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ నెలలో మీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. ఆదాయం బావుంటుంది, ఆరోగ్యం బావుంటుంది, వ్యవహార జయం ఉంటుంది. మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. 


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


నవంబర్ మాసం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. ఈ నెలలో మీకు ఆర్థిక సంబంధిత సమస్యలు తీరుతాయి. భాగస్వామ్య వ్యాపారం కలిసొస్తుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. వృత్తి, వ్యాపారం, ఉద్యోగంలో బాగానే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రయోజం పొందలేరు. ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఉద్రేకంగా కనిపిస్తారు. వాహనప్రమాదాలున్నాయి జాగ్రత్త.


Also Read: అట్ల తదియ - వివాహితులకే కాదు పెళ్లికానివారికీ ప్రత్యేకమే!


వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)


జన్మరాశిలో గ్రహసంచారం ఈ రాశివారి ఆరోగ్యంపై దెబ్బకొడుతుంది. ఏదో ఒక అనారోగ్య సమస్య వెంటాడుతుంటుంది. విపరీతమైన ఉద్రేకంతో ఉంటారు. అందరిపైనా విసుక్కుంటారు, కొన్ని సందర్భాల్లో ఆవేశపూరితంగా ప్రవర్తిస్తారు. అయితే వ్యాపారం, ఉద్యోగంలో మంచి ఫలితాలే సాధిస్తారు. ఆదాయానికి లోటుండదు.


ధనుస్సు రాశి  (Sagittarius) (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 


ధనుస్సు రాశి వారికి నవంబర్ నెల ప్రధమార్థం బావుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలవారికి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారులు కొత్త టెండర్లు పొందుతారు. చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కానీ అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. నవంబరు నెల ద్వితీయార్థంలో 12 వస్థానంలో గ్రహసంచారం వల్ల పనుల్లో ఆటంకాలు, ఊహించని ఖర్చులు తప్పవు.


మకర రాశి (Capricorn) (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు)


నవంబర్ నెల మకరరాశివారికి బావుంటుంది. నిన్న మొన్నటి వరకూ వెంటాడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మీరు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్ సూచనుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు ఓ కొలిక్కి వస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త.


Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!


కుంభ రాశి  (Aquarius) (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు)


నవంబర్ నెలలో కుంభ రాశి గ్రహాలు అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి. త్వరలో గుడ్ న్యూస్ వింటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పనిలోనూ ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. వ్యవహార జయం ఉంటుంది. వాహన లాభం ఉంటుంది. కుటుంబ  సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. 


మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)


మీనరాశివారికి నవంబరు నెలలో మిశ్రమ ఫలితాలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. అనుకోని ఆదాయం చేతికందుతుంది. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. అకాలభోజనం, మనో దుఃఖం, కుటుంబంలో విచారం ఉంటుంది. సంతానం వల్ల ఇబ్బంది పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.