Stock Market Today, 26 June 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.50 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 4 పాయింట్లు లేదా 0.02 శాతం గ్రీన్ కలర్‌లో 18,719 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అరబిందో ఫార్మా: ZEFYLTI (ఫిల్‌గ్రాస్టిమ్ బయోసిమిలర్), DYRUPEG (పెగ్‌ఫిల్‌గ్రాస్టిమ్ బయోసిమిలర్) మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను వెనక్కు తీసుకుంటామన్న అరబిందో ఫార్మా అనుబంధ సంస్థ CuraTeQ బయోలాజిక్స్ అభ్యర్థనను యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) కమిటీ ఆమోదించింది.
రతన్ ఇండియా పవర్: కోటక్ మహీంద్రా బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియంకు చెల్లించాల్సిన రూ. 1,114 కోట్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసినట్లు రతన్ ఇండియా పవర్ ప్రకటించింది.
శ్రీ సిమెంట్: ఆదాయపు పన్ను సోదాలపై శ్రీ సిమెంట్ స్పందించింది. ఐటీ అధికారులకు తాము పూర్తి సహకారం అందజేస్తున్నామని, మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలు అబద్ధమని స్పష్టం చేసింది.
NHPC: ఒడిశాలో 2,000 మెగావాట్ల పంప్‌డ్ స్టోరేజీ ప్రాజెక్టులు, 1,000 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు అభివృద్ధి చేసేందుకు ఒడిశా ప్రభుత్వ రంగ సంస్థతో NHPC లిమిటెడ్ ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
TCS: ఈ నెల ప్రారంభంలో అందిన విజిల్‌బ్లోయర్ ఫిర్యాదుతో, కంపెనీ నియమాల్లో కమీషన్లు వసూలు చేసిన నలుగురు ఉద్యోగులను TCS సస్పెండ్ చేసింది. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై విచారణ జరిపామని, "కంపెనీకి లేదా కంపెనీకి వ్యతిరేకంగా ఎలాంటి మోసం జరగలేదని, ఆర్థిక ప్రభావం లేదని" గుర్తించామని TCS స్పష్టం చేసింది.
జైడస్ లైఫ్: మైలాబ్‌లో రైజింగ్ హోల్డింగ్స్‌కు ఉన్న 6.5% వాటాను కొనుగోలు చేసేందుకు జైడస్ లైఫ్ అనుబంధ కంపెనీ జైడస్ యానిమల్ హెల్త్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రయత్నిస్తోంది.
HDFC లైఫ్: జీఎస్టీ చెల్లించనందుకు రూ.942 కోట్లకు పైగా డిమాండ్ నోటీసు అందిందని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ తెలిపింది.
RVNL: ఎలివేటెడ్ మెట్రో వయాడక్ట్ డిజైన్, నిర్మాణం కోసం మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్స్‌లో అత్యల్ప బిడ్డర్‌గా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ నిలిచింది.
డాక్టర్ రెడ్డీస్: కొత్త ప్రత్యేక విభాగం ‘RGenX’ ప్రారంభించిన డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, భారతదేశంలో ట్రేడ్ జనరిక్స్ వ్యాపారంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది.
గ్రాసిమ్: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన, రూ. 2,000 కోట్లకు మించకుండా, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల జారీకి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర: నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఆర్‌బీఐ రూ. 1.45 కోట్ల పెనాల్టీ విధించింది.
యెస్ బ్యాంక్: డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ. 2,500 కోట్ల వరకు ఇండియన్ లేదా విదేశీ కరెన్సీలో రుణాలు సేకరించేందుకు బ్యాంక్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిది.
IDFC ఫస్ట్ బ్యాంక్: రూ. 1,500 కోట్ల టైర్-2 సబార్డినేటెడ్ డెట్‌ను IDFC ఫస్ట్ బ్యాంక్ విక్రయించే అవకాశం ఉంది, NSE ప్లాట్‌ఫామ్‌లో బిడ్డింగ్‌ను ఓపెన్ చేసే అవకాశం ఉంది.
గోద్రెజ్ ప్రాపర్టీస్: ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ల అభివృద్ధి కోసం కంపెనీ గురుగావ్‌లో 15 ఎకరాల భూమిని పూర్తిగా కొనుగోలు చేసింది.
ఇప్కా ల్యాబ్స్: పితంపూర్‌లోని కంపెనీ ఫార్ములేషన్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను US FDA తనిఖీ చేసింది, 8 పరిశీలనలతో ఫారం 483 జారీ చేసింది.
ఇది కూడా చదవండి: మ్యాజిక్ చేసిన మోదీ, భారీ పెట్టుబడులు ప్రకటించిన గూగుల్ & అమెజాన్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial