Stock Market Today, 22 June 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.40 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX Nifty Futures) 41 పాయింట్లు లేదా 0.22 శాతం రెడ్‌ కలర్‌లో 18,868 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


డెలివెరీ: ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ కార్లైల్ (Carlyle), ఇంటర్నెట్ లాజిస్టిక్స్ సంస్థ డెలివెరీ (Delhivery) నుంచి పూర్తిగా నిష్క్రమిస్తోంది. రిపోర్ట్స్‌ ప్రకారం, బ్లాక్ డీల్ ద్వారా తన మొత్తం వాటాను ఆఫ్‌లోడ్ చేయబోతోంది.


NTPC: మూలధన అవసరాల కోసం వేల కోట్ల రూపాయలను సమీకరించడానికి NTPC ప్లాన్‌ రెడీ చేసింది. రూ. 12,000 కోట్ల వరకు సేకరించడానికి, బాండ్ల జారీని పరిశీలించి, ఆమోదించడానికి ఈ నెల 24న NTPC డైరెక్టర్ల బోర్డు సమావేశం అవుతుంది.


TCS: నెస్ట్‌ (Nest) - TCS తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించాయి. మెరుగైన మెంబర్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించడానికి కాంట్రాక్ట్‌పై సంతకం చేశాయి. ప్రాథమికంగా, 10 సంవత్సరాల కాల గడువుతో ఉన్న ఈ కాంట్రాక్ట్ విలువ 840 మిలియన్‌ పౌండ్లు. 


కల్పతరు ప్రాజెక్ట్స్‌: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన రూ. 300 కోట్ల విలువైన అన్‌ సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్, రిడీమబుల్, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్ల జారీకి కల్పతరు ప్రాజెక్ట్స్‌ (Kalpataru Projects) డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


LTIMindtree: ఎల్‌టీఐమైండ్‌ట్రీ Canvas.aiని ప్రారంభించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను (AI) ఉపయోగించి, వ్యాపారానికి సంబంధించిన కాన్సెప్ట్-టు-వాల్యూ జర్నీని వేగవంతం చేయడానికి దీనిని రూపొందించింది.


జీ ఎంటర్‌టైన్‌మెంట్: 2019లో, ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీతో జీ ఎంటర్‌టైన్‌మెంట్ (ZEE Entertainment) సెటిల్‌మెంట్‌ చేసుకుంది. దాని కోసం రూ. 7 లక్షలు జరిమానా చెల్లించింది.


HDFC AMC: హెచ్‌డీఎఫ్‌సీ ఎఎంసీలో తన వాటాను ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI Mutual Fund) భారీగా పెంచుకుంది. గతంలో ఉన్న స్టేక్‌ను 2.9 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది.


శ్యామ్ మెటాలిక్స్: పశ్చిమ బంగాల్‌లోని జమురియాలో ఉన్న తయారీ ఫ్లాంట్‌లో మరిన్ని ప్రొడక్షన్‌ కెపాసిటీస్‌ ప్రారంభించినట్లు శ్యామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ (Shyam Metalics and Energy) ప్రకటించింది. దీంతో, క్యాప్టివ్ పవర్ ప్లాంట్ సామర్థ్యం 90 మెగావాట్లు పెరిగి, ప్రస్తుతం ఉన్న 267 మెగావాట్ల నుంచి 357 మెగావాట్లకు చేరుతుంది.


ఇది కూడా చదవండి: తాకట్టు కొట్టు నుంచి మల్టీబ్యాగర్‌ స్థాయికి, ఏడాదిలో ఎంత మార్పు? 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.