Multibagger Stocks: BSE500లోని కొన్ని కంపెనీల్లో, 2023 మార్చి చివరి నాటికి ప్రమోటర్ల షేర్స్‌ ప్లెడ్జ్‌ (వాటాల తాకట్టు) బాగా తగ్గింది. అది పాజిటివ్‌ మంత్రంగా పని చేసింది, షేర్ల ర్యాలీకి ఒక కారణమైంది.


గత ఆర్థిక సంవత్సరంలో (FY23) ప్రమోటర్‌ షేర్ల తాకట్టు బాగా తగ్గిన ఐదు కంపెనీల స్టాక్స్‌ మల్టీబ్యాగర్స్‌గా మారాయి. అవి.. అపోలో టైర్స్, జిందాల్ స్టెయిన్‌లెస్, NCC, సుజ్లాన్ ఎనర్జీ, CG పవర్ & ఇండస్ట్రియల్ సొల్యూషన్స్.


తాకట్టు తగ్గించుకున్న మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌


ఈ 5 స్టాక్స్‌లో.. CG పవర్ & ఇండస్ట్రియల్ సొల్యూషన్స్‌ను (CG Power and Industrial Solutions Ltd) సూపర్‌ హీరోగా చెప్పుకోవచ్చు. 2022 మార్చి 31 నాటికి 97% వాటా తాకట్టులో ఉంది. అంటే, దాదాపు ప్రమోటర్ల వాటా మొత్తం తాకట్టు కొట్టుకు వెళ్లింది. అక్కడి నుంచి ఒక్క ఏడాదిలో పుంజుకుని, మొత్తం షేర్లను వెనక్కు తీసుకొచ్చారు. 2023 మార్చి 31 నాటికి ప్రమోటర్ల వాటాలో ఒక్క షేర్‌ కూడా ప్లెడ్జ్‌లో లేదు. అదే కాలంలో ఈ స్టాక్‌ 127% రిటర్న్స్‌ ఇచ్చింది. 


అపోలో టైర్స్‌లో ‍‌(Apollo Tyres Ltd) ప్రమోటర్లు తాకట్టు పెట్టిన షేర్ల వాటా ఈ ఏడాది మార్చి చివరి 31 నాటికి 1.07 శాతంగా ఉంది. సరిగ్గా ఏడాది క్రితం ఇది 3.05 శాతంగా ఉంది. FY23లో దాదాపు 2 శాతం షేర్లను ప్రమోటర్లు విడిపించుకున్నారు. అదే కాలంలో, ఈ టైర్ మాన్యుఫాక్చరింగ్‌ స్టాక్‌ 134 శాతం పరుగుతో లాభాల ర్యాలీ చేసింది.


జిందాల్‌ స్టెయిల్‌నెస్‌ (Jindal Stainless Ltd) ప్రమోటర్ల ప్లెడ్జ్‌లో మార్పు రాలేదు గానీ, ఒక్క షేర్‌ కూడా పెరగలేదు. 2022 మార్చి చివరి నాటి ఉన్న 78 శాతాన్నే 2023 మార్చి చివరి నాటికి కూడా కంటిన్యూ చేశారు. అయితే, ఈ కౌంటర్‌ రెండు రెట్లకు పైగా లాభాలను (233%) ఇన్వెస్టర్లకు సంపాదించి పెట్టింది.


నిర్మాణ సంస్థ NCC విషయానికి వస్తే.. ఈ కంపెనీ ప్రమోటర్లు తనఖా పెట్టిన వాటా గత ఆర్థిక సంవత్సరంలో భారీగా తగ్గింది. 2022 మార్చి 31 నాటి 18.81 శాతం నుంచి, 2023 మార్చి 31 నాటికి కేవలం 3.34 శాతానికి తగ్గింది. గత 1 సంవత్సర కాలంలో, ఈ స్టాక్ విలువ రెట్టింపు అయింది.


ఒకప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన సుజ్లాన్ ఎనర్జీ (Suzlon Energy) కూడా, షేర్‌ ప్లెడ్జ్‌ విషయంలో గుడ్‌ ఇప్రెషన్‌ కొట్టేసింది. కంపెనీలో ప్రమోటర్ల ప్లెడ్జ్‌ చేసిన వాటా 2022 మార్చి చివరి నాటికి ఉన్న 88.5 శాతం నుంచి 2023 మార్చి చివరి నాటికి 80.7 శాతానికి తగ్గింది, ఉంది. బ్యాలెన్స్‌ షీట్‌ను బ్యాలెన్స్‌డ్‌గా మార్చడానికి ఈ కంపెనీ చేసిన కొత్త ప్రయత్నాలకు దలాల్‌ స్ట్రీట్‌ ఫిదా అయింది, ఈ స్టాక్‌ మల్టీబ్యాగర్‌గా మారింది.


FY23లో ప్రమోటర్ల ప్లెడ్జ్‌ బాగా తగ్గిన మరికొన్ని స్టాక్స్‌


రేమండ్‌ - 27 శాతం నుంచి 22 శాతానికి తగ్గింది - స్టాక్‌ ఇచ్చిన రాబడి 93 శాతం
జిందాల్‌ స్టీల్‌ & పవర్‌ - 40 శాతం నుంచి 36 శాతానికి తగ్గింది - స్టాక్‌ ఇచ్చిన రిటర్న్స్‌ 67 శాతం 
కల్పతరు ప్రాజెక్ట్స్‌ - 52 శాతం నుంచి 49 శాతానికి తగ్గింది - స్టాక్‌ తెచ్చిన లాభం 51 శాతం
లెమన్‌ ట్రీ హోటల్స్‌ - 23 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది - స్టాక్‌ ఇచ్చిన రిటర్న్స్‌ 48 శాతం


మరో ఆసక్తికర కథనం: గుడ్‌ న్యూస్‌, ఈ స్పెషల్‌ FD గడువు పెంచిన SBI 


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial