Stock Market Today, 21 August 2023: NSE నిఫ్టీ శుక్రవారం 19,310 వద్ద క్లోజ్ అయింది. గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి 19 పాయింట్లు లేదా 0.10 శాతం రెడ్ కలర్‌లో 19,310 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
SJS ఎంటర్‌ప్రైజెస్: ఈస్తటిక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే ఎస్‌జేఎస్ ఎంటర్‌ప్రైజెస్‌లో తనకు ఉన్న వాటా కొంత భాగాన్ని మార్క్యూ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా శుక్రవారం ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా రూ. 11.6 కోట్లకు విక్రయించారు. శుక్రవారం, ఈ షేర్ ధర రూ. 637.10 దగ్గర ముగిసింది.
జియో ఫైనాన్షియల్: మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries Ltd) నుంచి ఇటీవలే విడిపోయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవాళ దలాల్ స్ట్రీట్‌లో అడుగు పెడుతుంది. ఈ రోజు ఈ కంపెనీ షేర్లు స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రిలయన్స్ షేర్లు కూడా మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
కోటక్ మహీంద్ర బ్యాంక్: బ్యాంక్ అట్రిషన్ ఛాలెంజ్ జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో కేంద్రీకృతమై ఉందని కోటక్ మహీంద్ర బ్యాంక్ ఛైర్మన్ ప్రకాష్ ఆప్టే చెప్పారు. కంపెనీ నుంచి బయటకు వెళ్లే ఉద్యోగుల్లో జూనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలోని వ్యక్తులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేదని ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించారు.
PNB హౌసింగ్ ఫైనాన్స్: తన ఫోకస్డ్ & మల్టీ-ప్రోంజ్డ్ రిజల్యూషన్ స్ట్రాటజీ ద్వారా 784 కోట్ల రూపాయల లార్జ్ కార్పొరేట్ నాన్ పెర్ఫార్మింగ్ అకౌంట్‌ను విజయవంతంగా పరిష్కరించిందని, బకాయిని పూర్తిగా రికవరీ చేసిందని PNB హౌసింగ్ ఫైనాన్స్ తెలిపింది.
టైటన్: టాటా గ్రూప్‌లోని ఆభరణాలు & వాచ్‌లు అమ్మే కంపెనీ టైటన్, తన అనుబంధ సంస్థ క్యారట్‌లేన్ ట్రేడింగ్‌లో (CaratLane Trading) అదనంగా 27.18% ఈక్విటీ షేర్లను రూ. 4621 కోట్లకు కొనుగోలు చేయబోతోంది.
అశోక్ లేలాండ్: రెండు అనుబంధ సంస్థలు ఆప్టేర్ పీఎల్‌సీ (Optare Plc), స్విచ్ మొబిలిటీ యూకే (Switch Mobility UK) లెండర్ ఫెసిలిటీలను కవర్ చేయడానికి రూ. 870 కోట్ల కార్పొరేట్ హామీని అశోక్ లేలాండ్ జారీ చేస్తుంది.
మహీంద్ర & మహీంద్ర: ఎంపిక చేసిన XUV మోడళ్లలో సెలెక్ట్ చేసిన మోడళ్లను తనిఖీ చేస్తామని మహీంద్ర & మహీంద్ర ప్రకటించింది.
KEC ఇంటర్నేషనల్: RPG గ్రూప్ కంపెనీ అయిన KEC ఇంటర్నేషనల్, తన వివిధ వ్యాపారాలకు సంబంధించి రూ. 1,007 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌లను దక్కించుకుంది.
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC): దక్షిణ చైనా సముద్రంలోని 'బ్లాక్ 128'లో అన్వేషణ కొనసాగించడానికి వియత్నాం ప్రభుత్వం నుంచి మరో మూడు సంవత్సరాల ప్రాజెక్ట్ పొడిగింపును 'ONGC విదేశ్' పొందింది.
ఇది కూడా చదవండి: కొత్త కారు కొనాలనుకుంటే సెప్టెంబర్ 4 వరకు ఆగండి - అదిరిపోయే కారు దించుతున్న హోండా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial