Stock Market Today, 20 July 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 3 పాయింట్లు లేదా 0.02 శాతం రెడ్‌ కలర్‌లో 19,838 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ Q1 రిజల్ట్స్‌: HUL, ఇన్ఫోసిస్, హావెల్స్, యునైటెడ్ స్పిరిట్స్ ఇవాళ జూన్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తాయి. కాబట్టి, ఈ స్టాక్స్‌ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


L&T ఫైనాన్స్: ఎల్ అండ్ టి ఫైనాన్స్ హోల్డింగ్స్ మొదటి త్రైమాసికంలో నికర లాభం రెండింతలు పెరిగి రూ.531 కోట్లకు చేరుకుంది. రిపోర్టింగ్ త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 8% పెరిగి రూ.3,223 కోట్లకు చేరుకుంది.


టాటా కమ్యూనికేషన్స్: జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో టాటా కమ్యూనికేషన్స్ నికర లాభం 30% తగ్గి రూ. 382 కోట్లకు పరిమితమైంది. కార్యకలాపాల ఆదాయం 11% పెరిగి రూ. 4,771 కోట్లకు చేరుకుంది.


మాస్టెక్: Q1 FY24లో మాస్టెక్ రూ. 70 కోట్ల నికర లాభం ఆర్జించింది, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 9% తగ్గింది. ఈ త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన 27% పెరిగి రూ. 725 కోట్లకు చేరుకుంది.


ఫెడరల్ బ్యాంక్: QIP (క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్) ఇష్యూను ఫెడరల్ బ్యాంక్ ప్రారంభించింది. ఒక్కో షేరుకు ఫ్లోర్ ప్రైస్‌గా రూ. 132.59 నిర్ణయించింది.


ఫినోలెక్స్ ఇండస్ట్రీస్: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 115 కోట్ల నికర లాభాన్ని ఫినోలెక్స్ ఇండస్ట్రీస్ మిగుల్చుకుంది, ఆదాయం రూ. 1,179 కోట్లుగా ఉన్నాయి.


శ్రీ సిమెంట్: ఈ సిమెంట్‌ కంపెనీ  ఆర్డర్ ఆఫ్‌ ఇన్‌స్పెక్షన్‌ కోసం ప్రభుత్వం నుంచి లెటర్‌ అందుకుంది.


కాన్‌ ఫిన్ హోమ్స్‌: జూన్ త్రైమాసికంలో కాన్‌ ఫిన్ హోమ్స్ రూ. 183 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది, నికర వడ్డీ ఆదాయం రూ. 285 కోట్లకు పెరిగింది.


డాక్టర్ రెడ్డీస్: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ కంపెనీ API తయారీ కేంద్రంలో ప్రి-అప్రూవల్‌ తనిఖీని USFDA పూర్తి చేసింది, ఎలాంటి అబ్జర్వేషన్లు లేవు. 


హాట్సన్ ఆగ్రో: ఏప్రిల్-జూన్ కాలానికి హ్యాట్సన్ ఆగ్రో రూ. 80 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా రూ. 2,150 కోట్ల ఆదాయం వచ్చింది.


LIC: కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా సత్ పాల్ భానును లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌ (LIC) నియమించింది.


ఒలెక్ట్రా గ్రీన్‌టెక్: హైదరాబాద్‌లోని గ్రీన్‌ ఫీల్డ్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రాన్ని నిర్మించేందుకు మేఘా ఇంజినీరింగ్‌కు కాంట్రాక్ట్‌ అప్పగించింది.


ఇది కూడా చదవండి: ఇన్‌కమ్‌ టాక్స్‌ రూల్‌ ప్రకారం ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చు?


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial