సీజన్ లో మార్పులు జీవనశైలి, ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. అప్పుడే సీజన్ల వారీగా వచ్చే అనారోగ్యాలని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతాం. మాన్ సూన్ సీజన్ లో ఛాయ్, పకోడా, మ్యాగీ ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. తేమతో కూడిన వాతావరణంలో బ్యాక్టీరియా, శిలీంధ్రాలు వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లకి దారి తీసే సమయం. అందుకే ఈ టైమ్ ఏమి తినాలి ఏం తినకూడదనే దాని గురించి తెలుసుకోవాలి.
ఇవి మంచిది
మజ్జిగ, పెరుగు, సోయా బీన్స్ వంటి ప్రొబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాతో నిండి ఉంటాయి. ఇవి వర్షాకాలంలో జీర్ణ ఆరోగ్యానికి సహాయపడతాయి.
విటమిన్ సి ఆహారం: విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పోరాడేందుకు ఉపయోగపడతాయి.
మొలకలు: మొలకలు ఆరోగ్యానికిమంచిది. ప్రోటీన్ రిచ్ మొలకలు అల్పాహారంలో తీసుకుంటే మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరం జెర్మ్స్ తో పోరాడేందుకు సహాయపడుతుంది.
పసుపు పాలు: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని అందిస్తాయి. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వర్షాకాలంలో ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగాలి.
తులసి: తులసిని పవిత్రమైన మూలికగా పరిగణిస్తారు. ఒత్తిడిని తగ్గించి శక్తి స్థాయిలని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స తో పోరాడతాయి.
అల్లం: అల్లంలో జింజెరోల్స్, పారాడోల్స్, సెస్క్విటెర్పెనెస్, షోగోల్స్ తో నిండి ఉన్నాయి. ఇవన్నీ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు. జలుబు, ఫ్లూని దూరంగా ఉంచుతుంది.
నల్లమిరియాలు: పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఇతర జీర్ణాశయాంతర సమస్యల్ని తగ్గిస్తుంది. జ్వరాన్ని తగ్గించే గుణాలు ఉండటమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వెల్లుల్లి: వర్షాకాలంలో ఆహారంలో చేర్చుకోవాల్సిన అద్భుతమైన పదార్థం. అల్లిసిన్ ఇందులో ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచి వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
నివారించాల్సిన ఆహారాలు
☀స్ట్రీట్ ఫుడ్ రుచికరమైనవి. కానీ వాటికి దూరంగా ఉండాలి. తేమ, బ్యాక్టీరియాతో కూడిన గాలి ఆ ఆహారాన్ని కలుషితం చేస్తుంది.
☀పచ్చి కూరగాయలకు దూరంగా ఉండాలి. ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండేందుకు వీటిని ఉడికించిన తర్వాత తీసుకోవడమే మంచిది.
☀వర్షాకాలంలో చేపలు, సముద్ర జీవులు సంతానోత్పత్తి సమయం. సీ ఫుడ్ నివారించడమే మంచిది.
☀వేయించిన ఆహారాన్ని దూరంగా ఉంచాలి.
☀జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఫుడ్ ఏదైనా సరే దాన్ని విస్మరించడం మంచిది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: రాత్రిపూట అతిగా చెమటలు పడుతున్నాయా? ఆ ప్రాణాంతక వ్యాధికి ఇది సంకేతం!
Join Us on Telegram:https://t.me/abpdesamofficial