Stock Market Today, 18 August 2023: NSE నిఫ్టీ నిన్న (గురువారం) 19,365 వద్ద క్లోజ్ అయింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 17 పాయింట్లు లేదా 0.09 శాతం గ్రీన్ కలర్‌లో 19,300 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ ఫ్లాట్/పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
నైకా, HDFC AMC, ఇండస్ టవర్స్, పేజ్ ఇండస్ట్రీస్, ACC: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) ఇండెక్స్‌ల తాజా రివిజన్‌లో భాగంగా నైకా, HDFC AMC, ఇండస్ టవర్స్, పేజ్ ఇండస్ట్రీస్, ACC స్టాక్స్‌ను నిఫ్టీ నెక్స్ట్50 సూచీ నుంచి తొలగించారు.
యథార్థ్ హాస్పిటల్: 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో యథార్థ్ హాస్పిటల్ ఏకీకృత నికర లాభం గత సంవత్సరం ఇదే కాలం కంటే 73% వృద్ధితో రూ. 19 కోట్లకు చేరుకుంది. ఆదాయం కూడా 39% జంప్‌తో రూ. 154 కోట్లకు పెరిగింది. ఎబిటా 61% వృద్ధితో రూ. 41.4 కోట్లుగా నమోదైంది.
కాంకర్డ్ బయోటెక్: ఈ కంపెనీ షేర్లు ఈ రోజు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతాయి. ఈ స్టాక్ 15% పైగా ప్రీమియంతో లిస్ట్ అవుతుందని అంచనా. ఈ ఐపీవో ఈ నెల 4న ఓపెన్ అయింది, 8వ క్లోజ్ అయింది. పబ్లిక్ ఆఫర్‌లో ఒక్కో షేర్‌ను రూ. 705 నుంచి రూ. 741 రేంజ్‌లో కంపెనీ అమ్మింది.
యాక్సిస్ బ్యాంక్: బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుబ్రత్ మొహంతిని మూడేళ్ల పాటు అప్పాయింట్ చేసేందుకు ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. మొహంతి నియామకం ఈ నెల 17 నుంచి అమలులోకి వచ్చింది.
అదానీ ఎంటర్‌ప్రైజెస్: ఇండియన్ బిలియనీర్ గౌతమ్ అదానీ గ్రూప్ రూ. 15,000 కోట్ల (1.8 బిలియన్ డాలర్లు) విలువైన బాండ్లను విక్రయించడానికి సిద్ధపడిన నేపథ్యంలో, గత వారం, స్థానిక బాండ్ నిర్వాహకుల బృందాన్ని సైట్ విజిట్‌కు తీసుకెళ్లింది.
అదానీ ఎనర్జీ: KPS 1 ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్ కొనుగోలు కోసం కంపెనీ మేఘా ఇంజినీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో అదానీ ఎనర్జీ ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
ONGC: తక్కువ కార్బన్ ఎనర్జీ ప్లేయర్‌గా రూపాంతరం చెందడానికి ఈ దశాబ్దం చివరి నాటికి రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడి పెడతామని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్రకటించింది. రెన్యువబుల్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియోను 2030 నాటికి 10 గిగావాట్లకు పెంచుకోవాలని ప్లాన్ చేసినట్లు ఈ కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీ తెలిపింది.
JSW స్టీల్: టెక్ రిసోర్సెస్‌కు (Teck Resources) చెందిన స్టీల్ మేకింగ్ కోల్ బిజినెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం బిడ్ వేయడానికి, ఒక కన్సార్టియం ఏర్పాటు చేయాలని JSW స్టీల్ ఆలోచిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ చేసింది.
కిమ్స్ హాస్పిటల్స్: గత ఏడాది జూన్‌లో ఏర్పాటైన కొండాపూర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 8.06% వాటాను కిమ్స్ హాస్పిటల్స్ (Krishna Institute Of Medical Sciencs Ltd) కొనుగోలు చేసింది. తన అనుబంధ సంస్థ కిమ్స్ హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, ఒక్కో షేరును రూ. 10 చొప్పున కొనుగోలు చేసింది.
ఇది కూడా చదవండి: ఫెస్టివ్ ఆఫర్ - ఈ రాష్ట్రాల్లోని సెంట్రల్ గవర్నమెంట్ సిబ్బందికి ముందుగానే జీతం, పెన్షన్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial