Central Govt Employees: మన దేశంలో ఫెస్టివ్ సీజన్ స్టార్ట్ అవుతోంది. పండుగ అంటే సంబరాలతో పాటు ఖర్చులు కూడా ఉంటాయి. పండుగల సమయంలో డబ్బుల కోసం ఉద్యోగులు ఇబ్బంది పడకుండా, కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓనం (Onam), వినాయక చవతి (Ganesh Chaturthi) పండుగలను పురస్కరించుకుని.. కేరళ, మహారాష్ట్రలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్‌లను ముందుగానే విడుదల చేయాలని నిర్ణయించింది.
కేరళలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆగస్టు నెల జీతాన్ని ఆగస్టు 25నే తీసుకోవచ్చని (Salary In Advance) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆఫీస్ మెమోరాండం ఇచ్చింది. మహారాష్ట్రలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్ జీతాన్ని సెప్టెంబర్ 27నే విత్‌డ్రా చేసుకోవచ్చు.
పెన్షనర్లకు కూడా ముందుగానే డబ్బులు
ఆ రెండు రాష్ట్రాలలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అవే రోజుల్లో పింఛన్లు (Pension In Advance) పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు/PAOలకు సూచించింది.
కేరళ/మహారాష్ట్రలో పని చేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయిస్‌కు కూడా జీతాలను ఆగస్టు 25/సెప్టెంబర్ 27న, ముందుగానే పంపిణీ చేయవచ్చని ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పింది.
మరో ఆసక్తికర కథనం: మిస్సైళ్లను మరిపించిన మల్టీబ్యాగర్ డిఫెన్స్ షేర్లు, 3 రోజుల్లోనే 40% అప్
ముందస్తుగా ఇచ్చిన జీతం/వేతనం/పెన్షన్‌ను అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రతి ఉద్యోగి/పెన్షనర్ పూర్తి నెల జీతం/వేతనాలు/పెన్షన్‌ను నిర్ణయించిన తర్వాత, ముందస్తు చెల్లింపు ప్రకారం ఏదైనా సర్దుబాటు ఉంటే చేయాలని మెమొరాండంలో స్పష్టం చేసింది.
ముందస్తుగానే జీతం చెల్లింపులకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్లకు ఏమైనా డౌట్స్ ఉంటే కేరళ, మహారాష్ట్రలోని తమ కార్యాలయాల దృష్టికి తీసుకురావాలని కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
కేరళ ప్రభుత్వ ఉద్యోగులు ఓనం బోనస్
ఓనం వేడుకల్లో భాగంగా, కేరళ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 4,000 బోనస్‌ను (Onam bonus) కూడా ప్రకటించింది. బోనస్‌కు అర్హత సాధించని ఉద్యోగులు ప్రత్యేక పండుగ భత్యం (special festival allowance) రూ. 2,750 అందుకుంటారు.
అంతేకాదు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) కింద పదవీ విరమణ చేసిన సర్వీస్ పెన్షనర్లు, ఉద్యోగులకు ప్రత్యేక పండుగ అలవెన్స్ రూపంలో 1,000 రూపాయలు అందుతుంది.
గత ఏడాది బోనస్‌లు పొందిన కాంట్రాక్ట్ స్కీమ్ వర్కర్లు సహా అన్ని కేటగిరీల ఉద్యోగులు ఈ సంవత్సరం అదే రేట్‌లో బోనస్‌ను అందుకుంటారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని 13 లక్షల మందికి పైగా ప్రభుత్వ రంగ కార్మికులు ప్రయోజనం పొందుతారని కేరళ ప్రభుత్వం వెల్లడించింది.
మరో ఆసక్తికర కథనం: ఇన్‌కమ్ టాక్స్ రిటర్నుల్లో ఈ 5 రాష్ట్రాలదే సగం వాటా, తెలుగు స్టేట్ ఒక్కటీ లేదు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial